WTC Final 2021: డబ్ల్యూటీసీ ఫైనల్ ఐదవ రోజున భారత బౌలర్లు న్యూజిలాండ్‌ను 249 పరుగులకు ఆలౌట్ చేశారు. మొత్తానికి భారత బౌలర్లు చెమటోడ్చి కివీస్ బ్యాట్స్‌మెన్స్‌ను పెవిలియన్‌కు చేర్చారు. అయితే సౌథాంప్టన్ లాంటి పరిస్థితుల్లో కివీస్ కెప్టెన్ విలియమ్సన్ ను పెవిలియన్ చేర్చడం అంత సులభం కాదు.
న్యూజిలాండ్ కెప్టెన్ భారత బౌలింగ్ దాడిని సమర్థంగా ఎదుర్కొని నిలిచాడు. షమీ, ఇషాంత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా లాంటి పేసర్లను ధీటుగా నిలబడ్డాడు. చెత్త బంతులను బౌండరీలు తరలిస్తూ.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఎండ్ లో వికెట్లు పడుతున్నా.. ఏమాత్రం తడబడకుండా పరుగులు సాధించాడు. విలియమ్సన్ బ్యాటింగ్ ను చూసి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆందోళన చెందుతున్నట్లు కనిపించాడు. దీంతో భారత ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కేన్ మామను త్వరగా ఔట్ చేయడంటూ కామెంట్లు చేశారు. అయితే ఇందులో ఓ ఫ్యాన్ మాత్రం ఏకంగా సోను సూద్‌కి ట్వీట్ చేశాడు. కేన్ విలియమ్సన్‌ను పెవిలియన్ పంపాలని ఈ బాలీవుడ్ నటుడ్ని కోరాడు. “హలో సోనుసూద్, దయచేసి విలియమ్సన్ ను పెవిలియన్ కు పంపండి” అని ట్వీట్ చేశాడు.
కరోనావైరస్ మహమ్మారి సమయంలో ట్విట్టర్ లో సహాయం కోరిన వారికి సోను సూద్ వెంటనే అందుబాటులోకి వచ్చి తగిన విధంగా తన సహాయాన్ని అందించాడు. దీంతో సదరు అభిమాని ఇలా సోను సూద్‌ను ట్విట్టర్లో అభ్యర్థించాడు. అనంతరం రిప్లై ఇచ్చిన సోనూ.. “మా టీంలో చాలా మంది అనుభవజ్ఞులు ఉన్నారు. తప్పకుండా పెవిలియన్ పంపిస్తారంటూ” రాసుకొచ్చాడు.
విలియమ్సన్ 49 దగ్గర ఔటయ్యాడు. అనంతరం సోను సూద్ ఆ అభిమానికి రిప్లై ఇచ్చాడు. అర్థశతకం చేయకుండా ఇషాంత్ అడ్డుకున్నాడు. అనంతరం న్యూజిలాండ్‌ను 249 పరుగులకే అవుట్ చేయడంలో షమీ (నాలుగు వికెట్లతో) కీలక పాత్ర పోషించాడు.
हमारी टीम में ऐसे दिग्गज हैं जो खुद ही भेज देंगे।
देखा, गया ना।?? https://t.co/QLZ9aBy7rT— sonu sood (@SonuSood) June 22, 2021
Also Read:
IND Vs NZ, WTC Final 2021 Day 6th Live: జడ్డూ ఔట్.. మరింత ఇబ్బందుల్లో టీమిండియా..