Anjum Chopra : వారిద్దరూ మంచి మిత్రులు.. వారి మధ్య విభేదాలు కలిగించవద్దంటున్న మహిళా క్రికెట్ జట్టు మాజీ సారథి..
Anjum Chopra : టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానె మంచి మిత్రులని వారిద్దరి మధ్య విభేదాలు కలిగించొద్దని హితవు చెబుతుంది
Anjum Chopra : టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానె మంచి మిత్రులని వారిద్దరి మధ్య విభేదాలు కలిగించొద్దని హితవు చెబుతుంది మహిళా క్రికెట్ జట్టు మాజీ సారథి అంజుమ్ చోప్రా. రహానె నాయకత్వం బాగుందని, విరాట్ సారథ్యంలో లోపాలున్నాయంటూ వారి అనుబంధానికి అంతరాయం కలిగించొద్దని ఆమె సూచించారు. రెండో టెస్ట్ సందర్భంగా అంజుమ్ పలు విషయాలను మీడియాకు తెలియజేశారు.నాయకత్వ మార్పు వాదనలోకి నేను దిగనని, అజింక్య రహానె శతకం చేసి మెల్‌బోర్న్ మ్యాచ్ గెలిపించడం అద్భుతం అన్నారు.
ప్రతి ఆటగాడు మైదానంలోకి వెళ్లి మెరుగైన ప్రదర్శన చేయాల్సిందేనన్నారు. ఎవరికి అవకాశం దొరికితే వారు మెరుగైన ప్రదర్శన చేసి జట్టుకు విజయం అందింస్తారని, టీమ్‌ఇండియా గెలుపు కోసం ఎవరి సత్తా మేరకు వారు పని చేస్తున్నారని అంజుమ్ అన్నారు. ఆసీస్‌లో అజింక్య జట్టు గెలిచిందని విరాట్‌ను తీసేసి అతడికి పగ్గాలు అప్పజెప్పాలనడం సరికాదన్నారు. డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలు కాకుండా స్నేహపూర్వక వాతావరణానికి ఉపయోగపడే మాటలు మాట్లాడాలని హితవు చెప్పారు. నిజానికి అజింక్య, విరాట్ మంచి స్నేహితులని, పదవులతో వారికి సంబంధం లేదని, వారిద్దరూ జట్టు విజయం కోసమే ఆడతారని గుర్తుచేశారు. కాకపోతే వారిలో ఎవరో ఒక్కరే టాస్ కోసం వెళ్తారని అన్నారు.