విరాట్ కోహ్లి అంతర్జాతీయ స్థాయిలో సెంచరీ చేయక దాదాపు రెండేళ్లవుతోంది. ఈ ఏడాది కోహ్లీ 10 మ్యాచ్‌ల్లో మొత్తం 483 పరుగులు చేశాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీల జాబితాలో కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. రికీ పాంటింగ్, సచిన్ టెండూల్కర్ అతని కంటే ముందున్నారు. అయితే, కోహ్లీ తన 71వ సెంచరీని ఇంకా దాటలేదు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో కోహ్లీ తన సెంచరీల కరువుకు తీర్చుకుంటాడని అంచనా వేస్తున్నారు. అయితే భారత జట్టు కొత్త ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, కోహ్లీని ప్రశంసించాడు. అతను జట్టులో ఫిట్‌నెస్ సంస్కృతికి కొత్త భాష్యాన్ని చెప్పాడని అన్నాడు.
“గత 10 సంవత్సరాలలో కోహ్లీ క్రికెటర్‌గా ఎదగడం చాలా అద్భుతంగా ఉంది. అతను జట్టుకు సారథ్యం వహించిన తీరు, జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన తీరు అద్భుతం. అతను మొత్తం జట్టులో ఫిట్‌నెస్ సంస్కృతి గణనీయంగా పెంచాడు. ఆయనతో కలిసి పనిచేయాలని ఎదురుచూస్తున్నాను. అతను నిరంతరం ముందుకు సాగుతున్నాడు” అని ద్రవిడ్ చెప్పాడు.
రాహుల్ తన కెప్టెన్సీలో భారత జట్టు 2006 దక్షిణాఫ్రికాలో పర్యటించి అద్భుతమైన విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాలో 2003లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్‌లోకి ప్రవేశించినా గెలవలేకపోయింది. దీనిపై ద్రవిడ్ మాట్లాడాడు. “ఇది అద్భుతమైన దేశం. క్రికెట్ ఆడటం చాలా సవాలుతో కూడుకున్న ప్రదేశం, కానీ ఇక్కడ ఆడటం సరదాగా ఉంటుంది. దక్షిణాఫ్రికాలో ఆడిన కొన్ని అద్భుతమైన జ్ఞాపకాలు నాకు ఉన్నాయి. ఇక్కడి మ్యాచ్‌లో కెప్టెన్‌గా గెలిచాను. ఇక్కడ కొన్ని కఠినమైన మ్యాచ్‌లు కూడా ఆడాను. 2003లో ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరుకున్నాం. ఇవి అద్భుతమైన జ్ఞాపకాలు. క్రికెట్ అంటే చాలా మక్కువ ఉన్న ప్రదేశం ఇది. అని చెప్పుకొచ్చాడు.
.@imVkohli‘s transformation ?
Excitement about SA challenge ?
Initial few months as Head Coach ☺️Rahul Dravid discusses it all as #TeamIndia gear up for the first #SAvIND Test in Centurion. ? ?
Watch the full interview ? ?https://t.co/2H0FlKQG7q pic.twitter.com/vrwqz5uQA8
— BCCI (@BCCI) December 25, 2021
Read Also.. Shahid Afridi: భారత్తో మ్యాచ్కు ముందు నిద్రపోయేవాళ్లం కాదు.. ఆసక్తికర విషయాలు చెప్పిన షాహిద్ అఫ్రిది..