IPL 2025: 100 గంటల్లోనే గట్టిగా ఇచ్చేశాడు భయ్యో.. సెహ్వాగ్‌కు దిమ్మతిరిగేలా కౌంటర్

Vaibhav Suryavanshi vs Virender Sehwag: గుజరాత్ టైటాన్స్‌పై యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ తుఫాన్ ఇన్నింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్‌కు విజయాన్ని అందించడమే కాకుండా సెహ్వాగ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 100 గంటల్లోపే రివేంజ్ ప్లాన్ చేశాడంటూ చెబుతున్నారు.

IPL 2025: 100 గంటల్లోనే గట్టిగా ఇచ్చేశాడు భయ్యో.. సెహ్వాగ్‌కు దిమ్మతిరిగేలా కౌంటర్
Vaibhav Suryavanshi Vs Virender Sehwag

Updated on: Apr 29, 2025 | 9:46 AM

Vaibhav Suryavanshi vs Virender Sehwag: 100 గంటల్లోనే 14 ఏళ్ల కుర్రాడు టీమిండియా దిగ్గజానికి ఇచ్చి పడేశాడు. వైభవ్ సూర్యవంశీ తాను సరైనవాడనని, వీరేంద్ర సెహ్వాగ్ స్టేట్‌మెంట్ తప్పు అని నిరూపించాడు. ఐపీఎల్ ఆటతో కొంతకాలం మాత్రమే సంతోషంగా ఉండే వారిలో వైభవ్ సూర్యవంశీ ఒకరని అభిప్రాయపడిన సెహ్వాగ్.. 14 ఏళ్ల ఈ ఆటగాడు తన ఆలోచనను మార్చుకుని, సెహ్వాగ్ ఆలోచన తప్పని నిరూపించే పని చేశాడు. ఏప్రిల్ 28 సాయంత్రం, జైపూర్ మైదానంలో సెహ్వాగ్‌కి గట్టిగా ఇచ్చేశాడు. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ ముందు 210 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ లక్ష్యాన్ని సాధించడంలో వైభవ్ విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.

రాజస్థాన్ విజయంతో సెహ్వాగ్‌కు గట్టిగా ఇచ్చేసిన వైభవ్..!

గుజరాత్ టైటాన్స్‌పై వైభవ్ సూర్యవంశీ 38 బంతుల్లో 101 పరుగులు చేసిన విధ్వంసక ఇన్నింగ్స్‌ను చూసిన ఎవరైనా, ఇంతకు ముందు ఇలాంటి ఇన్నింగ్స్ ఎప్పుడూ చూసి ఉండరు. కేవలం 14 సంవత్సరాల వయస్సులో ఇలాంటి డేంజరస్ ఇన్నింగ్స్ చూసే అదృష్టం ఎప్పుడూ రాదు. వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ రాజస్థాన్ రాయల్స్‌కు భారీ విజయాన్ని అందించడమే కాకుండా, అతని ఇన్నింగ్స్ సెహ్వాగ్ మాటలకు తగిన సమాధానంగా కూడా దొరికిందని అంతా అంటున్నారు.

వైభవ్ గురించి సెహ్వాగ్ ఏమన్నాడంటే?

ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ గురించి వీరేంద్ర సెహ్వాగ్ ఏం చెప్పాడో తెలుసుకుందాం.. సెహ్వాగ్ చెప్పిన 96 గంటలు అంటే వైభవ్ సెంచరీకి 4 రోజుల ముందు. ఏప్రిల్ 24న, రాజస్థాన్ జట్టు ఆర్‌సీబీతో మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌కు ముందుగానే విరామం లభించింది. ఆ తర్వాత సెహ్వాగ్ మాట్లాడుతూ, తన అరంగేట్రం చాలా బాగుంది. మొదటి బంతికే సిక్స్ కొట్టాడు. బహుశా వచ్చే ఏడాది అతను ఆడకపోవచ్చు’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఒకటి లేదా రెండు మ్యాచ్‌ల్లోనే పేరు పొందిన చాలా మంది ఆటగాళ్లు రావడాన్ని తాను చూశానని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. కానీ, ఎందుకంటే వారు ఒక స్టార్ అయ్యారని భావిస్తారు. ఇలా కొద్ది గంటల్లోనే గుజరాత్ టైటాన్స్‌పై వైభవ్ 35 బంతుల్లో సెంచరీ చేసి, సెహ్వాగ్ మాటలకు రివర్స్ కౌంటర్ ఇచ్చాడని అంతా అంటున్నారు.

సచిన్ శైలిలో బ్యాట్‌తో ఆన్సర్..

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సెహ్వాగ్‌కు వైభవ్ సూర్యవంశీ తన బ్యాట్‌తో సమాధానం ఇచ్చాడు. సచిన్ టెండూల్కర్‌లా విమర్శకులకు తన బ్యాట్‌తో సమాధానం ఇస్తున్నాడంటూ నెటిజన్స్ అంటున్నారు. ఈ క్రమంలో తాను క్రికెట్ ఆడేందుకు వచ్చానని, ఎవరికీ భయపడనంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..