క్యాచ్‌ మిస్సవ్వడంతో కోపంతో ఊగిపోయిన రవీంద్ర జడేజా.. అతడు వచ్చి మెడ పట్టుకున్నాడు.. గ్రౌండ్‌లో గొడవ..

Cricket News: క్రికెట్‌ని జెంటిల్‌మెన్ గేమ్ అని పిలుస్తారు కానీ తరచుగా మైదానంలో గొడవలు జరుగుతుంటాయి. దీంతో ఈ ఆట ప్రతిష్ట రోజు రోజుకి మసకబారుతోంది.

క్యాచ్‌ మిస్సవ్వడంతో కోపంతో ఊగిపోయిన రవీంద్ర జడేజా.. అతడు వచ్చి మెడ పట్టుకున్నాడు.. గ్రౌండ్‌లో గొడవ..
Jadeja Fight

Edited By: Anil kumar poka

Updated on: Nov 27, 2021 | 5:53 PM

Cricket News: క్రికెట్‌ని జెంటిల్‌మెన్ గేమ్ అని పిలుస్తారు కానీ తరచుగా మైదానంలో గొడవలు జరుగుతుంటాయి. దీంతో ఈ ఆట ప్రతిష్ట రోజు రోజుకి మసకబారుతోంది. ఒక్కోసారి ఆటగాళ్లు కోపంతో ఒకరితో ఒకరు గొడవ పడుతుంటారు. సాధారణంగా ఇది ప్రత్యర్థి జట్ల ఆటగాళ్ల మధ్య జరుగుతుంది. అయితే టీమ్ ఇండియాలోని ఇద్దరు ఆటగాళ్లు లైవ్‌లో అది ప్లే గ్రౌండ్‌లో ఒకరితో ఒకరు గొడవపడిన సంఘటన జరిగింది. వీడియో చూస్తే షాక్‌ అవుతారు. 2013లో వెస్టిండీస్‌ టూర్‌కు వెళ్లిన టీమిండియా ఆటగాళ్లు ఇద్దరు గొడవపడ్డారు.

వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, సురేశ్ రైనా చిక్కుల్లో పడ్డారు. క్యాచ్‌ మిస్‌ కావడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. జడేజా వేసిన బంతిని మిస్‌ చేయడంతో ఈ సమస్య వచ్చింది. రవీంద్ర జడేజా కోపంతో సురేష్ రైనాపై ముందుకు సాగాడు. అక్కడ విరాట్ కోహ్లీ ఉన్నాడు అతన్ని ఆపమని పిలిచినా జడ్డూ ఆగలేదు. ఇంతలో సురేష్ రైనా జడేజా టీ-షర్టును పట్టుకున్నాడు ఈ ఆల్-రౌండర్ వెనుతిరిగినప్పుడు రైనా అతని మెడని వెనుక నుంచి పట్టుకొని నొక్కాడు. దీంతో జడేజా మరింత ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇద్దరు ఆటగాళ్లు ఒకరిపై ఒకరు కోపంగా ఊగిపోయారు. జడేజా, సురేష్ రైనా చెన్నై సూపర్ కింగ్స్ ముఖ్యమైన ఆటగాళ్ళు. ఇద్దరి మధ్య లోతైన స్నేహం కూడా ఉంది. ఇద్దరూ కలిసి ఈ ఫ్రాంచైజీ కోసం చాలా మ్యాచ్‌లు గెలిచారు. కాగా క్రికెట్ మైదానంలో ఆటగాళ్లు చాలాసార్లు గొడవపడ్డారు. భారత ఆటగాళ్ల గురించి చెప్పాలంటే మైదానంలో విరాట్ కోహ్లీ- గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్-ఎస్ శ్రీశాంత్ మధ్య గొడవ జరిగింది. హర్భజన్ సింగ్, అంబటి రాయుడు మధ్య వివాదం జరిగింది. ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా కూడా మైదానంలో పోరాడారు.

Read Also: దక్షిణ భారతదేశంలో వర్షాల బీభత్సం.. ఒక్క నవంబర్‌లోనే 143.4 శాతం వానలు..

పెను విధ్వంసం ఈ బ్యాట్స్‌మెన్‌.. 7 బంతుల్లో 6 సిక్సర్లు.. 22 బంతుల్లో 48 పరుగులు..

రైతులకు గుడ్‌న్యూస్‌.. వాటి దిగుమతులకు మోడీ ప్రభుత్వం ఆమోదం..