ఐపీఎల్ 2022లో భాగంగా ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల్ కోల్పోయి 158 పరుగులు చేసింది. రాయల్స్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో తొలి వికెట్ కోల్పోయింది. 15 బంతుల్లో 15 పరుగులు చేసిన దేవదూత్ పడిక్కల్ షోకీన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సంజు శాంసన్ దాటిగా అడే ప్రయత్నం చేశాడు. 7 బంతుల్లో 2 సిక్స్‌లు కొట్టిన శాంసన్ మరో భారీ షాట్‌కు యత్నించగా బౌండరీ వద్ద ఫిల్డర్‌కు చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన డారిల్ మిచెల్ 17 పరుగులకే వెనుదిరిగాడు.
రాజస్థాన్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. మరోవైప్ బట్లర్ ఆచితూచి ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత గేర్ మార్చి దాటిగా ఆడే క్రమంలో క్యాచ్ ఔట్ అయి పెవిలియన్ చేరాడు. బట్లర్ 52 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 67 పరుగులు చేశాడు. రవిచంద్రన్ అశ్విన్ 9 బంతుల్లో 21 పరుగులు చేశాడు. హెట్మేయర్ 6, పరాగ్ 3, బౌల్ట్ 4 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో షోకీన్, మెరిడిత్‌కు రెండేసి వికెట్లు పడగొట్టగా.. కార్తికేయ, డానియల్ సామ్ ఒక్కో వికెట్ తీశారు.
Read Also.. GT vs RCB IPL Match Result: గుజరాత్ ఖాతాలో ఎనిమిదో విజయం.. ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారైనట్లే..!