Kolkata Knight Riders vs Punjab Kings, 42nd Match: ఐపీఎల్ 2024 42వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంత మైదానం ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 48 బంతుల్లో 108 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడిన ఓపెనర్ జానీ బెయిర్‌స్టో పంజాబ్ కింగ్స్ విజయానికి హీరోగా నిలిచింది. అయితే, అతనికి శశాంక్ సింగ్ నుంచి పూర్తి మద్దతు లభించింది. శశాంక్ సింగ్ కేవలం 28 బంతుల్లో 242.86 స్ట్రైక్ రేట్‌తో 68 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో వరుసగా బౌండరీలు బాదాడు. ఈ ఇన్నింగ్స్‌లో శశాంక్ 2 ఫోర్లు, 8 అద్భుతమైన సిక్సర్లు బాదాడు. పంజాబ్ కింగ్స్‌కు శశాంక్ ఎక్స్ ఫ్యాక్టర్ అని నిరూపిస్తున్నాడు. అయితే, పంజాబ్ కింగ్స్ అతనిని కొనుగోలు చేయాలని అనుకోలేదంట. కానీ వేలంలో జరిగిన చిన్న పొరపాటు కారణంగా అతను ప్రస్తుతం PBKSలో భాగమయ్యాడు. శశాంక్ అద్భుత ప్రదర్శన కారణంగా పంజాబ్ కింగ్స్ 262 పరుగుల స్కోరును ఛేదించి ప్రపంచ రికార్డు సృష్టించగలిగింది.
శశాంక్ తన తుఫాన్ ఇన్నింగ్స్‌తో విధ్వంసం సృష్టించేందుకు డగౌట్లోనే ప్లాన్ వేసినట్లు వెల్లడించాడు. మ్యాచ్ అనంతరం శశాంక్ సింగ్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించాడు. డగౌట్ నుంచి వికెట్‌ను పరిశీలించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నానని తెలిపాడు. ఈ క్రమంలో పిచ్‌ని అర్థం చేసుకుని, అది మంచి బౌన్స్‌గా ఉందని భావించానని, ఆమేరకు నా ప్లాన్ వేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. సునీల్ నరైన్ బౌలింగ్‌ను జాగ్రత్తగా ఆడాలని, మిగిలిన బౌలర్లపై దూకుడుగా ఉండాలని నిర్ణయించుకున్నానని శశాంక్ చెప్పాడు. పంజాబ్ కింగ్స్ తరపున బ్యాటింగ్ చేయడానికి, స్వేచ్ఛగా షాట్లు ఆడేందుకు తనకు పూర్తి స్వేచ్ఛ ఉందని తెలిపాడు.
There’s no one like him! 🔥#SaddaPunjab #PunjabKings #JazbaHaiPunjabi #TATAIPL2024 #KKRvPBKS pic.twitter.com/4rpXNi0x2C
— Punjab Kings (@PunjabKingsIPL) April 26, 2024
ఐపీఎల్ 2024 వేలంలో పంజాబ్ కింగ్స్ శశాంక్ సింగ్‌ను అనుకోకుండా కొనుగోలు చేసింది. వేరొకరికి బదులుగా రూ. 20 లక్షలకు జట్టులో చేర్చుకుంది. ప్రస్తుతం ఈ యంగ్ ప్లేయర్ జట్టును ఆదుకుంటూ.. తనను అనుకోకుండా కొనుగోలు చేసినందుకు తగిన ప్రతిఫలం అందిస్తున్నాడు. 65.7 యావరేజ్‌తో 180పైగా స్ట్రైక్‌రేట్‌తో ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 263 పరుగులు చేశాడు. ఇందులో 18 సిక్సులు, 19 ఫోర్లు ఉన్నాయి. కాగా, ఏప్రిల్ 5న గుజరాత్ జెయింట్స్‌పై కేవలం 29 బంతుల్లోనే 61 పరుగులతో నాటౌట్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న శశాంక్.. నిన్న కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 28 బంతుల్లోనే 68 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ప్రస్తుతం పంజాబ్ జట్టుకు హీరోగా మారాడు. ఇదే ప్రదర్శనతో రాణించి, త్వరలోనే టీమిండియాకు అరంగేట్రం చేయాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.
మ్యాచ్ | బ్యాట్ | తేదీ | గ్రౌండ్ | ఫార్మాట్ |
---|---|---|---|---|
PBKS vs KKR | 68* | 26-ఏప్రిల్-2024 | ఈడెన్ గార్డెన్స్ | T20 |
PBKS vs GT | 8 | 21-ఏప్రిల్-2024 | ముల్లన్పూర్ | T20 |
PBKS vs MI | 41 | 18-ఏప్రిల్-2024 | ముల్లన్పూర్ | T20 |
PBKS vs RR | 9 | 13-ఏప్రిల్-2024 | ముల్లన్పూర్ | T20 |
PBKS vs SRH | 46* | 09-ఏప్రిల్-2024 | ముల్లన్పూర్ | T20 |
PBKS vs GT | 61* | 04-ఏప్రిల్-2024 | అహ్మదాబాద్ | T20 |
PBKS vs LSG | 9* | 30-మార్చి-2024 | లక్నో | T20 |
PBKS vs RCB | 21* | 25-మార్చి-2024 | బెంగళూరు | T20 |
PBKS vs DC | 0 | 23-మార్చి-2024 | ముల్లన్పూర్ | T20 |
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..