Video: రోహిత్, కోహ్లీ విఫలమైన చోట.. సెంచరీతో చెలరేగిన అశ్విన్.. చెపాక్‌లో రికార్డుల ఊచకోత

Ravichandran Ashwin Century: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో టీమిండియా రీ ఎంట్రీ చేసింది. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి రోజు మూడో సెషన్‌లో ప్రస్తుతం భారత జట్టు 6 వికెట్లకు 335 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ క్రీజులో ఉన్నారు. అశ్విన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

Video: రోహిత్, కోహ్లీ విఫలమైన చోట.. సెంచరీతో చెలరేగిన అశ్విన్.. చెపాక్‌లో రికార్డుల ఊచకోత
Ravichandran Ashwin Century

Updated on: Sep 19, 2024 | 5:05 PM

Ravichandran Ashwin Century: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో టీమిండియా రీ ఎంట్రీ చేసింది. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి రోజు మూడో సెషన్‌లో ప్రస్తుతం భారత జట్టు 6 వికెట్లకు 335 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ క్రీజులో ఉన్నారు. అశ్విన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా, జడేజా యాభై పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. వీరిద్దరూ 7వ వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని కూడా పూర్తి చేశారు. ఓ దశలో టీమిండియా 144 పరుగుల వద్ద 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకపోయింది. జైస్వాల్, రిషబ్ పంత్, అశ్విన్, జడేజాలు సూపర్ ఇన్నింగ్స్‌తో భారత జట్టును భారీ స్కోర్ దిశగా తీసుకెళ్తున్నారు.

అశ్విన్ సెంచరీ..

రవిచంద్రన్ అశ్విన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 74వ ఓవర్ మూడో బంతికి సింగిల్ తీసి సెంచరీ పూర్తి చేశాడు. అశ్విన్ తన టెస్టు కెరీర్‌లో ఆరో సెంచరీని పూర్తి చేశాడు. కేవలం 108 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సులతో సెంచరీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..