Ravindra Jadeja : లార్డ్స్ టెస్ట్ ఓడినా రవీంద్ర జడేజానే హీరో.. 72 ఏళ్ల రికార్డు బద్దలు

లార్డ్స్ టెస్ట్‌లో భారత్ ఓడినప్పటికీ రవీంద్ర జడేజా తన అద్భుత బ్యాటింగ్‌తో హీరోగా నిలిచాడు. 473 నిమిషాలు క్రీజులో ఉండి, 72 ఏళ్ల రికార్డును రవీంద్ర జడేజా బద్దలు కొట్లాడు. ఆయన మొత్తం 473 నిమిషాలు క్రీజులో నిలబడి, భారత్‌కు విజయం తెచ్చిపెట్టాలని ఆశించారు. కానీ అది జరుగలేదు.

Ravindra Jadeja : లార్డ్స్ టెస్ట్ ఓడినా రవీంద్ర జడేజానే హీరో..  72 ఏళ్ల రికార్డు బద్దలు
Ravindra Jadeja

Updated on: Jul 15, 2025 | 2:41 PM

Ravindra Jadeja : లార్డ్స్ టెస్ట్ మ్యాచులో భారత జట్టు ఓటమి పాలైనప్పటికీ రవీంద్ర జడేజా మాత్రం హీరోలా ప్రశంసలు అందుకుంటున్నారు. లార్డ్స్ మైదానంలో భారత విజయం కోసం తను పోరాడిన తీరు నిజంగా అద్భుతం. ఈ సిరీస్‌లోని మూడో టెస్ట్‌లో ఇంగ్లాండ్‌పై ఇతర భారత బ్యాట్స్‌మెన్ కన్నా ఎక్కువ సమయం క్రీజులో గడిపింది రవీంద్ర జడేజానే. లార్డ్స్ టెస్ట్‌లో ఆయన మొత్తం 473 నిమిషాలు క్రీజులో నిలబడి, భారత్‌కు విజయం తెచ్చిపెట్టాలని ఆశించారు. అది జరగకపోయినా జడేజా పేరు మీద ఒక అద్భుతమైన రికార్డు మాత్రం నమోదైంది.

రవీంద్ర జడేజా లార్డ్స్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో 207 నిమిషాలు బ్యాటింగ్ చేసి 82 పరుగులు సాధించాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగుల టార్గెట్ ఛేదించే క్రమంలో తన పోరాటం మరింత సేపు కొనసాగింది. జడేజా రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 266 నిమిషాలు మారథాన్ బ్యాటింగ్ చేసి 61 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇలా లార్డ్స్ టెస్ట్‌లో మొత్తం 473 నిమిషాలు అంటే 7 గంటల 53 నిమిషాలు బ్యాటింగ్ చేసి 133 పరుగులు సాధించాడు. జట్టును గెలిపించలేకపోయినా జడేజా వ్యక్తిగత ప్రదర్శన మాత్రం అభినందనీయం.

లార్డ్స్ మైదానంలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలోనూ 50 ప్లస్ స్కోరు సాధించిన రవీంద్ర జడేజా, గత 72 ఏళ్లలో ఈ ఘనత సాధించిన మొదటి భారతీయడు. ఓవరాల్‌గా చూస్తే, వీనూ మాన్కడ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయ ఆటగాడు జడేజా. వీనూ మాన్కడ్ 1952లో భారత్-ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఓపెనర్‌గా మొదటి ఇన్నింగ్స్‌లో 72 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 183 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత ఇప్పుడు జడేజా ఈ రికార్డును సాధించడం విశేషం.

రవీంద్ర జడేజా లార్డ్స్ టెస్ట్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో తన 7000 పరుగులను కూడా పూర్తి చేసుకున్నాడు. దీనితో అంతర్జాతీయ క్రికెట్‌లో 7000 ప్లస్ పరుగులు, 600 ప్లస్ వికెట్లు తీసిన ప్రపంచంలోనే నాల్గవ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. జడేజాకు ముందు భారతదేశం నుండి కపిల్ దేవ్, దక్షిణాఫ్రికాకు చెందిన షాన్ పోలాక్, బంగ్లాదేశ్‌కు చెందిన షకీబ్ అల్ హసన్ మాత్రమే ఈ అరుదైన ఘనతను సాధించారు. ఈ ఘనత జడేజాను ఒక అత్యుత్తమ ఆల్-రౌండర్‌గానిలబెట్టింది. ఎందుకంటే అతను బౌలింగ్, బ్యాటింగ్‌లో రెండింటిలోనూ జట్టుకు కీలక పాత్ర పోషిస్తున్నాడు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..