PBKS vs LSG Highlights: రాణించిన దీపక్ హుడా.. 20 పరుగుల తేడాతో పంజాబ్‌పై లక్నో విజయం

| Edited By: Srinivas Chekkilla

Apr 29, 2022 | 11:27 PM

IPL 2022: ఐపీఎల్‌ 2022లో భాగంగా పుణేలోని మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో లక్నో 20 పరుగుల తేడాతో పంజాబ్‌పై విజయం సాధించింది.

PBKS vs LSG Highlights: రాణించిన దీపక్ హుడా.. 20 పరుగుల తేడాతో పంజాబ్‌పై లక్నో విజయం
Pbks Vs Lsg

ఐపీఎల్‌ 2022లో భాగంగా పుణేలోని మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో లక్నో 20 పరుగుల తేడాతో పంజాబ్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చెసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. ఛేదన దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది.

Key Events

పంజాబ్‌కు అనుకూలం..

టాస్‌ గెలవడం పంజాబ్‌కు ప్లస్‌ పాయింట్‌గా చెప్పొచ్చు. ఎంసీఏ స్టేడియం ఫాస్ట్‌ బౌలర్లకు అనుకూలించడమే దీనికి కారణంగా చెప్పొచ్చు.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 29 Apr 2022 11:17 PM (IST)

    లక్నో ఘన విజయం

    పంజాబ్‌పై లక్నో 21 పరుగుల తేడాతో గెలుపొందింది.

  • 29 Apr 2022 11:10 PM (IST)

    ఎనిమిదో వికెట్‌ డౌన్‌..

    పంజాబ్‌ 8వ వికెట్ కోల్పోయింది.


  • 29 Apr 2022 11:03 PM (IST)

    ఏడో వికెట్‌ కోల్పోయిన పంజాబ్

    పంజాబ్ ఏడో వికెట్‌ కోల్పోయింది. రబడ క్యాచ్‌ ఔటయ్యాడు.

  • 29 Apr 2022 10:52 PM (IST)

    బెయిర్‌స్టో ఔట్‌

    పంజాబ్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. 32 పరుగులు చేసిన బెయిర్‌స్టో క్యాచ్‌ ఔటయ్యాడు.

  • 29 Apr 2022 10:40 PM (IST)

    ఐదో వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌

    పంజాబ్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది.

  • 29 Apr 2022 10:32 PM (IST)

    లివింగ్‌స్టోన్‌ ఔట్‌

    పంజాబ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. లివింగ్‌స్టోన్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

  • 29 Apr 2022 10:12 PM (IST)

    మూడో వికెట్‌ డౌన్‌

    పంజాబ్‌ మూడో వికెట్ కోల్పోయింది. రాజపక్స క్యాచ్‌ ఔటయ్యాడు.

  • 29 Apr 2022 10:07 PM (IST)

    శిఖర్ ధావన్‌ ఔట్‌

    పంజాబ్‌ రెండో వికెట్ కోల్పోయింది. శిఖర్‌ ధావన్ బౌల్డ్‌ అయ్యాడు.

  • 29 Apr 2022 10:01 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్

    పంజాబ్‌ తొలి వికెట్ కో ల్పోయింది.

  • 29 Apr 2022 09:21 PM (IST)

    పంజాబ్‌ లక్ష్యం ఎంతంటే..

    టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ దిగిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 153 పరుగులు చేశారు. పంజాబ్‌ బౌలర్లు కట్టడి చేయడంతో తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. పంజాబ్‌ జట్టులో డికాక్‌ చేసిన 46 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. తర్వాత వచ్చిన బ్యాటర్లు దాదాపు అందరూ వచ్చిన వారు వచ్చినట్లు పెవిలియన్‌ బాట పట్టారు. డికాక్‌ తర్వాత దీపక్‌ హుడా మాత్రమే 34 పరుగులు చేశాడు. ఇక పంజాబ్‌ బౌలింగ్ విషయానికొస్తే.. రబడ నాలుగు ఓవర్లకు గాను 38 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. రాహుల్‌ చాహర్‌ 2, సందీప్‌ శర్మ 1 వికెట్ తీసుకున్నారు.

  • 29 Apr 2022 09:10 PM (IST)

    మెరిపించాడు.. వెనుదిరిగాడు..

    దుష్మంత చమీరా అవుట్ అయ్యాడు. వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి జట్టు స్కోరును పెంచుతున్నాడని అనుకునేలోపే రబడ బౌలింగ్‌లో రాహుల్‌ చాహర్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు.

  • 29 Apr 2022 09:07 PM (IST)

    7వ వికెట్‌ కోల్పోయిన లక్నో..

    లక్నో సూపర్ జెయింట్‌ ఏడో వికెట్ కోల్పోయింది. రాహుల్‌ చాహర్‌ బౌలింగ్‌లో సందీప్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చిన జాసన్‌ హోల్డర్‌ అవుట్‌ అయ్యాడు. దీంతో లక్నో 132 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.

  • 29 Apr 2022 08:54 PM (IST)

    కొనసాగుతోన్న వికెట్ల పతనం..

    లక్నో సూపర్‌ జెయింట్స్‌ మరో వికెట్‌ను కోల్పోయింది. రాహుల్‌ చాహర్‌ బౌలింగ్‌లో తనకే క్యాచ్‌ ఇచ్చిన మార్కస్‌ సోయినిస్‌ పెవిలియన్‌ బాట పట్టాడు.

  • 29 Apr 2022 08:49 PM (IST)

    5వ వికెట్‌..

    లక్నో సూపర్‌ జెయింట్స్ వరుసగా వికెట్లు కోల్పోతోంది. రబడ బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్‌కు క్యాచ్‌ ఇచ్చిన ఆయుష్‌ బడోని పెవిలియన్‌ బాట పట్టాడు.

  • 29 Apr 2022 08:47 PM (IST)

    మరో వికెట్‌ డౌన్‌..

    పంజాబ్‌ బౌలింగ్ దాటికి లక్నో బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌ బాట పడుతున్నారు. రబాడా బౌలింగ్‌లో ధవాన్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు.

  • 29 Apr 2022 08:40 PM (IST)

    మూడో వికెట్‌ డౌన్‌..

    లక్నో సూపర్ జెయింట్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 34 పరుగులు చేసి జట్టు స్కోరు పెంచే పనిలో ఉన్న దీపక్‌ హూడా రన్‌అవుట్‌ (బెయిర్‌స్టో) రూపంలో పెవిలియన్‌ బాట పట్టాడు. దీంతో లక్నో 13 ఓవర్లకు కేవలం 104 పరుగులు మాత్రమే చేయగలిగింది.

  • 29 Apr 2022 08:37 PM (IST)

    రెండో వికెట్‌ డౌన్‌..

    లక్నో రెండో వికెట్‌ కోల్పోయింది. హాఫ్‌ సెంచరీకి చేరువలో ఉన్న సమయంలో డికాక్‌ 46 పరుగుల వద్ద అవుట్‌ అయ్యాడు. సందీప్‌ శర్మ బౌలింగ్‌లో జితేశ్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు.

  • 29 Apr 2022 08:16 PM (IST)

    తగ్గిన పరుగుల వేగం..

    పంజాబ్‌ బౌలర్స్‌ కట్టడిగా బౌలింగ్‌ చేస్తుండడంతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ తడబడుతున్నారు. ప్రస్తుతం 9 ఓవర్లు ముగిసే సమయానికి జట్టు స్కోర్‌ 60 పరుగుల వద్ద కొనసాగుతోంది. క్రీజులో దీపక్‌ హూడా (14), డికాక్‌ (30) పరగుల వద్ద కొనసాగుతున్నారు.

  • 29 Apr 2022 07:47 PM (IST)

    లక్నోకు ఆదిలోనే తొలి దెబ్బ..

    లక్నో సూపర్‌ జెయింట్స్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది. గత మ్యాచ్‌ల్లో మంచి ఫామ్‌తో రాణించిన కేఎల్‌ రాహుల్‌ కేవలం 6 పరుగులకే అవుట్‌ అయ్యాడు. రబడ బౌలింగ్‌లో కీపర్‌ జితేష్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి రాహుల్‌ వెనుదిరిగాడు.

  • 29 Apr 2022 07:28 PM (IST)

    ఇరు జట్ల ప్లేయర్స్‌..

    పంజాబ్ కింగ్స్..
    మయాంక్ అగర్వాల్ (కెప్టెన్‌), శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్‌ కీపర్‌), భానుక రాజపక్స, రిషి ధావన్, కగిసో రబడ, రాహుల్ చాహర్, సందీప్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్

    లక్నో సూపర్ జెయింట్స్..
    క్వింటన్ డి కాక్ (వికెట్‌ కీపర్‌), కేఎల్‌ రాహుల్ (కెప్టెన్‌), మనీష్ పాండే, కృనాల్ పాండ్యా, దీపక్ హుడా, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, జాసన్ హోల్డర్, దుష్మంత చమీరా, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, మొహ్‌సీన్‌ ఖాన్‌

  • 29 Apr 2022 07:05 PM (IST)

    టాస్‌ గెలిచిన పంజాబ్‌ కింగ్స్‌..

    టాస్‌ గెలిచిన పంజాబ్‌ కింగ్స్‌ తొలుత బౌలింగ్ చేయడానికి మొగ్గు చూపింది. ఎంసీఏ స్టేడియం ఫాస్ట్‌ బౌలర్లకు అనుకూలించడం, డ్యూ ఫ్యాక్టర్‌ ఉండడంతో పంజాబ్‌ ఛేజింగ్‌ చేయడానికి ఆసక్తిచూపింది. మరి పంజాబ్‌ కింగ్స్‌ తీసుకున్న ఈ నిర్ణయం ఆ జట్టుకు ఏమేర అనుకూలిస్తుందో చూడాలి.

  • 29 Apr 2022 06:54 PM (IST)

    కీలకంగా మారనున్న టాస్‌..

    పుణెలోని ఎంసీఏ స్టేడియం ఎంసీఏ స్టేడియం ఫాస్ట్ బౌలర్లకు అనుకులిస్తుంది. టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

Follow us on