
Bhuvneshwar Kumar Shameful Record: సాధారణంగా భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ వేస్తున్నాడంటే ప్రత్యర్థి బ్యాటర్లు కాస్త ఆచితూచి ఆడతారు. పవర్‌ప్లేలో స్వింగ్‌తో, డెత్ ఓవర్లలో యార్కర్లతో బ్యాటర్లను రాయల్కరాయ్ట్టడి చేయడం భువికి వెన్నతో పెట్టిన విద్య. అయితే, మే 22 రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. హైదరాబాద్ బ్యాటర్లు భువి బౌలింగ్‌ను టార్గెట్ చేస్తూ మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించారు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన భువనేశ్వర్ ఒక్క వికెట్ కూడా తీయకుండా ఏకంగా 51 పరుగులు సమర్పించుకున్నారు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు ఇచ్చుకున్న బౌలర్ల జాబితాలో భువి అగ్రస్థానానికి చేరాడు.
ఐపీఎల్ కెరీర్‌లో భువనేశ్వర్ కుమార్ ఒకే ఇన్నింగ్స్‌లో 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు ఇవ్వడం ఇది 9వ సారి. ఈ చెత్త రికార్డుతో ఆయన తన తోటి భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ సరసన చేరారు. షమీ కూడా ఐపీఎల్‌లోరాజస్థాన్ రాయల్స్, ఇప్పటివరకు 9 సార్లు 50కి పైగా పరుగులు ఇచ్చారు. వీరి తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ మహమ్మద్ సిరాజ్ (8 సార్లు) ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. భువీ లాంటి క్లాస్ బౌలర్ కెరీర్‌లో ఇలాంటి ఘోరమైన గణాంకాలు నమోదు కావడం గమనార్హం.
ఇది కూడా చదవండి: Video: తూచ్.. వాడిదసలు బౌలింగేనా.. స్టాండ్స్‌లో శివాలెత్తిన కావ్యపాప..
ఐపీఎల్ 2026 సీజన్ భువనేశ్వర్ కుమార్‌కు ఇప్పటివరకు ఎంతో అద్భుతంగా సాగింది. ఈ మ్యాచ్‌కు ముందు ఆడిన 13 మ్యాచ్‌ల్లో ఆయన కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే 40కి పైగా పరుగులు ఇచ్చారంటే భువీ ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. అలాంటిది సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు భువి బౌలింగ్ భయాన్ని పోగొడుతూ లీగ్‌లోనే తొలిసారి ఆయనపై ఇంతలా విరుచుకుపడ్డారు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం ఆర్‌సీబీని 200 పరుగులకే కట్టడి చేసి 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో వికెట్లు తీయకుండా భారీగా పరుగులు ఇచ్చుకున్నప్పటికీ.. ఐపీఎల్ 2026 సీజన్‌లో పర్పుల్ క్యాప్ (Purple Cap) మాత్రం ఇంకా భువనేశ్వర్ కుమార్ వద్దే భద్రంగా ఉంది. ప్రస్తుతం ఆయన 14 మ్యాచ్‌ల్లో 24 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్ కగిసో రబడా కూడా 24 వికెట్లతో సమానంగా ఉన్నప్పటికీ.. మెరుగైన ఎకానమీ, సగటు కారణంగా భువనేశ్వర్ కుమార్ నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
క్రికెట్‌లో ఎంతటి గొప్ప బౌలర్‌కైనా ఒక రోజు చెత్తగా మారడం సహజం. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ల విధ్వంసానికి భువనేశ్వర్ కుమార్ బలికావాల్సి వచ్చింది. ఈ అన్‌వాంటెడ్ రికార్డు భువి లాంటి దిగ్గజ బౌలర్ కెరీర్‌కు ఒక మచ్చలా మిగిలినప్పటికీ, టోర్నీలో ఆయన సాధించిన వికెట్ల రికార్డు భువీ క్లాస్‌ను చాటిచెబుతోంది. రాబోయే మ్యాచ్‌ల్లో భువి మళ్లీ పుంజుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..