IPL 2022: విరాట్‌ కోహ్లీ నాలుగు లేదా ఐదో నెంబర్‌లో బ్యాటింగ్‌ చేయాలి.. భారత మాజీ ఆటగాడి సలహా..!

|

Apr 24, 2022 | 6:47 PM

IPL 2022: గత ఏడాది కాలంగా భారత క్రికెట్‌లో విరాట్ కోహ్లీ ఫామ్ గురించి చాలా చర్చ జరుగుతుంది. IPL 2022లో అది మరింతగా పెరిగింది. ముఖ్యంగా గత రెండు మ్యాచ్‌ల్లో

IPL 2022: విరాట్‌ కోహ్లీ నాలుగు లేదా ఐదో నెంబర్‌లో బ్యాటింగ్‌ చేయాలి.. భారత మాజీ ఆటగాడి సలహా..!
Virat Kohli
Follow us on

IPL 2022: గత ఏడాది కాలంగా భారత క్రికెట్‌లో విరాట్ కోహ్లీ ఫామ్ గురించి చాలా చర్చ జరుగుతుంది. IPL 2022లో అది మరింతగా పెరిగింది. ముఖ్యంగా గత రెండు మ్యాచ్‌ల్లో కోహ్లీ తొలి బంతికే ఔట్‌ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సహజంగానే కోహ్లీకి భిన్నమైన సలహాలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు భారత మాజీ బ్యాట్స్‌మెన్ వసీం జాఫర్ కూడా ఓ సలహా అందించాడు. అతను బ్యాటింగ్ పొజిషన్‌ను మార్చితే బాగా ఆడుతాడని చెబుతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గత సీజన్‌లో ఓపెనింగ్ చేశాడు. కానీ ఈ సీజన్‌లో యువ బ్యాట్స్‌మెన్ అనుజ్ రావత్‌కి అవకాశం ఇచ్చారు. అయితే అతను కూడా పరుగులు చేయడంలో విఫలమవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లి మళ్లీ ఓపెనింగ్‌ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

4 లేదా 5వ నంబర్‌లో ఆడాలి: జాఫర్

వసీం జాఫర్ కోహ్లి బ్యాటింగ్ పొజిషన్‌ మార్చాలని సూచిస్తున్నాడు. అయితే అతని సూచన మిగతా వారి కంటే భిన్నంగా ఉంది. కోహ్లి మూడో నంబర్‌కు బదులుగా నాలుగు లేదా ఐదో పొజిషన్‌లో బ్యాటింగ్‌ చేయాలని అభిప్రాయపడ్డాడు. క్రిక్‌ట్రాకర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. “విరాట్ తిరిగి నాలుగో స్థానానికి రావాలి లేదా ఐదవ స్థానంలో బ్యాటింగ్‌ చేయాలి. అప్పుడే పరుగులు చేయగలడు” అని తెలిపాడు. ఈ సందర్భంలో జాఫర్ సూచన ప్రాధాన్యతని సంతరించుకుంది. ఎందుకంటే కోహ్లీ రెండు, మూడో ఓవర్ వరకు క్రీజులోకి వస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడి వల్ల సరిగ్గా ఆడలేకపోతున్నాడు. కోహ్లి చాలా కాలంగా టీ20లో, భారత జట్టు తరఫున మూడో స్థానంలో ఆడుతున్నాడు. RCB కోసం చాలాసార్లు ఓపెనింగ్ చేసాడు. కానీ అతను నాలుగో నంబర్‌లో తక్కువగా బ్యాటింగ్‌కి వచ్చాడు. గతేడాది టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా ఒకటి, రెండు మ్యాచ్‌ల్లో నాలుగో ర్యాంక్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

IPL 2022: ఒక్క మ్యాచ్‌ ఆడి ‘సూపర్ మ్యాన్’ అయ్యాడు.. ఎవరో తెలుసా..?

Yamaha Fascino125: సరికొత్త రంగులో ఫాసినో 125 స్కూటర్.. సుజుకి యాక్సెస్ టీవీఎస్‌ జూపిటర్‌కి గట్టి పోటీ..!

Bank Of India Recruitment 2022: బ్యాంకు ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఏప్రిల్‌ 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ..!