Ranji Trophy 2022: మొన్న కూతురు.. ఆ తర్వాత తండ్రి మరణం.. అయినా జట్టు వెంటే బరోడా క్రికెటర్..!

|

Feb 28, 2022 | 9:33 PM

కుమార్తె మరణం, ఆపై తండ్రి మరణంతో షాక్‌కు గురైన విష్ణు సోలం (Vishnu Solanki) కి బరోడా రంజీ జట్టు(Baroda Ranji Team)లో కొనసాగాలని, గ్రూప్ దశలో మూడో మ్యాచ్ ఆడాలని నిర్ణయించుకున్నాడు.

Ranji Trophy 2022: మొన్న కూతురు.. ఆ తర్వాత తండ్రి మరణం.. అయినా జట్టు వెంటే బరోడా క్రికెటర్..!
Ranji Trophy 2022 Baroda Player Vishnu Solanki
Follow us on

కుమార్తె మరణం, ఆపై తండ్రి మరణంతో షాక్‌కు గురైన విష్ణు సోలం (Vishnu Solanki) కి బరోడా రంజీ జట్టు(Baroda Ranji Team)లో కొనసాగాలని, గ్రూప్ దశలో మూడో మ్యాచ్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. తన నవజాత కుమార్తెను కోల్పోయిన కొద్ది రోజులకే అనారోగ్యంతో ఉన్న అతని తండ్రి కూడా ఆదివారం మరణించాడు. దీంతో ఈ బరోడా ప్లేయర్‌కు గత కొన్ని వారాలు కఠినంగా ఉండనున్నాయి. బరోడా జట్టు (Ranji Trophy 2022) మార్చి 3 నుంచి ఎలైట్ గ్రూప్ Bలో తమ చివరి మ్యాచ్‌లో హైదరాబాద్‌తో తలపడుతుంది. ఈ 29 ఏళ్ల క్రికెటర్ ఫిబ్రవరి 10న తండ్రి అయ్యాడు. అయితే అతని కుమార్తె మరుసటి రోజే మరణించింది.

అయితే, ఈ షాక్ నుంచి తిరిగి వచ్చిన అతను చండీగఢ్‌పై 104 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ చివరి రోజున అతనికి తన తండ్రి మరణించాడనే వార్త అందింది. బరోడా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అజిత్ లేలే సోమవారం పీటీఐతో మాట్లాడుతూ, ‘అతను (విష్ణు) చివరి మ్యాచ్ ఆడతాడు. మూడో మ్యాచ్‌ ఆడుతున్నాడు. టీమ్‌తోనే ఉంటున్నాడు’ అని తెలిపాడు. బరోడా క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన మరో అధికారి మాట్లాడుతూ.. ‘తన కూతురు చనిపోవడంతో మొదటి మ్యాచ్‌లో ఆడలేక ఇంటికి వెళ్లాడు. ఎందుకంటే అతను మూడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం జట్టులోనే ఉంటాడు’ అని తెలిపాడు.

వీడియో కాల్‌లో తండ్రి అంత్యక్రియలు..
బరోడా క్రికెట్ అసోసియేషన్ అతనిని ఇంటికి వెళ్ళమని కోరింది. కానీ, విష్ణు నిరాకరించాడు. చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో విష్ణు ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు, అతని తండ్రి మరణ వార్త వచ్చింది. ఈ సమాచారం ఇవ్వడానికి బరోడా జట్టు మేనేజర్ అతన్ని మైదానం నుంచి డ్రెస్సింగ్ రూమ్‌కి పిలిచారు. విష్ణు తండ్రి రెండు నెలలుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు.

తండ్రి మరణవార్త అందుకున్న తర్వాత, తండ్రి మృతదేహాన్ని మార్చురీలో ఉంచలేమని, అందుకే విష్ణు టీంతోనే కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత వీడియో కాల్‌లోనే తండ్రి అంత్యక్రియలను విష్ణు సోలంకి చూశారు. ఆయన అన్నయ్య అంత్యక్రియలు నిర్వహించారు.

విష్ణు ఇప్పటివరకు 25 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 41.97 సగటుతో 1679 పరుగులు చేశాడు. అతని పేరు మీద ఆరు సెంచరీలు ఉన్నాయి. అదే సమయంలో, అతను 39 లిస్ట్ ఏ మ్యాచ్‌లలో 33.96 సగటుతో 1019 పరుగులు చేశాడు.

Also Read: Pak vs Aus: ఆసీస్ ప్లేయర్ భార్యకు బెదిరింపులు.. పాక్ పర్యటన నుంచి నీ భర్త తిరిగిరాడంటూ మెసేజ్‌లు..

Watch Video: ఈ క్యాచ్ ఓ ‘అద్భుతం’.. అలా ఎలా పట్టావయ్యా బాబు.. షాకవుతోన్న నెటిజన్లు.. వైరల్ వీడియో