AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: భారత జట్టుకు భారీ షాక్.. ఒక్క ఓటమితో నాలుగు రికార్డులు బ్రేక్

IND vs NZ: న్యూజిలాండ్‌తో నాలుగో వన్డేలో టీమిండియా 244 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. 334 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 89 పరుగులకే ఆలౌటైంది. ఈ పరాజయంతో భారత జట్టు ఖాతాలో నాలుగు చేదు రికార్డులు చేరాయి. SENA దేశాల్లో అత్యంత భారీ ఓటమి, వన్డే చరిత్రలో రెండో భారీ పరాజయం, న్యూజిలాండ్ గడ్డపై అత్యల్ప స్కోరు సహా పూర్తి వివరాలు తెలుసుకుందాం.

IND vs NZ: భారత జట్టుకు భారీ షాక్.. ఒక్క ఓటమితో నాలుగు రికార్డులు బ్రేక్
Ind Vs Nz 4th Odi
Rakesh
|

Updated on: Nov 13, 2026 | 6:05 PM

Share

IND vs NZ: న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో 333 పరుగులు చేసింది. 334 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 26.4 ఓవర్లలో 89 పరుగులకే ఆలౌటైంది. దీంతో న్యూజిలాండ్ 244 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమి భారత క్రికెట్ చరిత్రలోనే కొన్ని చెత్త రికార్డులకు కారణమైంది. అవేంటో చూద్దాం.

SENA దేశాల్లో ఇదే అత్యంత భారీ ఓటమి

దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలను కలిపి SENA దేశాలుగా పిలుస్తారు. ఈ దేశాల్లో భారత జట్టుకు ఎదురైన అత్యంత భారీ వన్డే ఓటమి ఇదే. గతంలో దక్షిణాఫ్రికా చేతిలో 2015లో ముంబైలో 214 పరుగుల తేడాతో భారత్ ఓడింది. అంతకుముందు 2004లో సిడ్నీలో ఆస్ట్రేలియా చేతిలో 208 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇప్పుడు న్యూజిలాండ్ చేతిలో 244 పరుగుల తేడాతో ఓడటంతో ఆ రికార్డు మారిపోయింది.

ఇది కూడా చదవండి: IND vs NZ: టీమిండియాకు బిగ్ రిలీఫ్.. భారత్‌ను వణికించిన పేసర్‌కు ఆఖరి వన్డేలో రెస్ట్

వన్డే చరిత్రలో రెండో అత్యంత భారీ ఓటమి

పరుగుల తేడా పరంగా భారత వన్డే చరిత్రలో ఇది రెండో అత్యంత భారీ ఓటమి. ఈ జాబితాలో ఇప్పటికీ శ్రీలంకదే అగ్రస్థానం. 2000లో షార్జాలో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో భారత్ 245 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు న్యూజిలాండ్ చేతిలో 244 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అంటే భారత జట్టు అత్యంత భారీ ఓటమి రికార్డుకు కేవలం ఒక్క పరుగు దూరంలో నిలిచింది.

న్యూజిలాండ్ గడ్డపై అత్యల్ప స్కోరు

న్యూజిలాండ్ గడ్డపై భారత జట్టు వన్డేల్లో ఇంతకుముందెన్నడూ ఇంత తక్కువ స్కోరు చేయలేదు. నాలుగో వన్డేలో 89 పరుగులకే ఆలౌట్ కావడంతో అక్కడ భారత్‌కు ఇదే అత్యల్ప వన్డే స్కోరుగా నమోదైంది. అయితే న్యూజిలాండ్‌పై భారత అత్యల్ప స్కోరు రికార్డు మాత్రం ఇంకా 88 పరుగులే. 2010లో దంబుల్లాలో జరిగిన మ్యాచ్‌లో కివీస్‌పై భారత్ 88 పరుగులకే కుప్పకూలింది. తాజా 89 పరుగుల స్కోరు ఆ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.

భారత్ ఖాతాలో ఆరో అత్యల్ప వన్డే స్కోరు

89 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత వన్డే చరిత్రలో ఆరో అత్యల్ప స్కోరు నమోదైంది. 2000లో శ్రీలంకపై 54 పరుగులు, 1981లో ఆస్ట్రేలియాపై 63 పరుగులు, 1986లో శ్రీలంకపై 78 పరుగులు, 1978లో పాకిస్థాన్‌పై 79 పరుగులు, 2010లో న్యూజిలాండ్‌పై 88 పరుగులు చేయడం గతంలో నమోదైన అత్యల్ప స్కోర్లు. ఇప్పుడు ఈ జాబితాలో 89 పరుగులతో మరో చేదు అధ్యాయం చేరింది.

ఇది కూడా చదవండి: Gautam Gambhir: టీమిండియా బ్యాటర్లపై సీరియస్.. గంభీర్‌కు మొదలైన కొత్త టెన్షన్

తొలి ఓవర్లోనే ముగ్గురు కీలక బ్యాటర్లు డకౌట్

ఈ మ్యాచ్‌లో భారత పతనానికి మ్యాట్ హెన్రీ తొలి ఓవరే కారణమైంది. మొదటి ఓవర్‌లోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ డకౌట్‌గా వెనుదిరిగారు. ఆ తర్వాత కైల్ జేమీసన్ రుతురాజ్ గైక్వాడ్‌ను ఔట్ చేయడంతో భారత్ 9 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇషాన్ కిషన్ 27, అక్షర్ పటేల్ 21 పరుగులతో కొంతసేపు పోరాడినా జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయారు. మ్యాట్ హెన్రీ 27 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. విల్ యంగ్ 125 పరుగులతో న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
భారత జట్టుకు భారీ షాక్.. ఒక్క ఓటమితో నాలుగు రికార్డులు బ్రేక్
భారత జట్టుకు భారీ షాక్.. ఒక్క ఓటమితో నాలుగు రికార్డులు బ్రేక్
10 గ్రాముల బంగారం ధర లక్షకు పడిపోతుందా..? మార్కెట్ అంచనా ఇదే..
10 గ్రాముల బంగారం ధర లక్షకు పడిపోతుందా..? మార్కెట్ అంచనా ఇదే..
ఇంట్లో టమాటాలు ఉన్నాయా? ఇలా వారానికి మూడుసార్లు చేసినా వద్దనరు..
ఇంట్లో టమాటాలు ఉన్నాయా? ఇలా వారానికి మూడుసార్లు చేసినా వద్దనరు..
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
మీ ఊరు,వార్డు ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా.. లేదా..? తెలుసుకోండిలా
మీ ఊరు,వార్డు ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా.. లేదా..? తెలుసుకోండిలా
ఇంట్లో ఎన్ని వత్తులతో దీపం వెలిగిస్తే శుభప్రదం? ఏకముఖం నుంచి..
ఇంట్లో ఎన్ని వత్తులతో దీపం వెలిగిస్తే శుభప్రదం? ఏకముఖం నుంచి..
టీమిండియా బ్యాటర్లపై సీరియస్.. గంభీర్‌కు మొదలైన కొత్త టెన్షన్
టీమిండియా బ్యాటర్లపై సీరియస్.. గంభీర్‌కు మొదలైన కొత్త టెన్షన్
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
జబర్దస్త్‌లోకి 'అగ్నిపరీక్ష' రాజకుమారి..ఎవరి టీమ్‌లో చేస్తుందంటే?
జబర్దస్త్‌లోకి 'అగ్నిపరీక్ష' రాజకుమారి..ఎవరి టీమ్‌లో చేస్తుందంటే?
ఇంట్లో అన్నం మిగిలిందా? ఇలా కరకరలాడే వడియాలు తయారు చేసుకోండి!
ఇంట్లో అన్నం మిగిలిందా? ఇలా కరకరలాడే వడియాలు తయారు చేసుకోండి!
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో