DC vs RR: ఉత్కంఠ పోరులో ఢిల్లీపై రాజస్థాన్‌ గెలుపు.. సెంచరీతో చెలరేగిన బట్లర్..

|

Apr 23, 2022 | 12:01 AM

DC vs RR: ఐపీఎల్‌లో భాగంగా ఈ రోజు ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించింది. చివరి

DC vs RR: ఉత్కంఠ పోరులో ఢిల్లీపై రాజస్థాన్‌ గెలుపు.. సెంచరీతో చెలరేగిన బట్లర్..
Dc Vs Rr
Follow us on

DC vs RR: ఐపీఎల్‌లో భాగంగా ఈ రోజు ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ పై చేయి సాధించింది. 15 పరుగుల తేడాతో విజయ దుందుబి మోగించింది. ఢిల్లీ కేవలం 20 ఓవరల్లో 8 వికెట్లు కోల్పోయి 207 పరుగులకే పరిమితమైంది. 223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ ఆరంభంలో బాగానే ఆడింది. రిషభ్‌ పంత్ 44 పరుగులు, పృథ్వీ షా 37 పరుగులు, లలిత్‌ యాదవ్ 37 పరుగులు, డేవిడ్‌ వార్నర్ 28 పరుగులు రాణించారు. చివరలో రోవ్‌మన్‌ పావెల్ చెలరేగి ఆడాడు. కేవలం 15 బంతుల్లో 5 సిక్సర్లతో 36 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో విజయానికి 36 పరుగులు కావాలి. రోవ్‌మన్‌ పావెల్ 3 బంతుల్లో వరుసగా 3 సిక్స్‌లు బాదాడు. విజయంపై ఆశలు రేకెత్తించాడు. కానీ గెలిపించలేకపోయాడు. రాజస్థాన్‌ బౌలర్లలో రాజస్థాన్ బౌలర్లలో ప్రసిద్ద్‌ కృష్ణ 3, రవిచంద్రన్ అశ్విన్ 2, చాహల్‌1, మెక్ కాయ్‌ 1 వికెట్‌ సాధించారు.

ఇక అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాటర్స్‌.. ఢిల్లీ క్యాపిటల్‌ బౌలర్లకు చుక్కలు చూపించారు. నిర్ణీత 20 ఓవర్లలో 222 పరుగులు సాధించారు. దీంతో ఈ సీజన్‌లోనే అత్యధిక స్కోరు నెలకొల్పారు. ఓపెనర్లు జోస్‌ బట్లర్‌, పడిక్కల్‌ రాజస్థాన్‌కు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. బట్లర్‌ కేవలం 65 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్సర్లతో 116 పరుగులు సాధించాడు. ఇక పడిక్కల్‌ 35 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ఇక చివర్లో క్రీజులోకి వచ్చి సంజూ శాంసన్‌ కేవలం 19 బంతుల్లోనే 46 పరుగులతో జట్టు స్కోర్‌ను పెంచడంలో కీలక పాత్ర పోషించాడు.

IPL 2022: పృథ్వీ షా వల్ల డేవిడ్ వార్నర్ రిలాక్స్‌ అవుతున్నాడు.. ఎలాగంటే..?

Health Tips: ప్రతిరోజు పిస్తాపప్పు తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!

Viral Video: బీచ్‌లో సరదాగా ఎంజాయ్ చేస్తున్న జనాలు.. ఒక్కసారిగా కుప్పకూలిన విమానం..!