SRH: ఆ ప్లేయర్ కోసం కోట్లైనా తగ్గేదేలే.! సన్‌రైజర్స్ పక్కా స్కెచ్.. ఐపీఎల్‌లో మరో సంచలనం..

ఐపీఎల్ 2024 వేలానికి ముందు టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ట్రేడింగ్.. టోర్నమెంట్ హిస్టరీలోనే పెను సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గుజరాత్ కెప్టెన్‌గా ఆ టీంకు ఒక సీజన్‌లో ట్రోఫీని అందించి.. మరో సీజన్‌లో ఫైనల్‌కు చేర్చిన హార్దిక్ పాండ్యా.. ఈ ప్లేయర్ మాదిరిగానే మరో ఆటగాడిని కూడా ట్రేడ్ ద్వారా తీసుకోనుంది SRH..

SRH: ఆ ప్లేయర్ కోసం కోట్లైనా తగ్గేదేలే.! సన్‌రైజర్స్ పక్కా స్కెచ్.. ఐపీఎల్‌లో మరో సంచలనం..
SRH

Updated on: Dec 06, 2023 | 6:10 PM

ఐపీఎల్ 2024 వేలానికి ముందు టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ట్రేడింగ్.. టోర్నమెంట్ హిస్టరీలోనే పెను సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గుజరాత్ కెప్టెన్‌గా ఆ టీంకు ఒక సీజన్‌లో ట్రోఫీని అందించి.. మరో సీజన్‌లో ఫైనల్‌కు చేర్చిన హార్దిక్ పాండ్యా.. అనూహ్యంగా వచ్చే ఐపీఎల్ సీజన్ ముందు ట్రేడింగ్ ద్వారా గుజరాత్ నుంచి ముంబైకి మారాడు. అంబానీ ఫ్రాంచైజీ హార్దిక్‌కు రూ. 15 కోట్లు + ఎక్స్ అమౌంట్ పే చేయనుందని టాక్. ఇక ఇప్పుడు హార్దిక్ మాదిరిగానే మరో ప్లేయర్ కూడా ఫ్రాంచైజీ మారనున్నట్టు వార్తలొస్తున్నాయి. అతడు మరెవరో కాదు.. లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్.

వన్డే వరల్డ్‌కప్‌లో డికాక్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా సెంచరీలు సాధించి రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలోనే డికాక్‌ను లక్నో నుంచి హైదరాబాద్ ట్రేడ్ చేసుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. గత కొంతకాలంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సరైన ఓపెనింగ్ జోడి లేదు. ఈ క్రమంలోనే స్టార్ ఓపెనర్ డికాక్‌ను సొంతం చేసుకోవాలని సన్‌రైజర్స్ భావిస్తోందట. ఇప్పటికే ఈ అంశంపై లక్నోతో హైదరాబాద్ యాజమాన్యం చర్చలు జరిపినట్టు సమాచారం. కాగా, ఐపీఎల్ 2023లో రూ. 6.75 కోట్లకు డికాక్‌ను సొంతం చేసుకుంది లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం. అతడ్ని అదే జట్టు ఐపీఎల్ 2024 మినీ వేలానికి ముందుగా రిటైన్ చేసుకుంది. ఇటీవలే వన్డేలు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన డికాక్.. ఇకపై టీ20లకే పరిమితం కానున్నాడు. కాగా ఐపీఎల్‌-2024 మినీ వేలం డిసెంబర్‌ 19న దుబాయ్‌ వేదికగా జరగనుంది.