Prithvi Shaw : దేవుడే మమ్మల్ని కలిపాడు.. ఆకృతి అగర్వాల్‌తో పృథ్వీ షా రొమాంటిక్ రీల్ వైరల్

Prithvi Shaw : పృథ్వీ షా తన ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. నటి ఆకృతి అగర్వాల్‌తో ఉన్న రిలేషన్‌షిప్‌ను గాడ్స్ ప్లాన్ అంటూ అదిరిపోయే రీల్‌తో కన్ఫర్మ్ చేశాడు. ఐపీఎల్ 2026 వేలం తర్వాత ఈ వార్త హాట్ టాపిక్ అయింది.

Prithvi Shaw : దేవుడే మమ్మల్ని కలిపాడు.. ఆకృతి అగర్వాల్‌తో పృథ్వీ షా రొమాంటిక్ రీల్ వైరల్
Prithvi Shaw

Updated on: Jan 10, 2026 | 9:12 AM

Prithvi Shaw : టీమిండియా డాషింగ్ ఓపెనర్ పృథ్వీ షా తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ, తన ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. పృథ్వీ షా తన మనసు దోచుకున్న చిన్నది ఎవరో ప్రపంచానికి పరిచయం చేశాడు. గత కొంతకాలంగా పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ డేటింగ్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వచ్చాయి. వీరు కలిసి డిన్నర్ డేట్‌లకు వెళ్లడం, పార్టీలలో కనిపించడంతో అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. అయితే, వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ పృథ్వీ షా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశాడు.

పృథ్వీ షా షేర్ చేసిన ఈ రీల్ ప్రస్తుతం ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ఇందులో వీరుద్దరూ కలిసి వెకేషన్‌లో గడిపిన అందమైన క్షణాలను పొందుపరిచారు. అయితే, వీరు ఎలా కలిశారనే దానికి పృథ్వీ చాలా కొత్తగా సమాధానం ఇచ్చాడు. ఒక యానిమేటెడ్ క్లిప్‌లో శివుడు, కృష్ణుడు, హనుమంతుడు కలిసి కారులో ప్రయాణిస్తున్నట్లు చూపిస్తూ.. మా కలయిక గాడ్స్ ప్లాన్(దేవుడి నిర్ణయం) అని క్యాప్షన్ ఇచ్చాడు. తన జీవితంలోకి ఆకృతిని పంపినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ పృథ్వీ షా తన భక్తిని, ప్రేమను చాటుకున్నాడు.

ఆకృతి అగర్వాల్ సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న స్టార్. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 30 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. నటిగా కూడా గుర్తింపు తెచ్చుకున్న ఆకృతి, త్వరలోనే బాలీవుడ్ అరంగేట్రం చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పృథ్వీ షా ఫామ్ కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఆకృతి అతనికి నైతిక మద్దతుగా నిలిచిందని సన్నిహితులు చెబుతుంటారు.

పృథ్వీ షా కెరీర్ విషయానికి వస్తే, ఇటీవల జరిగిన ఐపీఎల్ 2026 వేలంలో పృథ్వీ షా తన పాత టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ కే సొంతమయ్యాడు. వేలం మొదట్లో ఎవరూ ఆసక్తి చూపకపోయినా, చివరకు ఢిల్లీ టీమ్ 75 లక్షల రూపాయలకు అతన్ని దక్కించుకుంది. దేశవాళీ క్రికెట్‌లో మహారాష్ట్ర తరపున ఆడుతూ రంజీ ట్రోఫీలో వేగవంతమైన డబుల్ సెంచరీతో రికార్డు సృష్టించిన పృథ్వీ, ఇప్పుడు వ్యక్తిగత జీవితంలోనూ సంతోషంగా ఉన్నాడు. ఈ పాజిటివ్ వైబ్స్‌తో ఐపీఎల్‌లో కూడా మునుపటిలా రెచ్చిపోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి