IPL 2022: రాజస్థాన్‌ ఆ లెజెండ్‌ కోసమైనా కప్‌ గెలవాలనుకుంటోంది..

|

May 28, 2022 | 12:01 PM

IPL 2022: రాజస్థాన్ రాయల్స్ IPL 2022 ట్రోపిని కచ్చితంగా గెలవాలనుకుంటోంది. ఎందుకంటే దానికో ప్రయోజనం ఉంది. ఈ జట్టుకు మొదటి కెప్టెన్, మొదటి ఆటగాడు, మెంటర్ షేన్ వార్న్

IPL 2022: రాజస్థాన్‌ ఆ లెజెండ్‌ కోసమైనా కప్‌ గెలవాలనుకుంటోంది..
Rajasthan Royals
Follow us on

IPL 2022: రాజస్థాన్ రాయల్స్ IPL 2022 ట్రోపిని కచ్చితంగా గెలవాలనుకుంటోంది. ఎందుకంటే దానికో ప్రయోజనం ఉంది. ఈ జట్టుకు మొదటి కెప్టెన్, మొదటి ఆటగాడు, మెంటర్ షేన్ వార్న్ ఈ సంవత్సరం IPL ప్రారంభానికి ముందు గుండెపోటుతో మరణించాడు. రాజస్థాన్ జట్టు ఈసారి టైటిల్ గెలుచుకోవడం ద్వారా తమ తొలి రాయల్‌కి అంకితం ఇవ్వాలని అనుకుంటోంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి రాజస్థాన్ ఆటగాళ్లలో అంకిత భావం మరింత పెరిగింది. కప్‌ గెలవడానికి శాయశక్తుల ప్రయత్నించడానికి సిద్దంగా ఉన్నారు.

ఈ విషయం జోస్ బట్లర్, సంజూ శాంసన్‌ సంభాషణల ద్వారా ప్రతిబింబిస్తుంది. రాజస్థాన్‌ రాయల్స్‌కు తొలి ఐపీఎల్‌ టైటిల్‌ను అందించిన కెప్టెన్‌ షేన్‌ వార్న్‌. ఇప్పుడు ఆ జట్టు రెండోసారి టైటిల్‌ను గెలుచుకోవడానికి కేవలం ఒక అడుగు దూరంలో ఉంది. సంజూ శాంసన్ సారథ్యంలోని ఈ జట్టు 14 ఏళ్ల క్రితం షేన్ వార్న్ చేసిన పనిని కోరుకుంటోంది. అతను కప్‌ గెలిస్తే షేన్ వార్న్‌కి అంతకంటే పెద్ద నివాళి మరొకటి ఉండదు.

తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్ రెండో క్వాలిఫయర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విజయం సాధించిని విషయం తెలిసిందే. రాజస్థాన్ జట్టు ఈ ముఖ్యమైన పోరులో 7 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ సందర్భంగా సంజూ శాంసన్ మాట్లాడుతూ “మేము ఐపీఎల్‌లో పునరాగమనం చేయడం అలవాటు చేసుకున్నాం. ఇది సుదీర్ఘ టోర్నీ కాబట్టి హెచ్చు తగ్గులు ఉంటాయి. తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంది. పిచ్‌పై బౌన్స్ కూడా స్పిన్నర్లకు ఉపయోగపడింది. ఫాస్ట్ బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు” అని చెప్పాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఐపీఎల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి