PBKS vs MI: శ్రేయాస్ కెప్టెన్ ఇన్నింగ్స్.. 11 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు పంజాబ్.. ఐపీఎల్ కొత్త ఛాంపియన్ ఎవరో?

Punjab Kings vs Mumbai Indians, IPL 2025 Qualifier 2: ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025 ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఈ సీజన్‌లో కొత్త ఐపీఎల్ ఛాంపియన్ ఖాయం కావడంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

PBKS vs MI: శ్రేయాస్ కెప్టెన్ ఇన్నింగ్స్.. 11 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు పంజాబ్.. ఐపీఎల్ కొత్త ఛాంపియన్ ఎవరో?
Pbks Vs Mi Qulifier 2 Match Result

Updated on: Jun 02, 2025 | 5:38 AM

ఐపీఎల్ 2025లో ఉత్కంఠగా సాగిన క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. 2014 తర్వాత పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ ఫైనల్‌కు చేరడం ఇది తొలిసారి కావడం విశేషం.

ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ముంబై బ్యాటింగ్‌లో తిలక్ వర్మ (44), సూర్యకుమార్ యాదవ్ (44) కీలక పరుగులు చేయగా, చివర్లో నమన్ ధీర్ (37 బంతుల్లో 18) మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీ స్కోరు అందించాడు. పంజాబ్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాం 2 వికెట్లు తీశాడు.

అనంతరం 204 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అసాధారణ ప్రదర్శనతో 19 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శ్రేయాస్ అయ్యర్ కేవలం 41 బంతుల్లో 5 ఫోర్లు, 8 భారీ సిక్సర్లతో అజేయంగా 87 పరుగులు చేసి మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. ఇంగ్లిస్ (21 బంతుల్లో 38), నేహాల్ వధేరా (29 బంతుల్లో 48) కూడా కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి అయ్యర్‌కు మద్దతు ఇచ్చారు.

ముంబై ఇండియన్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, అశ్విని కుమార్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీసినా, పంజాబ్ బ్యాట్స్‌మెన్‌ల దూకుడు ముందు నిలబడలేకపోయారు. ముఖ్యంగా, శ్రేయాస్ అయ్యర్ తన కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించి, పంజాబ్ కింగ్స్‌ను 11 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్‌కు చేర్చాడు.

ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025 ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఈ సీజన్‌లో కొత్త ఐపీఎల్ ఛాంపియన్ ఖాయం కావడంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. జూన్ 3న అహ్మదాబాద్‌లోనే ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..