KKR vs SRH Playing XI, IPL 2024: వేటకు సిద్ధం.. టాస్ గెలిచిన హైదరాబాద్ .. ఇరు జట్ల ప్లేయింగ్-XI ఇదే

Kolkata Knight Riders vs Sunrisers Hyderabad Confirmed Playing XI in Telugu: ఐపీఎల్-2024 సీజన్ లో భాగంగా మూడో మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టోర్నీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఇద్దరు ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ తలపడనున్నారు

KKR vs SRH Playing XI, IPL 2024: వేటకు సిద్ధం.. టాస్ గెలిచిన హైదరాబాద్ .. ఇరు జట్ల ప్లేయింగ్-XI ఇదే
KKR vs SRH Match

Updated on: Mar 23, 2024 | 7:47 PM

Kolkata Knight Riders vs Sunrisers Hyderabad Confirmed Playing XI in Telugu: ఐపీఎల్-2024 సీజన్ లో భాగంగా మూడో మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టోర్నీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఇద్దరు ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ తలపడనున్నారు. వీరిద్దరూ ఆస్ట్రేలియాకు చెందినవారే అయినా.. ఇక్కడ మాత్రం ఎదురు ప్రత్యర్థులుగా బరిలోకి దిగనున్నారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ జరుగుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. కాబట్టి కేకేఆర్ జట్టు తొలుత బ్యాటింగ్ కు దిగనుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు..(ప్లేయింగ్ ఎలెవన్)

ఇవి కూడా చదవండి

మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సన్, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి నటరాజన్.

కోల్‌కతా నైట్ రైడర్స్  (ప్లేయింగ్ ఎలెవన్)

ఫిలిప్ సాల్ట్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.

ఢిల్లీ ఓటమి..

అంతకు ముందు ఐపీఎల్ 2024 రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ నాలుగు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 19.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..