AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC Award: టీమిండియా ఆల్‌రౌండర్‌కు మరో అరుదైన గౌరవం.. రెండోసారి ఐసీసీ అవార్డు

ICC Award: భారత మహిళల క్రికెట్ స్టార్ దీప్తి శర్మకు ఐసీసీ అక్టోబర్ నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు దక్కింది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ అనాబెల్ సదర్లాండ్, బంగ్లాదేశ్ ప్లేయర్ శోభనా మొస్తరీలను వెనక్కి నెట్టి ఆమె ఈ ఘనత సాధించింది. ఇది ఆమె కెరీర్‌లో రెండో ఐసీసీ నెలవారీ అవార్డు.

ICC Award: టీమిండియా ఆల్‌రౌండర్‌కు మరో అరుదైన గౌరవం.. రెండోసారి ఐసీసీ అవార్డు
Deepti Sharma
Rakesh
|

Updated on: Nov 13, 2026 | 7:14 PM

Share

ICC Award: భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది. 2026 అక్టోబర్ నెలకు ఐసీసీ మహిళల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఆమె సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన అనాబెల్ సదర్లాండ్, బంగ్లాదేశ్ ప్లేయర్ శోభనా మొస్తరీ నుంచి పోటీ ఎదురైనా దీప్తి ఈ పురస్కారాన్ని గెలుచుకుంది. తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆమెకు ఈ అవార్డు దక్కింది. ఇది దీప్తి కెరీర్‌లో రెండో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ పురస్కారం.

జింబాబ్వే సిరీస్‌లో అదరగొట్టిన దీప్తి 

అక్టోబర్‌లో భారత్‌లో పర్యటించిన జింబాబ్వే మహిళల జట్టుతో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లలో దీప్తి అద్భుతంగా ఆడింది. టీ20 సిరీస్‌ను భారత్ 3-0తో కైవసం చేసుకోగా, వన్డే సిరీస్‌లోనూ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ రెండు సిరీస్‌ల్లోనూ దీప్తి బ్యాటింగ్, బౌలింగ్‌తో జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించింది. ముఖ్యంగా ఒత్తిడిలోనూ నిలకడగా ఆడటం ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

ఇది కూడా చదవండి: Watch: తనను డకౌట్ చేసిన బౌలర్‌కు స్పెషల్ గిఫ్ట్.. కోహ్లీ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా

వన్డేల్లో సెంచరీ.. బంతితోనూ ఐదు వికెట్లు

జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల్లో దీప్తి ఐదు వికెట్లు పడగొట్టింది. బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చిన రెండో వన్డేలో అద్భుతమైన సెంచరీతో మెరిసింది. ఆ మ్యాచ్‌లో భారత జట్టు 148 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన దీప్తి.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 153 పరుగులు జోడించారు. దీప్తి 106 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, హర్మన్‌ప్రీత్ 126 పరుగులు చేసింది. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ దీప్తి 32 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసింది.

టీ20ల్లోనూ కీలక ఇన్నింగ్స్

జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో భారత జట్టు 115 పరుగుల లక్ష్య ఛేదనకు దిగింది. ఒక దశలో 19 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో దీప్తి 37 బంతుల్లో 49 పరుగులు చేసి జట్టును ఆదుకుంది. నిక్కీ ప్రసాద్‌తో కలిసి ఐదో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఆ మ్యాచ్‌లో ఆమెకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. మూడు టీ20ల్లో కలిపి రెండు వికెట్లు తీసి జట్టు విజయాల్లో భాగమైంది.

ఇది కూడా చదవండి: Gautam Gambhir: టీమిండియా బ్యాటర్లపై సీరియస్.. గంభీర్‌కు మొదలైన కొత్త టెన్షన్

పురుషుల విభాగంలో మార్కో యాన్సెన్‌కు అవార్డు

మహిళల విభాగంలో దీప్తి శర్మ అవార్డు గెలుచుకోగా, పురుషుల విభాగంలో సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్ అక్టోబర్ నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో యాన్సెన్ 13 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లోనూ 198 పరుగులు సాధించి తన జట్టు విజయాల్లో కీలకంగా నిలిచాడు. దీంతో పురుషుల విభాగంలోనూ సౌతాఫ్రికా ఆటగాడికి ఈ నెలవారీ పురస్కారం దక్కింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో