
Ravichandran Ashwin: హైదరాబాద్ వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ నేటి నుంచి ప్రారంభమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేస్తోంది. ప్రస్తుతం వార్తలు రాసే సమయానికి ఇంగ్లండ్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 100 పరుగులు దాటింది. అయితే, టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తొలి వికెట్ పడగొట్టి, భారత్‌కు శుభారంభం అందించాడు. ఆ వెంటనే ఇంగ్లండ్ జట్టు వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. ఇందులో అశ్విన్ 2 వికెట్లు, జడేజా 1 వికెట్ పడగొట్టారు.
కాగా, అశ్విన్ 2024లో తన మొదటి హోమ్ టెస్ట్‌కు మంచి ఆరంభాన్ని అందించాడు. ఎందుకంటే ఓపెనింగ్ టెస్ట్ మొదటి సెషన్‌లో ఇద్దరు ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్లను పెవిలియన్ చేరాడు. అయితే, ఇంగ్లండ్ జట్టు ప్రారంభ ఓవర్లలో బ్యాజ్ బాల్ క్రికెట్ ఆడుతూ వేగంగా పరుగులు చేసింది. అయితే అశ్విన్, రవీంద్ర జడేజాల ఎంట్రీతో పరుగులకు బ్రేకులు వేశారు. అశ్విన్ వేసిన బంతికి బెన్ డకెట్ ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 39 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 35 పరుగులు చేశాడు.
ఆ తర్వాత కొత్త ఆటగాడు ఒల్లీ పోప్ ఎక్కువసేపు నిలవలేదు. రవీంద్ర జడేజా అతనిని 1 పరుగు వ్యక్తిగత స్కోరు వద్ద వెనక్కి పంపాడు. రోహిత్ శర్మ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. 40 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసిన జాక్ క్రాలే రూపంలో అశ్విన్ ఇంగ్లండ్‌కు మూడో షాక్ ఇచ్చాడు.
Wicket number 2️⃣ for @ashwinravi99 😎
Zak Crawley walks back courtesy of a super catch from the local boy @mdsirajofficial! 👏
Follow the match ▶️ https://t.co/HGTxXf7Dc6#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/BDqLrJ3a0Y
— BCCI (@BCCI) January 25, 2024
ఈ క్రమంలో భారత ఆఫ్ స్పిన్నర్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో 150 వికెట్లు పూర్తి చేశాడు. టోర్నమెంట్‌లో అతను మూడవ అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు.
ఆస్ట్రేలియా సారథి పాట్ కమిన్స్ 169 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. అతని సహచరుడు నాథన్ లియాన్ కూడా అదే సంఖ్యలో వికెట్లను కలిగి ఉన్నాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మూడవ ఎడిషన్ జరుగుతోంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు వరుసగా మొదటి, రెండవసారి ట్రోఫీని గెలుచుకున్నాయి. రెండు పర్యాయాలు భారత్ ఫైనల్‌ల్లో ఓడిపోయింది.
169 – పాట్ కమ్మిన్స్
169 – నాథన్ లియోన్
150 – రవిచంద్రన్ అశ్విన్
137 – మిచెల్ స్టార్క్
134 – స్టువర్ట్ బ్రాడ్
టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్ డేరింగ్ క్రికెట్ ఆడుతోంది. ఈ విషయంపై అశ్విన్ మాట్లాడుతూ.. వారి బ్యాజ్‌బాల్ బ్రాండ్ క్రికెట్ సానుకూల ఫలితాలను పొందింది. ఇంగ్లండ్ పటిష్టమైన జట్లపై విజయం సాధించింది. ఇంగ్లండ్ ఉత్తేజకరమైన క్రికెట్ ఆడుతోంది. నేను వారితో సిరీస్ కోసం ఎదురు చూస్తున్నాను. తమ కొత్త విధానంతో విజయం సాధించారు’ అంటూ బీసీసీఐ అవార్డుల సందర్భంగా ఆఫ్ స్పిన్నర్ చెప్పుకొచ్చాడు.
ఆతిథ్య దేశంతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ ముగ్గురు ఫ్రంట్‌లైన్ స్పిన్నర్లతో బరిలోకి దిగింది. కుల్దీప్ యాదవ్ తప్పుకోవడంతో భారత్ అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్‌లను ఎంపిక చేసింది.
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్,
ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జాక్ లీచ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..