మిస్టర్ డిపెండబుల్, టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అడుగుజాడల్లోనే అతని చిన్న కుమారుడు నడుస్తున్నాడు. తాజాగా కర్ణాటక క్రికెట్ జట్టు కెప్టెన్‌గా రాహుల్ చిన్న కొడుకు అన్వయ్ ద్రవిడ్ ఎంపికయ్యాడు. ఇంటర్ జోనల్ అండర్-14 టోర్నమెంట్‌లో అన్వయ్ కర్ణాటక టీమ్‌ను ముందుండి నడిపించనున్నాడు. తండ్రిలాగే వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ అయిన అన్వయ్.. గతకొంతకాలంగా విశేషంగా రాణిస్తూ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. కాగా రాహుల్ ద్రవిడ్ పెద్ద కొడుకు, అన్వయ్ అన్న సమిత్ ద్రవిడ్ కూడా ఇప్పటికే క్రికెటర్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడు. 2019-20 సీజన్‌లో అండర్-14 క్రికెట్‌లో రెండు డబుల్ సెంచరీలు బాది అందరి దృష్టిని ఆకర్షించాడు సమిత్. ఇప్పుడు అన్వయ్ కూడా క్రికెట్‌లో తండ్రికి తగ్గ తనయుడనిపించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. కాగా రెండేళ్ల క్రితం అండర్-14 ఇంటర్ జోనల్ టోర్నీలో కర్ణాటక జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన అన్వయ్.. అన్నయ్య సమిత్‌తో కలిసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. BTR షీల్డ్ అండర్ 14 స్కూల్ టోర్నమెంట్‌లో భాగంగా సోదరులిద్దరూ డబుల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు.ఇందులో వికెట్ కీపర్ బ్యాటర్ అయిన అన్వయ్ ద్రవిడ్ 90 పరుగులు చేశాడు.
ద్రవిడ్ పెద్ద కొడుకు సమిత్ ద్రవిడ్ ఐపీఎల్ సమయంలో తన తండ్రి క్రికెట్ ఆడటం చూస్తూ పెరిగాడు. అయితే చిన్న కొడుకు అన్వయ్‌కి తన తండ్రి ఆటను చూసే అవకాశం రాలేదు. అయితే తన తండ్రి వారసత్వాన్ని నిలబెడుతూ క్రికెట్‌లో తన ట్యాలెంట్‌ను నిరూపించుకుంటున్నాడు. రాహుల్ ద్రవిడ్ లాగే అన్వయ్ కూడా వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ కావడంతో తండ్రిలాగే బాగా సక్సెస్ అవుతాడని అందరూ అనుకుంటున్నారు.
Anvay Dravid, #RahulDravid ‘s younger son to lead #Karnataka U-14 team in the inter zonal tournament (South Zone) pic.twitter.com/ynvwtbLN6G
— Manuja (@manujaveerappa) January 19, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..