ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) 16వ ఎడిషన్ టోర్నమెంట్‌లో 53 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. కొన్ని జట్ల నుంచి అనూహ్య ప్రదర్శనలు వస్తున్నాయి. ప్రత్యర్థికి 200+ టార్గెట్ ఇచ్చినా.. ఈ టోర్నీలో సులువుగా ఛేజింగ్ చేస్తూ విజయాలు సొంతం చేసుకుంటున్నాయి. అలాగే 20వ ఓవర్ ఆఖరి బంతికి విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఇలా ఎన్నో ఉత్కంఠభరితమైన పోరాటాలకు ఈ ఐపీఎల్ వేదికగా మారింది. సోమవారం జరిగిన కేకేఆర్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ కోల్‌కతా చివరి బంతికి ఫోర్ కొట్టి ఉత్కంఠ విజయం సాధించింది. నేడు ముంబై ఇండియన్స్, ఆర్‌సీబీ (MI vs RCB) తలపడనున్నాయి. ప్రస్తుత IPL 2023 పాయింట్ల పట్టిక ఎలా ఉంది? ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ ఎవరి వద్ద ఉందో ఇప్పుడు చూద్దాం..
గుజరాత్ టైటాన్స్ జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చి అగ్రస్థానాన్ని ఖాయం చేసుకుని ప్లే ఆఫ్స్‌లోకి ప్రవేశించిన తొలి జట్టుగా నిలిచింది. ఆడిన 11 మ్యాచ్‌లలో, ఎనిమిది గెలిచి, మూడు ఓడిపోయింది. +0.951 రన్ రేట్‌తో 16 పాయింట్లు ఖాతాలో ఉన్నాయి.
ఎంఎస్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రెండో స్థానంలో ఉంది. ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఆరు గెలిచి నాలుగు ఓడిపోయి మొత్తం 13 పాయింట్లు సాధించింది. రన్ రేట్ +0.409గా నిలిచింది.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు మూడో స్థానంలో ఉంది. ఆడిన పదకొండు గేమ్‌లలో, ఐదు గెలిచింది. ఐదు ఓడిపోయింది. ఖతాలో 11 పాయింట్లతో +0.294 నెట్ రన్‌రేట్‌తో నిలిచింది.
రాజస్థాన్ రాయల్స్ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఆడిన 11 మ్యాచ్‌లలో, ఐదు గెలిచి, ఆరు ఓడిపోయింది. +0.388 రన్ రేట్‌తో 10 పాయింట్లు సంపాదించింది.
ఎనిమిదో స్థానంలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ ఐదో స్థానానికి ఎగబాకింది. ఆడిన 11 మ్యాచ్‌లలో, ఐదు గెలిచింది. ఆరు ఓడిపోయింది. -0.079 రన్ రేట్‌తో 10 పాయింట్లు సంపాదించింది.
కేకేఆర్ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్క స్థానం కోల్పోయి ఆరో స్థానంలో నిలిచింది. ఆడిన పది మ్యాచ్‌లలో 10 పాయింట్లు, -0.209 రన్ రేట్‌తో నిలిచింది. ఐదు గెలిచి, ఐదు ఓడిపోయింది.
పంజాబ్ కింగ్స్ 11 మ్యాచ్‌లలో 6 ఓటములు, 5 విజయాలు సాధించింది. -0.441 రన్ రేట్, 10 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది.
ముంబై ఇండియన్స్ ఎనిమిదో స్థానంలో ఉంది. ఆడిన 10 మ్యాచ్‌లలో, 5 గెలిచి, 5 ఓడిపోయింది. 10 పాయింట్లు, -0.454 రన్ రేట్‌తో నిలిచింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తొమ్మిదో స్థానంలో ఉంది. ఆడిన 10 గేమ్‌లలో, 6 గెలిచి, 4 ఓడిపోయింది. ఖాతాలో 8 పాయింట్లతో -0.472 నెట్ రన్‌రేట్‌తో నిలిచింది.
ఢిల్లీ క్యాపిటల్స్ చివరి స్థానంలో నిలిచింది. ఆడిన 10 మ్యాచ్‌లలో నాలుగు గెలిచింది. ఆరు మ్యాచ్‌లు ఓడిపోవడంతో ఖాతాలో 8 పాయింట్లు ఉన్నాయి. -0.529 రన్ రేట్‌తో చివరి స్థానంలో నిలిచింది.
ఆరెంజ్ క్యాప్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఆరెంజ్ క్యాప్ ధరించాడు. తాను ఆడిన పది మ్యాచ్‌ల్లో ఐదు అర్ధసెంచరీలతో మొత్తం 511 పరుగులు చేశాడు. రాజస్థాన్ జట్టు యంగ్ బ్యాటర్ జైస్వాల్ రెండో స్థానంలో ఉన్నాడు. అతను 11 మ్యాచ్‌ల్లో మూడు అర్ధసెంచరీలు, 1 సెంచరీతో 477 పరుగులు చేశాడు. గుజరాత్‌కు చెందిన శుభమన్ గిల్ 11 మ్యాచ్‌ల్లో 469 పరుగులు చేసి మూడో స్థానానికి ఎగబాకాడు.
పర్పుల్ క్యాప్: గుజరాత్ టైటాన్స్ ఆటగాడు మహ్మద్ షమీ పర్పుల్ క్యాప్ ధరించాడు. తాను ఆడిన పదకొండు మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీశాడు. అదే జట్టు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా 11 మ్యాచ్‌ల్లో 19 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. సీకేఎస్‌కే ఆటగాడు తుషార్ దేశ్‌పాండే 11 మ్యాచ్‌ల్లో 19 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..