Samit Dravid: దడదడలాడిస్తున్న రాహుల్ ద్రవిడ్ కొడుకు.. కళ్లు చెదిరే సిక్సర్ బాదిన సమిత్.. వీడియో చూశారా?

టీమిండియా క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ తనయుడు సమిత్ ద్రవిడ్ తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తున్నాడు. నాన్న లాగే అంతర్జాతీయ క్రికెటర్ గా మారేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాడు. తాజాగా సుమిత్ కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న మహారాజా ట్రోఫీ టీ20 లీగ్‌లోకి అడుగు పెట్టాడు.

Samit Dravid: దడదడలాడిస్తున్న రాహుల్ ద్రవిడ్ కొడుకు.. కళ్లు చెదిరే సిక్సర్ బాదిన సమిత్.. వీడియో చూశారా?
Rahul Dravid's Son Samit

Updated on: Aug 18, 2024 | 7:26 AM

టీమిండియా క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ తనయుడు సమిత్ ద్రవిడ్ తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తున్నాడు. నాన్న లాగే అంతర్జాతీయ క్రికెటర్ గా మారేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాడు. తాజాగా సుమిత్ కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న మహారాజా ట్రోఫీ టీ20 లీగ్‌లోకి అడుగు పెట్టాడు. మైసూర్ వారియర్స్ తరఫున బరిలోకి దిగాడు. తాజాగా బెంగళూరు బ్లాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్ లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు సమిత్ . అయితే కొన్ని అద్భుతమైన షాట్లతో ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు బ్లాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మైసూర్ వారియర్స్ తరఫున సమిత్ ద్రవిడ్ 7 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ఏడు పరుగుల్లో ఒక భారీ సిక్సర్ ఉండడం విశేషం. బెంగళూరు బ్లాస్టర్స్ పేసర్ నవీన్ వేసిన 7వ ఓవర్ నాలుగో బంతికి సమిత్ ద్రవిడ్ లాంగ్ ఆన్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. ఈ సిక్స్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమిత్ దూకుడుగా ఆడే విధానాన్ని అభిమానులు మెచ్చుకుంటున్నారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 18 ఓవర్లకే పరిమితమైన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మైసూర్ వారియర్స్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని బెంగళూరు బ్లాస్టర్స్ జట్టు 17.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. ఆ జట్టు బ్యాటర్ భువన్ రాజు కేవలం 24 బంతుల్లో 6 సిక్స్‌లు, 1 ఫోర్‌తో 51 పరుగులు చేశాడు. తద్వారా బెంగళూరు బ్లాస్టర్స్ జట్టు 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

మహారాజా ట్రోఫీ టీ20 లీగ్ వేలంలో తన పేరును నమోదు చేసుకున్న రాహుల్ ద్రవిడ్ కుమారుడిని తొలిసారిగా మైసూర్ వారియర్స్ ఫ్రాంచైజీ రూ.50,000కు కొనుగోలు చేసింది. మహారాజా ట్రోఫీ 2024 సెప్టెంబర్ 15 నుండి ప్రారంభమైంది. అక్టోబర్ 1 వరకు కొనసాగుతుంది. ఈ టోర్నీలోని అన్ని మ్యాచ్‌లకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..