హైదరాబాద్‌పై పంజాబ్ విజయం

ఉత్కంఠ పోరులో సన్‌‌‌రైజర్స్ పై విజయం  మెరిసిన రాహుల్, మయాంక్ వార్నర్ అర్ధ సెంచరీ వృధా  మొహాలీ: మొహాలీ వేదికగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ ఓటమి పాలైంది. సోమవారం మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (70; 62 బంతుల్లో 6×4, 1×6) అర్ధ సెంచరీతో మరోసారి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక పంజాబ్ బౌలర్లలో అశ్విన్, […]

హైదరాబాద్‌పై పంజాబ్ విజయం

Updated on: Apr 09, 2019 | 1:17 PM

  • ఉత్కంఠ పోరులో సన్‌‌‌రైజర్స్ పై విజయం 
  • మెరిసిన రాహుల్, మయాంక్
  • వార్నర్ అర్ధ సెంచరీ వృధా 

మొహాలీ: మొహాలీ వేదికగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ ఓటమి పాలైంది. సోమవారం మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (70; 62 బంతుల్లో 6×4, 1×6) అర్ధ సెంచరీతో మరోసారి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక పంజాబ్ బౌలర్లలో అశ్విన్, షమీ, రెహ్మాన్‌లు చెరో వికెట్ పడగొట్టారు.

అనంతరం లక్ష్య ఛేదనలో భాగంగా బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ జట్టుకు ఓపెనర్ రాహుల్ (71 నాటౌట్; 53 బంతుల్లో 7×4, 1×6)తో పాటు మయాంక్ అగర్వాల్ (55; 43 బంతుల్లో 3×4, 3×6) సత్తా చాటడంతో లక్ష్యాన్ని పంజాబ్ 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పంజాబ్ ఓపెనర్ కేఎల్ రాహుల్‌కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది.