Glenn Maxwell-Vini Raman: ప్రేయసినే పెళ్లాడిన ఆర్‌సీబీ ఆల్ రౌండర్.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు..

గ్లెన్ మాక్స్‌వెల్, వినీ రామన్ 2017 సంవత్సరం నుంచి ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తున్నారు. వారిద్దరూ మెల్‌బోర్న్‌లో వివాహం చేసుకోనున్నారు. గ్లెన్ మాక్స్‌వెల్ వివాహం కారణంగా పాకిస్థాన్

Glenn Maxwell-Vini Raman: ప్రేయసినే పెళ్లాడిన ఆర్‌సీబీ ఆల్ రౌండర్.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు..
Glenn Maxwell Vini Raman Marriage

Updated on: Mar 19, 2022 | 12:33 PM

ఆస్ట్రేలియా ఆల్ రౌండర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్(Glenn Maxwell) ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందే నిశ్చితార్థం చేసుకున్నాడు. భారత్‌కు చెందిన వినీ రామన్‌ను గ్లెన్ మాక్స్‌వెల్(Glenn Maxwell-Vini Raman Engagement)శుక్రవారం, మార్చి 18న ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఈమేరకు ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. అలాగే ఈ జోడీ కూడా తమ ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకున్నారు. వీరిద్దరూ రేండేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు, ఆ సమయంలో వీరు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు నెట్టింట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నిన్న శుక్రవారం ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు.

అయితే, మరికొన్ని వార్తల మేరకు శుక్రవారం ఆస్ట్రేలియా పద్ధతిలో వివాహం చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇక మార్చి 27న భారతీయ పద్ధతిలో అంటే తమిళ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోనున్నారు. కొంతకాలం క్రితం వారిద్దరి పెళ్లి కార్డు కూడా వైరల్ అయ్యింది. వెడ్డింగ్ కార్డు తమిళ భాషలో ముద్రించారు.

గ్లెన్ మాక్స్‌వెల్, వినీ రామన్ 2017 సంవత్సరం నుంచి ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తున్నారు. వారిద్దరూ మెల్‌బోర్న్‌లో వివాహం చేసుకోనున్నారు. గ్లెన్ మాక్స్‌వెల్ వివాహం కారణంగా పాకిస్థాన్ పర్యటనకు హాజరు కాలేకపోయాడు. అలాగే IPL ప్రారంభ మ్యాచ్‌లకు కూడా దూరమయ్యాడు.

వినీ రామన్ మెల్‌బోర్న్‌లో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన యువతి. ఆమె స్వస్థలం తమిళనాడు. విన్నీ మెల్‌బోర్న్‌లో మెడికల్ సైన్స్ చదువుతోంది. వీరిద్దరి సమావేశం మొదటి నుంచి నెట్టింట్లో చర్చలో నిలిచింది. వీరిద్దరూ ఆస్ట్రేలియా క్రికెట్ జాతీయ అవార్డులలో కనిపించారు.

Also Read: