PBKS vs RR, IPL 2021 Highlights: ఉత్కంఠ పోరులో గెలిచిన రాజస్థాన్ రాయల్స్.. 2 పరుగుల తేడాతో ఓడిన పంజాబ్

| Edited By: Anil kumar poka

Sep 22, 2021 | 5:07 PM

PBKS vs RR Highlights: ఈరోజు దుబాయ్‌లో జరిగే పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచులో విజయం ఇరు జట్లకు చాలా కీలకం.

PBKS vs RR, IPL 2021 Highlights: ఉత్కంఠ పోరులో గెలిచిన రాజస్థాన్ రాయల్స్.. 2 పరుగుల తేడాతో ఓడిన పంజాబ్
Pbks Vs Rr Ipl 2021

PBKS vs RR: ఐపీఎల్ 2021లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ టీంల మధ్య జరిగిన మ్యాచులో చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగింది. చివరి ఓవర్లో అయితే నువ్వానేనా అన్న తరహాలో సాగినా.. చివర్లో రాజస్థాన్ బౌలర్లు సత్తా చాటి రెండు వికెట్లు తీసి దెబ్బ కొట్టారు. పంజాబ్ టీం విజయం సాధింస్తుందని అంతా అనుకున్నా చివరి ఓవర్ మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసింది. హోరాహోరీగా సాగిన మ్యాచులో రాజస్థాన్‌ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొత్తానికి పంజాబ్ టీం అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌‌లో ఆల్‌ రౌండ్ ప్రదర్శన చేసినా చివరి ఓవర్‌లో ఫలితం మారిపోవడంతో పంజాబ్‌ టీంకు ఓటమి తప్పలేదు.

ఐపీఎల్ 2021లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ టీంల మధ్య జరుగుతోన్న మ్యాచులో రాజస్థాన్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 185 పరుగులలకు ఆలౌట్ అయింది. టాస్ గెలిచిన బౌలింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ టీం రాజస్థాన్ బ్యాట్స్‌మెన్లను కట్టడి చేయడంలో విఫలమైంది. దీంతో పంజాబ్ టీం ముందు 186 పరుగుల లక్ష్యం ఉంది.

ఇందులో జైస్వాల్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో 6 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. మహిపాల్ 43 పరుగులతో రెండవ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మహిపాల్ 252 స్ట్రైక్ రేట్‌తో బౌలర్లపై విరుచుకపడ్డాడు. కేవలం 17 బంతుల్లో 4 సిక్సులు, 2 ఫోర్లతో 43 పరుగులు బాదేశాడు.

లూయిస్ 36(7ఫోర్లు, 1 సిక్స్), లివింగ్‌స్టోన్ 25 (2 ఫోర్లు, 1 సిక్స్)పరుగులతో రాణించారు. మిగతా వారు అంతగా రాణించలేదు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్షదీప్ 5, షమీ 3, ఇషాన్ పొరెల్, హార్‌ప్రీత్ చెరో వికెట్ పడగొట్టారు.

ఐపీఎల్ 2021 యూఏఈ ఎడిషన్‌లో, ఈరోజు దుబాయ్‌లో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం. ఎందుకంటే ఈ మ్యాచులో గెలిచిన జట్టు ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోనుంది. లేదంటే ఫ్లే ఆఫ్ చేరుకోవాలంటే ప్రతీ మ్యాచులో తప్పక గెలవాల్సి ఉంటుంది. ప్రస్తుతం, ఈ రెండు జట్ల పరిస్థితి సమానంగానే ఉంది. పాయింట్ల పట్టికలో, రాజస్థాన్ జట్టు ఆరవ స్థానంలో ఉండగా, పంజాజ్ టీం ఏడవ స్థానంలో ఉంది.

ఐపీఎల్ 2021 ప్రథమార్ధంలో పంజాబ్ కింగ్స్ టీంకు అంతగా కలిసిరాలేదు. ప్లే ఆఫ్ టికెట్ కోసం రేసు నుంచి జట్టు దూరంగా నిలిచింది. మొదటి అర్ధభాగంలో పంజాబ్ 8 మ్యాచ్‌లు ఆడింది. అందులో 3 మాత్రమే గెలిచింది. 5 ఓడిపోయింది. ఈ జట్టు రన్ రేట్ కూడా మైనస్‌లో ఉంది.

ఐపీఎల్ 2021 మొదటి భాగంలో రాజస్థాన్ టీం కూడా అంత అనుకూలంగా లేదు. పంజాబ్‌తో పోలిస్తే ఈ జట్టు కేవలం ఒక మ్యాచ్ తక్కువగా ఆడింది. రాజస్థాన్ 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడింది. అందులో 3 గెలిచి, 5 మ్యాచుల్లో ఓడిపోయారు.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 21 Sep 2021 11:46 PM (IST)

    ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం

    హోరాహోరీగా సాగిన మ్యాచులో రాజస్థాన్ చివరి ఓవర్ చివరి బంతికి గెలిచింది. పంజాబ్‌ పై 2 పరుగుల తేడాతో విజయం సాధించింది.

  • 21 Sep 2021 11:10 PM (IST)

    15 ఓవర్లకు స్కోర్ 148/2

    12 ఓవర్లు పూర్తయ్యే సరికి పంజాబ్ కింగ్స్ టీం 2 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. క్రీజులో పూరన్ 12, మక్రాం 12 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.


  • 21 Sep 2021 10:59 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్

    మయాంక్ అగర్వాల్ (67) రూపంలో పంజాబ్ కింగ్స్‌ టీం రెండో వికెట్‌ను కోల్పోయింది. రాహుల్ తివాటియా బౌలింగ్‌లో టీం స్కోర్ 126 పరుగుల వద్ద రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. ఓపెనర్లు ఇద్దరూ వెంట వెంటనే పెవిలియన్ చేరడంతో పంజాబ్ టీం కాస్త ఆందోళనలో పడింది.

  • 21 Sep 2021 10:52 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్

    రాహుల్ (49) రూపంలో పంజాబ్ కింగ్స్‌ టీం మొదటి వికెట్‌ను కోల్పోయింది. చేతన సకారియా బౌలింగ్‌లో టీం స్కోర్ 120 పరుగుల వద్ద తొలి వికెట్‌గా వెనుదిరిగాడు.

  • 21 Sep 2021 10:41 PM (IST)

    10 ఓవర్లకు స్కోర్ 106/0

    10 ఓవర్లు పూర్తయ్యే సరికి పంజాబ్ కింగ్స్ టీం వికెట్ నష్టపోకుండా 106 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్ 41, మయాంక్ 58 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ ఓవర్‌లో మొత్తం 25 పరుగుల వచ్చాయి.

  • 21 Sep 2021 10:38 PM (IST)

    అర్థ సెంచరీ పూర్తి చేసిన మయాంక్

    పంజాబ్ బ్యాట్స్‌మెన్ మయాంక్ అగర్వాల్ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. కేవలం 34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54 పరుగులు పూర్తి చేశాడు. ఈ మ్యాచులో తొలి అర్ధ శతకాన్ని సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు.

  • 21 Sep 2021 10:28 PM (IST)

    8 ఓవర్లకు స్కోర్ 72/0

    7 ఓవర్లు పూర్తయ్యే సరికి పంజాబ్ కింగ్స్ టీం వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్ 34, మయాంక్ 35 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 21 Sep 2021 10:27 PM (IST)

    వరుసగా మూడు ఫోర్లు

    పంజాబ్ బ్యాట్స్‌మెన్ మయాంక్ అగర్వాల్.. కార్తిక్ త్యాగి వేసిన 8వ ఓవర్‎‌లో తొలి మూడు బంతులను బౌండరీలు తరలించాడు. వరుస బౌండరీలతో బౌలర్‌కు కొద్దిసేపు చుక్కలు చూపించాడు.

  • 21 Sep 2021 10:22 PM (IST)

    7 ఓవర్లకు స్కోర్ 57/0

    7 ఓవర్లు పూర్తయ్యే సరికి పంజాబ్ కింగ్స్ టీం వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్ 33, మయాంక్ 21 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 21 Sep 2021 10:10 PM (IST)

    5 ఓవర్లకు స్కోర్ 41/0

    5 ఓవర్లు పూర్తయ్యే సరికి పంజాబ్ కింగ్స్ టీం వికెట్ నష్టపోకుండా 41 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్ 30, మయాంక్ 9 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 21 Sep 2021 10:07 PM (IST)

    అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 3000 ఐపీఎల్ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్స్

    75 క్రిస్ గేల్
    80 కేఎల్ రాహుల్
    94 డేవిడ్ వార్నర్
    103 సురేష్ రైనా

  • 21 Sep 2021 10:05 PM (IST)

    4 ఓవర్లకు స్కోర్ 35/0

    4 ఓవర్లు పూర్తయ్యే సరికి పంజాబ్ కింగ్స్ టీం వికెట్ నష్టపోకుండా 35 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్ 26, మయాంక్ 8 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ ఓవర్‌లో రాహుల్ వరుసగా ఫోర్, 2 సిక్స్‌లు బాది బౌలర్లపై ఆధిపత్యం చూపించారు. అలాగే ఐపీఎల్‌లో 3000 పరుగులు పూర్తి చేశాడు.

  • 21 Sep 2021 09:52 PM (IST)

    2 ఓవర్లకు స్కోర్ 9/0

    2 ఓవర్లు పూర్తయ్యే సరికి పంజాబ్ కింగ్స్ టీం వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్ 3, మయాంక్ 6 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 21 Sep 2021 09:44 PM (IST)

    మొదలైన పంజాబ్ బ్యాటింగ్

    186 పరుగుల లక్ష్యంతో పంజాబ్ కింగ్స్ టీం బ్యాటింగ్ ఆరంభించింది. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ బరిలోకి దిగారు.

  • 21 Sep 2021 09:41 PM (IST)

    పంజాబ్ టార్గెట్ 186

    రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ టీంల మధ్య జరుగుతోన్న మ్యాచులో రాజస్థాన్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 185 పరుగులలకు ఆలౌట్ అయింది. టాస్ గెలిచిన బౌలింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ టీం రాజస్థాన్ బ్యాట్స్‌మెన్లను కట్టడి చేయడంలో విఫలమైంది. దీంతో పంజాబ్ టీం ముందు 186 పరుగుల లక్ష్యం ఉంది.

  • 21 Sep 2021 09:18 PM (IST)

    ఎనిమిదో వికెట్ కోల్పోయిన రాజస్థాన్

    క్రిస్ మోరిసీ(5) రూపంలో రాజస్థాన్ రాయల్స్ టీం 8వ వికెట్‌ను కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో టీం స్కోర్ 169 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగాడు.

  • 21 Sep 2021 09:14 PM (IST)

    ఏడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్

    రాహుల్ తెవాటియా (2) రూపంలో రాజస్థాన్ రాయల్స్ టీం ఏడో వికెట్‌ను కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో టీం స్కోర్ 169 పరుగుల వద్ద ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు.

  • 21 Sep 2021 09:07 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన రాజస్థాన్

    మహిపాల్ (43) రూపంలో రాజస్థాన్ రాయల్స్ టీం ఆరో వికెట్‌ను కోల్పోయింది. అర్షదీప్ బౌలింగ్‌లో మక్రంకు క్యాచ్ ఇచ్చి టీం స్కోర్ 169 పరుగుల వద్ద ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు.

  • 21 Sep 2021 09:01 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన రాజస్థాన్

    ప్రయాగ్ (4)) రూపంలో రాజస్థాన్ రాయల్స్ టీం ఐదో వికెట్‌ను కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో మక్రంకు క్యాచ్ ఇచ్చి టీం స్కోర్ 166 పరుగుల వద్ద ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు.

  • 21 Sep 2021 08:55 PM (IST)

    16 ఓవర్లకు స్కోర్ 164/4

    16 ఓవర్లు పూర్తయ్యే సరికి రాజస్థాన్ రాయల్స్ టీం నాలుగు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. క్రీజులో మహిపాల్ 42, ప్రయాగ్ 2 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ ఓవర్‌లో మొత్తం 24 పరుగులు వచ్చాయి.

  • 21 Sep 2021 08:48 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్థాన్

    జైస్వాల్ (49) రూపంలో రాజస్థాన్ రాయల్స్ టీం నాలుగో వికెట్‌ను కోల్పోయింది. అర్షప్రీత్ బౌలింగ్‌లో మయాంక్‌కు క్యాచ్ ఇచ్చి 136 పరుగుల వద్ద నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. అర్థ సెంచరీకి 1పరుగు దూరంలో ఔటయ్యాడు.

  • 21 Sep 2021 08:45 PM (IST)

    14 ఓవర్లకు స్కోర్ 136/3

    14 ఓవర్లు పూర్తయ్యే సరికి రాజస్థాన్ రాయల్స్ టీం 136 పరుగులు చేసింది. క్రీజులో యశస్వి జైస్వాల్ 49, మహిపాల్ 16 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ ఓవర్‌లో మొత్తం 14 పరుగులు వచ్చాయి.

  • 21 Sep 2021 08:37 PM (IST)

    12 ఓవర్లకు స్కోర్ 116/3

    12 ఓవర్లు పూర్తయ్యే సరికి రాజస్థాన్ రాయల్స్ టీం 116 పరుగులు చేసింది. క్రీజులో యశస్వి జైస్వాల్ 45, మహిపాల్ 0 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ ఓవర్‌లో మొత్తం 15 పరుగులు వచ్చాయి.

  • 21 Sep 2021 08:35 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్

    లివింగ్‌స్టోన్ (25) రూపంలో రాజస్థాన్ రాయల్స్ టీం మూడో వికెట్‌ను కోల్పోయింది. అర్షదీప్ బౌలింగ్‌లో అలెన్‌కు క్యాచ్ ఇచ్చి 116 పరుగుల వద్ద మూడో వికెట్‌గా వెనుదిరిగాడు.

  • 21 Sep 2021 08:29 PM (IST)

    11 ఓవర్లకు స్కోర్ 101/2

    11 ఓవర్లు పూర్తయ్యే సరికి రాజస్థాన్ రాయల్స్ టీం 101 పరుగులు చేసింది. క్రీజులో యశస్వి జైస్వాల్ 45, లివింగ్‌స్టోన్ 11 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ ఓవర్‌లో మొత్తం 7 పరుగులు వచ్చాయి.

  • 21 Sep 2021 08:25 PM (IST)

    10 ఓవర్లకు స్కోర్ 94/2

    10 ఓవర్లు పూర్తయ్యే సరికి రాజస్థాన్ రాయల్స్ టీం 94 పరుగులు చేసింది. క్రీజులో యశస్వి జైస్వాల్ 40, లివింగ్‌స్టోన్ 9 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ ఓవర్‌లో మొత్తం 8 పరుగులు వచ్చాయి.

  • 21 Sep 2021 08:21 PM (IST)

    9 ఓవర్లకు స్కోర్ 86/2

    9 ఓవర్లు పూర్తయ్యే సరికి రాజస్థాన్ రాయల్స్ టీం 86 పరుగులు చేసింది. క్రీజులో యశస్వి జైస్వాల్ 34, లివింగ్‌స్టోన్ 7 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ ఓవర్‌లో మొత్తం 10 పరుగులు వచ్చాయి.

  • 21 Sep 2021 08:17 PM (IST)

    8 ఓవర్లకు స్కోర్ 76/2

    8 ఓవర్లు పూర్తయ్యే సరికి రాజస్థాన్ రాయల్స్ టీం 76 పరుగులు చేసింది. క్రీజులో యశస్వి జైస్వాల్ 26, లివింగ్‌స్టోన్ 5 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ ఓవర్‌లో మొత్తం 8 పరుగులు వచ్చాయి.

  • 21 Sep 2021 08:11 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్

    శాంసన్ (4) రూపంలో రాజస్థాన్ రాయల్స్ టీం రెండో వికెట్‌ను కోల్పోయింది. ఇషాన్ పొరెల్ బౌలింగ్‌లో కీపర్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి 68 పరుగుల వద్ద రెండో వికెట్‌గా వెనుదిరిగాడు.

  • 21 Sep 2021 08:08 PM (IST)

    7 ఓవర్లకు స్కోర్ 68/1

    7 ఓవర్లు పూర్తయ్యే సరికి రాజస్థాన్ రాయల్స్ టీం 68 పరుగులు చేసింది. క్రీజులో యశస్వి జైస్వాల్ 26, శాంసన్ 4 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 21 Sep 2021 08:05 PM (IST)

    6 ఓవర్లకు స్కోర్ 57/1

    6 ఓవర్లు పూర్తయ్యే సరికి రాజస్థాన్ రాయల్స్ టీం 57 పరుగులు చేసింది. క్రీజులో యశస్వి జైస్వాల్ 16, శాంసన్ 3 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 21 Sep 2021 08:00 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్

    ఎవిన్ లూయిస్ (36, 7ఫోర్లు, 1 సిక్స్) రూపంలో రాజస్థాన్ రాయల్స్ టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. అర్షదీప్ బౌలింగ్‌లో మయాంక్‌కు క్యాచ్ ఇచ్చి 54 పరుగుల వద్ధ తొలి వికెట్‌గా వెనుదిరిగాడు.

  • 21 Sep 2021 07:54 PM (IST)

    5 ఓవర్లకు స్కోర్ 53/0

    5 ఓవర్లు పూర్తయ్యే సరికి రాజస్థాన్ రాయల్స్ టీం 53 పరుగులు చేసింది. క్రీజులో ఎవిన్ లూయిస్ 36, యశస్వి జైస్వాల్ 15 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 10 ఫోర్లు, 1 సిక్స్ కొట్టారు.

  • 21 Sep 2021 07:50 PM (IST)

    బౌండరీలతో భయపెడుతోన్న ఆర్ఆర్‌ ఓపెనర్లు

    టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ టీం.. బౌండరీలతో పంజాబ్ బౌలర్లపై విరుచుకపడుతున్నారు. 4 ఓవర్లు పూర్తయ్యే సరికి ఎవిన్ లూయిస్ (28), యశస్వి జైస్వాల్ (10) లు ఇద్దరూ కలిసి 7 ఫోర్లు, 1 సిక్స్ బాదేశారు.

  • 21 Sep 2021 07:45 PM (IST)

    3 ఓవర్లకు స్కోర్ 23/0

    3 ఓవర్లు పూర్తయ్యే సరికి రాజస్థాన్ రాయల్స్ టీం 23 పరుగులు చేసింది. క్రీజులో ఎవిన్ లూయిస్ 12, యశస్వి జైస్వాల్ 9 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 3 ఫోర్లు, 1 సిక్స్ కొట్టారు.

  • 21 Sep 2021 07:42 PM (IST)

    తొలి సిక్స్

    ఎవిన్ లూయిస్ రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో రెండో ఓవర్ చివరి బంతిని తొలి సిక్స్‌‌గా మలిచాడు. ఇషాన్ పొరెల్ బౌలింగ్‌లో ఎవిన్ తన తొలి సిక్సర్‌ను కొట్టాడు.

  • 21 Sep 2021 07:40 PM (IST)

    2 ఓవర్లకు స్కోర్ 18/0

    2 ఓవర్లు పూర్తయ్యే సరికి రాజస్థాన్ రాయల్స్ టీం 18 పరుగులు చేసింది. క్రీజులో ఎవిన్ లూయిస్ 8, యశస్వి జైస్వాల్ 8 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 21 Sep 2021 07:39 PM (IST)

    వరుసగా రెండు ఫోర్లు

    యశస్వి జైస్వాల్ రాజస్థాన్ ఇన్నింగ్‌ తొలి ఓవర్‌‌లో చివరి రెండు బంతులను బౌండరీలకు తరలించాడు. షమీ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు.

  • 21 Sep 2021 07:34 PM (IST)

    మొదలైన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్

    టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించింది రాజస్థాన్ రాయల్స్ టీం. ఓపెనర్లుగా లూయిస్, జైశ్వాల్ బరిలోకి దిగారు.

  • 21 Sep 2021 07:14 PM (IST)

    ఈ రోజు అరంగేట్రం చేసేది ఎవరంటే?

    ఈ రోజు ఐపీఎల్ 2021 లో 4గురు ఆటగాళ్లు అరంగేట్రం చేయనున్నారు. రాజస్థాన్ తరపున ఒకరు, పంజాబ్ కింగ్స్ తరపున ముగ్గురు అరంగేట్రం చేయనున్నారు. ఎవిన్ లూయిస్ రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేస్తాడు. ఇషాన్ పోరెల్, ఐడెన్ మార్క్రామ్, ఆదిల్ రషీద్ పంజాబ్ కింగ్స్ తరపున అరంగేట్రం చేస్తారు.

  • 21 Sep 2021 07:10 PM (IST)

    ప్లేయింగ్ ఎలెవెన్

    రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, ఎవిన్ లూయిస్, సంజు శాంసన్ (కీపర్, కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మహిపాల్ లొమ్రర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరిస్, ముస్తఫిజుర్ రహమాన్, చేతన్ సకారియా, కార్తీక్ త్యాగి

    పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): కేఎల రాహుల్ (కీపర్, కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, ఫాబియన్ అలెన్, ఇషాన్ పోరెల్, అదిల్ రషీద్, హర్‌ప్రీత్ బ్రార్, మహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్

  • 21 Sep 2021 07:05 PM (IST)

    టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్

    రెండో దశలో జరిగే మూడో మ్యాచులో పంజాబ్ కింగ్స్ టీం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రాజస్థాన్ రాయల్స్ టీం తొలుత బ్యాటింగ్ చేయనుంది.

  • 21 Sep 2021 06:59 PM (IST)

    క్రిస్ గేల్ 42వ పుట్టినరోజు

    పంజాబ్ కింగ్స్ ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ ఈరోజు 42 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. అయితే గేల్ తన జట్టును విజయపథంలో నడిపించినప్పుడే తన పుట్టిన రోజును ఘనంగా చేసుకోగలడు. దుబాయ్ పిచ్‌పై అతని బ్యాట్ నుంచి పరుగులు రాలడం ఖాయంగా కనిపిస్తోంది. గేల్ ధాటిగా ఆడడం కూడా చాలా కీలకం. ఎందుకంటే పంజాబ్ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 7 వ స్థానంలో ఉంది.

  • 21 Sep 2021 06:54 PM (IST)

    పిచ్ ఎలా ఉంది?

    క్రికెట్ మ్యాచ్‌లో పిచ్ పాత్ర చాలా ముఖ్యమైనది. పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో దుబాయ్ పిచ్ ఎలా ఉందో సునీల్ గవాస్కర్ తెలిపారు. ఈ పిచ్ ఇంతకు ముందు కన్నా కొంచెం భిన్నంగా ఉందని, దీనిపై పరుగులు బాగా వస్తాయని పేర్కొన్నారు. టాస్ గెలిచిన తర్వాత ముందుగా బ్యాటింగ్ చేయడం మంచిదని అన్నారు. ఈ పిచ్‌లో 170-180 స్కోరు చేసేందుకు అవకాశం ఉంది.

Follow us on