IPL 2025: ఆర్సీబీలో ఏం జరుగుతోంది..? ముగ్గురు స్టార్‌ ప్లేయర్లకు ఒకేసారి గాయాలు..! ఈ సారి కూడా నిరాశేనా..?

ఐపీఎల్ 2025 చివరి దశలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు కీలక ఆటగాళ్ళ గాయాలతో అత్యంత కష్టకాలం ఎదుర్కొంటోంది. కెప్టెన్ రజత్ పాటిదార్, ఫిల్ సాల్ట్, జోష్ హాజిల్‌వుడ్ మరియు దేవదత్ పడిక్కల్ గాయాలతో బాధపడుతున్నారు. ఈ గాయాలు ఆర్సీబీ ప్లేఆఫ్స్‌ అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరుకోవడానికి మంచి స్థానంలో ఉన్నప్పటికీ, ఈ గాయాలతో వారి ప్రయాణం కష్టతరమవుతుంది.

IPL 2025: ఆర్సీబీలో ఏం జరుగుతోంది..? ముగ్గురు స్టార్‌ ప్లేయర్లకు ఒకేసారి గాయాలు..! ఈ సారి కూడా నిరాశేనా..?
ఇదిలా ఉండగా, ఐపీఎల్ తిరిగి ప్రారంభమైనప్పటికీ, జోష్ హేజిల్‌వుడ్ ఆర్‌సీబీ జట్టులో చేరలేదు. దీనికి ప్రధాన కారణం భుజం నొప్పి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భుజం గాయానికి గురైన హేజిల్‌వుడ్.. సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ఆడలేదు.

Updated on: May 08, 2025 | 7:35 PM

ఐపీఎల్ 2025 చివరి దశకు చేరుకుంది. ప్లేఆఫ్స్‌కు చేరుకోవడానికి దాదాపు 7 జట్లు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఇంతలో పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ షాక్‌ తగిలింది. నిజానికి ఆర్సీబీలోని ముగ్గురు బిగ్ మ్యాచ్ విన్నర్లు అకస్మాత్తుగా గాయపడ్డారు. దీంతో ఈ సారి కూడా ట్రోఫీని గెలుచుకోవాలనే వారి కల కలగానే మిగిలిపోతుందనే భయం ఆర్సీబీ అభిమానుల్లో కలుగుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆర్సీబీ ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు 11 మ్యాచ్‌ల్లో 8 గెలిచింది. కేవలం మూడింటిలో మాత్రమే ఓటమిని చవిచూసింది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది.

అయితే ఇటువంటి పరిస్థితిలో టీమ్‌లోని ముగ్గురు కీలక ఆటగాళ్లు గాయపడటం ఆర్సీబీని కలవరపెడుతోంది. కెప్టెన్ రజత్ పాటిదార్, ఓపెనర్ ఫిల్ సాల్ట్, ఫాస్ట్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ గాయాలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే గాయంతో దేవదత్‌ పడిక్కల్‌ జట్టుకు పూర్తిగా దూరం అయ్యాడు. అతని స్థానంలో మయాంక్‌ యాదవ్‌ను తీసుకుంది ఆర్సీబీ. అయితే పైన చెప్పుకున్న నలుగురు ఆటగాళ్లు ప్రస్తుతం ఫామ్‌లో ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ రజత్ పాటిదార్ వేలికి గాయమైంది. దీంతో అతను లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఆడటం డౌటే. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ ఫిల్ సాల్ట్ వైరల్ జ్వరం కారణంగా గత రెండు మ్యాచ్‌లు ఆడలేకపోయాడు.

అతను ఇంకా జ్వరం నుండి పూర్తిగా కోలుకోలేదు. అతని స్థానంలో జాకబ్ బెథెల్‌ను జట్టులో చేర్చారు. గత మ్యాచ్‌లో బెథెల్ అద్భుతమైన హాఫ్‌ సెంచరీ చేశాడు కాబట్టి ఒక ప్లేస్‌ అయితే సేఫ్‌. ఆర్సీబీలో మ్యాచ్‌ విన్నింగ్‌ బౌలర్‌ జోష్ హేజిల్‌వుడ్ భుజం గాయం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడలేకపోయాడు. అతను తదుపరి మ్యాచ్‌లో ఆడటం కూడా సందేహాస్పదంగా మారింది. దీనితో పాటు CSK పై తుఫాను ఇన్నింగ్స్‌ ఆడిన ఆల్ రౌండర్ రొమారియో షెపర్డ్ వెస్టిండీస్‌ తరఫున ఆడేందుకు టోర్నీ చివర్లో అంటే ప్లే ఆఫ్స్‌ మొదలయ్యే టైమ్‌కి ఆర్సీబీని వీడే ఛాన్స్‌ కనిపిస్తోంది. సో.. ప్లే ఆఫ్స్‌లో ఈ నలుగురు లేకుండా ఉంటే.. ఆర్సీబీ కచ్చితంగా బలహీన పడే ఛాన్స్‌ ఉంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..