వెస్టిండీస్ ఛాంపియన్‌షిప్‌లో లీవార్డ్ ఐలాండ్స్ వర్సెస్ జమైకా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ప్రపంచంలోనే అత్యంత భారీ క్రికెటర్లలో ఒకరైన రహ్కీమ్ కార్న్‌వాల్ 100 పరుగుల వ్యవధిలో 10 మంది బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్ చేర్చాడు. దీంతో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాడు.
ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 4 వరకు జరిగిన ఈ మ్యాచ్‌లో, రహ్కీమ్ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌లను కలిపి తన 10 వికెట్లు సాధించాడు. అయితే, బంతితో ప్రకంపనలు సృష్టించకముందే బ్యాటింగ్‌లోనూ దంచేశాడు. లీవార్డ్ ఐలాండ్ ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసి మొదటి ఇన్నింగ్స్‌లో 260 పరుగులు చేసిన తర్వాత ఆలౌట్ అయింది. రహ్కీమ్ 29 పరుగులు చేశాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జమైకా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 234 పరుగులు మాత్రమే చేయగలిగింది. జమైకాపై లీవార్డ్ ఐలాండ్ బౌలర్ రహ్కీమ్ కార్న్‌వాల్ తొలి ఇన్నింగ్స్‌లో 56 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. రహ్కీమ్ బంతితో సృష్టించిన ఈ తిరుగుబాటు కారణంగా లీవార్డ్ ఐలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 26 పరుగుల ఆధిక్యం సాధించింది.
లీవార్డ్ ఐలాండ్ రెండో ఇన్నింగ్స్ 241 పరుగులు చేసింది. ఇందులో రహ్కీమ్ కార్న్‌వాల్ బ్యాట్‌తో 85 పరుగులు చేశాడు. దీంతో జమైకా జట్టు 268 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగింది. కానీ, జమైకా జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోయి 200 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితం డ్రాగా ముగిసింది.
లీవార్డ్ దీవులకు రెండో ఇన్నింగ్స్‌లో రహ్కీమ్ మరోసారి అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు. ఈసారి 41 పరుగులకే 5 వికెట్లు పడగొట్టాడు. ఈ విధంగా, అతను మ్యాచ్‌లో 95 పరుగులు చేసి మొత్తం 10 మంది బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్ చేర్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..