ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL-16) రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కి పంజాబ్ కింగ్స్ (PBKS) 192 పరుగుల లక్ష్యాన్ని అందించింది. మొహాలీ మైదానంలో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసింది.
పంజాబ్ తరపున శ్రీలంక బ్యాట్స్‌మెన్ భానుక రాజపక్సే 32 బంతుల్లో 50 పరుగులు సాధించగా, కెప్టెన్ శిఖర్ ధావన్ 29 బంతుల్లో 40 పరుగులు చేశాడు. వీరిద్దరి మధ్య 55 బంతుల్లో 86 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. అంతకుముందు, ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 23 పరుగులతో జట్టుకు మెరుపు ఆరంభం అందించాడు.
4️⃣4️⃣6️⃣ ?
When @BhanukaRajapak3 took on Narine and got the most out of the powerplay ??
Follow the match ▶️ https://t.co/UeBnlhdZdr#TATAIPL | #PBKSvKKR pic.twitter.com/gtwEVQYNzf
— IndianPremierLeague (@IPL) April 1, 2023
మూడో ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన భానుక రాజపక్సే.. మూడు-నాలుగు బంతులకు పిచ్‌ని, పరిస్థితులను పరీక్షించి ఆ తర్వాత దూకుడు పెంచాడు. మొదట KKR కీలక బౌలర్ అయిన సునీల్ నరైన్‌ను తన బలిపశువుగా చేసుకున్నాడు. ఐదో ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన నరేన్ వేసిన ఓవర్‌లో రాజపక్సే వరుసగా రెండు ఫోర్లు బాది, ఆ తర్వాత చివరి బంతికి లాంగ్ సిక్సర్ బాదాడు.
ఎనిమిదో ఓవర్‌లో నరేన్ మళ్లీ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. ఈసారి రాజపక్సే ఐదు బంతుల్లో ఫోర్లతో సహా 9 పరుగులు చేశాడు. ఈ విధంగా నరేన్‌పై రాజపక్సే 11 బంతుల్లో 23 పరుగులు చేశాడు.
రాజపక్సే నరేన్‌నే కాకుండా ఇతర కోల్‌కతా బౌలర్లను కూడా టార్గెట్ చేశాడు. ఈ విధంగా కేవలం 30 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అయితే, అతను తన ఇన్నింగ్స్‌ను మరింత ముందుకు తీసుకెళ్లలేకపోయాడు. ఉమేష్ యాదవ్ బంతికి తన వికెట్ కోల్పోయాడు. ఈ క్రమంలో కేవలం 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..