భీకర సెంచరీతో RCB బ్యాటర్‌ శివతాండవం..! టీమిండియా రికార్డును బద్దలుకొట్టిన ఇంగ్లాండ్‌

ఇంగ్లాండ్ - దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 304 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఫిల్ సాల్ట్ 60 బంతుల్లో 15 ఫోర్లు, 8 సిక్సులతో 141 పరుగులు చేసి కొత్త రికార్డు సృష్టించాడు. జోష్ బట్లర్ (83), హ్యారీ బ్రూక్ (41) కూడా అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడారు.

భీకర సెంచరీతో RCB బ్యాటర్‌ శివతాండవం..! టీమిండియా రికార్డును బద్దలుకొట్టిన ఇంగ్లాండ్‌
Phil Salt

Updated on: Sep 13, 2025 | 7:25 AM

15 ఫోర్లు, 8 సిక్సులతో విధ్వంసం సృష్టించాడు. కేవలం 60 బంతుల్లోనే 141 పరుగులతో కొత్త చరిత్ర లిఖించాడు. ఇంగ్లాండ్‌ తరఫున టీ20ల్లో అత్యధిక స్కోర్‌ చేసిన బ్యాటర్‌గా తన రికార్డును తానే బద్దలుకొట్టి.. సరికొత్త రికార్డును స్థాపించాడు. ఆ బ్యాటర్‌ మరెవరో కాదు.. ఐపీఎల్‌ 2025లో ఆర్సీబీ కప్పు కొట్టడంలో తన వంతు పాత్ర పోషించిన ఆర్సీబీ ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌. శుక్రవారం సౌత్రాఫికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో శివతాండవం చేశాడు. అతనితో పాటు జోష్‌ బట్లర్‌, హ్యారీ బ్రూక్‌ కూడా చెలరేగడంతో ఇంగ్లాండ్‌ టీమిండియా రికార్డును ‍బ్రేక్‌ చేసింది. మరి ఆ వివరాల్ని ఇప్పుడు చూద్దాం..

ఇంగ్లాండ్‌ టూర్‌కు వెళ్లిన సౌతాఫ్రికా మాంచెస్టర్‌ వేదిక శుక్రవారం రెండో టీ20 మ్యాచ్‌ ఆడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ ఏకంగా 304 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 304 పరుగులు భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ 60 బంతుల్లో 15 ఫోర్లు, 8 సిక్సులతో 141 పరుగుల భారీ స్కోర్‌ చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే మరో ఓపెనర్‌ జోష్‌ బట్లర్‌ 30 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సులతో 83 పరుగులు, జాకబ్‌ బెతెల్‌ 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 26 రన్స్‌ చేసి అవుట్‌ అయ్యారు. కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ 21 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 41 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

ఇక టీ20 క్రికెట్‌లో 300లకు పైగా స్కోర్‌ చేసిన మూడో టీమ్‌గా ఇంగ్లాండ్‌ చరిత్ర సృష్టించింది. అంతకంటే ముందు జింబాబ్వే 344, నేపాల్‌ 314 పరుగులు చేశాయి. అయితే అవి మరీ పసికూనలపై ఆడి ఈ స్కోర్లు సాధించాయి. ఇప్పుడు ఇంగ్లాండ్‌ 304 పరుగులతో టీమిండియా 2024లో బంగ్లాదేశ్‌పై చేసిన 297 పరుగుల భారీ స్కోర్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసింది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి