Punjab Kings: పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీలో ట్విస్ట్.. ఆ ప్లేయర్‌ని ఎన్నుకుంటే జీరో నుంచి ప్రయాణించాల్సిందే..

|

Feb 19, 2022 | 8:12 AM

IPL 2022: మయాంక్ అగర్వాల్, అర్ష్‌దీప్ సింగ్‌లను వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ కేవలం ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే ఉంచుకుంది. శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్..

Punjab Kings: పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీలో ట్విస్ట్.. ఆ ప్లేయర్‌ని ఎన్నుకుంటే జీరో నుంచి ప్రయాణించాల్సిందే..
Punjab Kings Team 2022
Follow us on

Punjab Kings: పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శిఖర్ ధావన్‌(Shikhar Dhawan)ని నియమిస్తారని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే, పంజాబ్ కింగ్స్ యజమాని మోహిత్ బర్మన్ మరోలా హింట్ ఇచ్చాడు. న్యూస్9 స్పోర్ట్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బర్మన్ మాట్లాడుతూ, “ఇంతకు ముందు ఆడిన సీనియర్ ఆటగాడు జట్టును నడిపించడంలో అంత పెద్ద ప్రయోజనం అని నేను భావిస్తున్నాను” అని తెలిపాడు. మయాంక్ అగర్వాల్(Mayank Agarwal), అర్ష్‌దీప్ సింగ్‌లను వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ కేవలం ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. కేఎల్ రాహుల్ లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్‌గా సైన్ అప్ చేసిన తర్వాత, కొత్త కెప్టెన్‌పై ప్రశ్న తలెత్తింది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో జరిగిన వేలంలో, పంజాబ్ కింగ్స్ శిఖర్ ధావన్‌ను 10 మార్క్యూ ప్లేయర్‌ల జాబితా నుంచి రూ.8.25 కోట్లకు రిటైన్ చేసింది. అయితే పంజాబ్ కింగ్స్ జట్టు సీనియర్, ఎంతో అనుభవజ్ఞుడైన భారత ఓపెనర్‌ను కెప్టెన్‌గా చేయనుందని వార్తలు వినిపించాయి. కానీ, ప్రస్తుతం శిఖర్ స్థానంలో మయాంక్ వచ్చి చేరాడు.

“మా వ్యూహం ఏమిటంటే, చాలా బలమైన లెఫ్టినెంట్‌లను ప్రతి స్థానంలో ఉంచడం. తద్వారా కెప్టెన్‌కు నాయకత్వం వహించడం చాలా సులభం అవుతుంది. ఎవరి పని వారు సక్రమంగా చేస్తున్నప్పుడు సారథి ఎవరన్నది ఎవరూ పట్టించుకోరు. కాబట్టి నేను బలమైన జట్టుగా కనిపించే సమానమైన ప్లేయింగ్ సైడ్ ఇవ్వాలనుకుంటున్నాను” అని ఆయన తెలిపారు.

2014లో ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ రన్నరప్‌గా నిలిచింది. దీంతో ఈ జట్టులోనే కాకుండా కుర్రాళ్లతో ఎదగగల, ఆత్మవిశ్వాసాన్ని నింపగల కెప్టెన్‌లో కూడా సమతుల్యత కోసం చూస్తుంది. మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ టాప్ పెర్ఫార్మర్‌లలో ఒకటిగా నిలిచింది. శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, ఒడియన్ స్మిత్, షారుక్ ఖాన్‌లతో కూడిన బ్యాటింగ్ లైనప్‌ను వారు పొందగలిగారు. కగిసో రబడా ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు.

“పది జట్లతో కూడిన మెగా వేలంలో మేం ప్రతి విరామంలో చాలా గందరగోళం, మేధోమథనం చేశాం. వాస్తవానికి మేం సానుకూలంగా ప్రారంభించడం మా అదృష్టంగా భావించాం. ఎందుకంటే మేం మా మొదటి ఆటగాళ్లైన శిఖర్, రబడలను పొందగలిగాం. మయాంక్‌తో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా శిఖర్ ఎంపికయ్యాడు. బౌలింగ్ అటాక్‌ను నడిపించే బౌలర్‌గా రబాడా చేరాడు. మేం మొదటి రౌండ్‌లో మా మొదటి ఎంపికలను రెండింటినీ పొందగలిగాం. కాబట్టి, తరువాతి రౌండ్‌లలో ఇది మాకు సులభతరం చేసింది” అని మోహిత్ బర్మన్ తెలిపారు.

జట్టులో ప్రభ్‌సిమ్రాన్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, వైభవ్ అరోరా, బల్తేజ్ సింగ్, అండర్-19 ప్రపంచ కప్ విన్నింగ్ స్టార్ రాజ్ అంగద్ బావా వంటి స్థానిక ఆటగాళ్లు కూడా ఉన్నారు. బహుశా మయాంక్ అగర్వాల్‌ను సారథిగా నియమిస్తే, మోహిత్ బర్మన్ బృందం ఎలా రాణిస్తుందో చూడాలి. అయితే మయాంక్ అగర్వాల్‌‌ను కెప్టెన్ చేస్తే పంజాబ్ కింగ్స్ టీం జీరో నుంచి మొదలుపెట్టనుందని తెలుస్తోంది.

Also Read: IND vs WI: రెండో టీ20లో టీమిండియా అద్భుత విజయం.. 2-0 తేడాతో సిరీస్ కైవసం..

Cricket: 77 బంతుల్లో 155 పరుగులు.. ఇద్దరు వికెట్ కీపర్ల పెను విధ్వంసం.. 6గురి బౌలర్ల ఊచకోత.!