6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు బాదేశాడు.. ఎవరంటే.?

అతడొక టెస్ట్ బ్యాటర్.. కానీ మొదటి టీ20 మ్యాచ్‌లోనే దుమ్ములేపాడు. తన పవర్ హిట్టింగ్‌తో అదరగొట్టి వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత మ్యాచ్‌కే రిటైర్మెంట్ ఇచ్చాడు. మరి ఆ బ్యాటర్ ఎవరు.? ఏ టీంపై కొట్టాడు.. ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు బాదేశాడు.. ఎవరంటే.?
Cricket

Updated on: Jan 19, 2026 | 11:47 AM

టెస్ట్ బ్యాటర్‌గా, ది వాల్‌గా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ ద్రావిడ్.. తాను స్లో బ్యాటర్ కాదని చాటి చెప్పాడు. అతడు టీమిండియా తరపున ఆడిన ఏకైక టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై సమిత్ పటేల్ బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సులు కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 147 స్ట్రైక్ రేట్‌తో 31 పరుగులు సాధించిన ద్రావిడ్, ఈ అరంగేట్ర మ్యాచ్ తర్వాతే తన రిటైర్‌మెంట్‌ను ప్రకటించడం విశేషం. ఆ వివరాలు ఇలా.. క్రికెట్ చరిత్రలో రాహుల్ ద్రావిడ్ పేరు వినగానే అందరికీ ‘ది వాల్’ అనే బిరుదు, టెస్ట్ క్రికెట్‌లో అతని అద్భుతమైన డిఫెన్స్, ఓపికతో కూడిన బ్యాటింగ్ గుర్తుకు వస్తాయి. అతడు నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తాడు. సిక్సులు కొట్టడానికి అంతగా ప్రయత్నించరనే అభిప్రాయం సాధారణంగా అందరిలోనూ ఉంటుంది. అయితే, నిజానికి రాహుల్ ద్రావిడ్ తన కెరీర్‌లో ఓ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

ఇది చదవండి: ఆ డైరెక్టర్ ఇంటి గేటు దగ్గర ఛాన్స్‌లు కోసం నేను, చిరంజీవి వెయిట్ చేశాం.. ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ హీరో

టీమిండియా తరపున తాను ఆడిన ఏకైక టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో ద్రావిడ్ ఈ ఫీట్‌ను సాధించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో, సమిత్ పటేల్ బౌలింగ్‌లో రాహుల్ ద్రావిడ్ వరుసగా మూడు బంతుల్లో మూడు సిక్సులు కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తాను టీ20 ఫార్మట్‌లో కూడా దూకుడుగా ఆడగలనని ఆ షాట్‌ల ద్వారా నిరూపించాడు. ఈ ఇన్నింగ్స్‌లో ద్రావిడ్ కేవలం 147 స్ట్రైక్ రేట్‌తో 31 పరుగులు కొట్టాడు. ఇంకా ఆసక్తికర విషయమేమిటంటే.. ఇదే అతడి అంతర్జాతీయ టీ20 అరంగేట్ర మ్యాచ్.. ఈ మ్యాచ్ తర్వాతే అతడు తన రిటైర్‌మెంట్‌ను ప్రకటించాడు. ఇది అతడి పరిమిత ఓవర్ల కెరీర్‌కు అనూహ్య ముగింపు అని చెప్పొచ్చు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఆరుగురు పతివ్రతలు చేశాక సినిమాలు ఆపేయడానికి కారణం ఇదే.. నిజాన్ని చెప్పిన సీరియల్ నటుడు

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..