
ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సూపర్ విక్టరీ సాధించింది. పంజాబ్ తొలుత బ్యాటింగ్ చేస్తూ.. ఏకంగా 245 పరుగుల భారీ స్కోర్ చేసినా ఓటమి చవిచూసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 36 బంతుల్లోనే 6 ఫోర్లు, 6 సిక్సులతో 82 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడినా, ఓపెనర్లు మంచి స్టార్ట్ ఇచ్చినా, చివర్లో స్టోయినీస్ వరుసగా 4 సిక్సులు బాదినా.. పంజాబ్‌కు ఇంకా పరుగులు తక్కువ పడ్డాయి. 246 పరుగుల టార్గెట్‌ను ఎస్‌ఆర్‌హెచ్ ఏ మాత్రం కంగారు పడకుండా.. ఊదిపారేసింది.
ముఖ్యంగా కాటేరమ్మ కొడుకు అభిషేక్ శర్మ అయితే శివాలెత్తిపోయాడు. 55 బంతుల్లోనే 14 ఫోర్లు, 10 సిక్సులతో 141 పరుగులు రికార్డు బ్రేకింగ్ ఇన్నింగ్స్ ఆడి.. ఎస్‌ఆర్‌హెచ్‌కు ఒంటిచేత్తో విజయం అందించాడు. అలాగే మరో ఓపెనర్ కాటేరమ్మ పెద్ద కొడుకు ట్రావిస్ హెడ్ 37 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సులతో 66 పరుగులతో అదరగొట్టారు. ఇద్దరి ఓపెనర్లే గెలుపును ఖాయం చేసేశారు. 18.3 ఓవర్లలోనే 247 పరుగులు చేసి.. ఈ సీజన్‌లో వరుస ఓటములకు బ్రేక్ వేస్తూ.. రెండో విజయాన్ని నమోదు చేసింది సన్‌రైజర్స్. అయితే.. ఇంత భారీ స్కోర్ చేసి కూడా గెలవలేకపోయినా పంజాబ్ కింగ్స్ ప్లేయర్లు చాలా నిరాశలో కనిపించినప్పటికీ.. వాళ్ల సోషల్ మీడియా అడ్మిన్ మాత్రం తన సూపర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్‌తో ఆకట్టుకున్నాడు.
పవర్ ప్లేలో సన్‌రైజర్స్ ఓపెనర్లు వీరబాదడికి బ్రహ్మానందం భయంతో దండం పెట్టే ఇమేజ్ పోస్ట్ చేశాడు. ఆ తర్వాత అభిషేక్ ఉతికేస్తుంటే.. మహేష్ బాబు కన్నీళ్లు తుడుచుకునే ఇమేజ్ పోస్ట్ చేశాడు. అలాగే మ్యాచ్ ఓడిపోయిన తర్వాత.. సర్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ జరుగుతాయా ఏంటీ అని బాలకృష్ణ సెంటిమెంట్ డైలాగ్ జిఫ్ ఇమేజ్‌ను పోస్ట్ చేశాడు. ఇవి చూసి.. క్రికెట్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మ్యాచ్ ఓడిపోయినా.. నీ సెన్స్ ఆఫ్ హ్యుమర్‌కు హ్యాట్సాఫ్ అంటూ క్రికెట్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
— Punjab Kings (@PunjabKingsIPL) April 12, 2025
— Punjab Kings (@PunjabKingsIPL) April 12, 2025
— Punjab Kings (@PunjabKingsIPL) April 12, 2025
Well played, @SunRisers 👏
We’ll bounce back stronger! 💪 pic.twitter.com/S8FpFcE1EZ
— Punjab Kings (@PunjabKingsIPL) April 12, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..