PBKS vs CSK Score IPL 2021: తొలి విజయాన్ని అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్..

|

Updated on: Apr 17, 2021 | 4:59 AM

PBKS vs CSK Live Score in Telugu:ఐపీఎల్ 2021లో తొలి విజయాన్ని అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్. పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో చాలా  ఛాలా ఈజీగా విజయం సాధించింది. పంజాబ్ విసిరిన 107 ప‌రుగుల టార్గెట్ ను 

PBKS vs CSK Score IPL 2021: తొలి విజయాన్ని అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్..
Ipl 2021 Pbks Vs Csk Live

ఐపీఎల్ 2021లో తొలి విజయాన్ని అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్. పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో చాలా  ఛాలా ఈజీగా విజయం సాధించింది. పంజాబ్ విసిరిన 107 ప‌రుగుల టార్గెట్ ను  మ‌రో 4.2 ఓవ‌ర్లు మిగిలి ఉండ‌గానే 4 వికెట్లు న‌ష్ట‌పోయి ఛేదించింది.

ఆల్‌రౌండ‌ర్ మొయిన్ అలీ 31 బంతుల్లో 46 ప‌రుగులు చేసి చెన్నై విజ‌యాన్ని అందించాడు. చేజింగ్‌లో 24 ప‌రుగుల‌కే రుతురాజ్ గైక్వాడ్ (5) రూపంలో సూప‌ర్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయినా రెండో వికెట్‌కు డుప్లెస్సితో క‌లిసి 66 ప‌రుగులు జోడించాడు. ఈ ఇద్ద‌రూ పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లను పరుగులు పెట్టించారు. వీలు దొరికిన‌ప్పుడ‌ల్లా బౌండ‌రీలతో మెరిపిస్తూ జట్టును టార్గెట్ కు ద్గరగా  .. చెన్నైని ల‌క్ష్యం వైపు న‌డిపించారు. అస‌లు ఏ స‌మ‌యంలోనూ చెన్నై ఇబ్బంది ప‌డ‌లేదు. గెలుపు ముంగిట రైనా (8), రాయుడు (0) వ‌రుస బంతుల్లో అవుట‌య్యారు. అయితే మిగిలిన ప‌నిని డుప్లెస్సి (36 నాటౌట్‌), శామ్ క‌ర‌న్‌ (5 నాటౌట్) ముగించారు. చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ర‌ఫున 200వ మ్యాచ్ ఆడుతున్న ధోనీకి టీమ్ సభ్యులు విజ‌యాన్ని గిఫ్ట్‌గా అందించారు.

పంజాబ్ కింగ్స్‌ పరువును షారుక్ ఖాన్ కాపాడాడు. ముంబై వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్‌ ఆరంభం నుంచి ధోనీ సేన కట్టుదిట్టమైన బౌలింగ్ తో కట్టడి చేసింది. 20 ఓవ‌ర్లలో 8 వికెట్ల‌కు 106 ప‌రుగులు చేసింది. ఒక ద‌శ‌లో 26 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డిన పంజాబ్‌ను షారుక్ ఖాన్ ఆదుకున్నాడు.

ఐపీఎల్ అనుభ‌వం పెద్ద‌గా లేక‌పోయినా ఎంతో ప‌రిణతితో ఆటతీరును కనబరిచాడు. కెప్టెన్ రాహుల్ (5) స‌హా మ‌యాంక్ అగ‌ర్వాల్ (0), గేల్ (10), పూర‌న్ (0)లాంటి స్టార్లు వెంట వెంట‌నే వెనుదిరిగినా.. షారుక్ మాత్రం 36 బంతుల్లో 47 ప‌రుగులు చేసి పంజాబ్ స్కోరును 100 దాటించాడు. అత‌ని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. అత‌నికి దీప‌క్ హుడా (10), జై రిచ‌ర్డ్‌స‌న్ (15) కాస్త స‌హ‌క‌రించారు.

చెన్నై సూప‌ర్ కింగ్స్ బౌల‌ర్‌ దీప‌క్ చ‌హ‌ర్ చెల‌రేగి బౌలింగ్ చేశాడు. త‌న 4 ఓవ‌ర్ల కోటాలో కేవ‌లం 13 ప‌రుగులు ఇచ్చి 4 వికెట్లు తీయ‌డం విశేషం. దీంతో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు ఆశ‌లు నెర‌వేర‌లేదు. అత‌ని ధాటికి టాప్‌, మిడిలార్డ‌ర్ కుప్ప‌కూలాయి. ఇక ఫీల్డింగ్‌లో జ‌డేజా అద్భుతంగా రాణించాడు. రాహుల్‌ ర‌నౌట్‌, గేల్ క్యాచ్‌ను ప‌ట్టిన తీరు మ్యాచ్‌కే హైలైట్‌. ఒక ర‌కంగా రాహుల్‌ను అత‌డు ర‌నౌట్ చేయ‌డంతోనే మ్యాచ్ మలుపు తిరిగింద‌ని చెప్పొచ్చు. రాహుల్ వికెట్ త‌ర్వాత ఇక పంజాబ్ కోలుకోలేక‌పోయింది.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 16 Apr 2021 10:32 PM (IST)

    రైనా ఔట్

    చెన్నై విజయానికి కొన్ని అడుగుల దూరంలో ఉంది, కానీ రిలీ మెరెడిత్ గొప్ప ఓవర్ తీసుకున్నాడు. మెరెడిత్ మొదటి రెండు ఓవర్లలో ఖరీదైనదని నిరూపించాడు. ఈ ఓవర్లో షార్ట్ బాల్ ముందు రైనా బలహీనతను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించాడు. రైనా కూడా చాలా కలత చెందింది.

  • 16 Apr 2021 10:24 PM (IST)

    మొయిన్ అలీ దూకుడుకు బ్రేక్…

    దూకుడుగా ఆడుతున్న మొయిన్ అలీకి బ్రేక్ పడింది.  మొయిన్ నుండి మొదటి బంతికి సిక్సర్ తీసుకున్న తరువాత అశ్విన్ మూడవ బంతికి తన వికెట్ తీసుకున్నాడు. మొయిన్ మరోసారి బంతిని మిడ్‌వికెట్‌కు పంపించడానికి ప్రయత్నించాడు, కాని ఈసారి షాట్ బౌండరీ వద్ద ఫీల్డర్‌కు చేరుకోగలిగాడు మరియు అతను అవుట్ అయ్యాడు.

  • 16 Apr 2021 10:20 PM (IST)

    డుప్లెసిస్ బౌండర్

    10 ఓవర్లు పూర్తయ్యేసరికి చెన్నై ఒక వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. మురుగన్‌ అశ్విన్‌ వేసిన ఈ ఓవర్‌లో తొలి బంతికి డుప్లెసిస్‌ బౌండరీ కొట్టాడు. మరోవైపు మోయిన్‌ అలీ(29) పరుగులతో కొనసాగుతున్నాడు. వీరిద్దరూ 40 పరుగుల భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు

  • 16 Apr 2021 10:14 PM (IST)

    ఈజీగా కొట్టేస్తున్న చెన్నై

    పంజాబ్ కింగ్స్ విధించిన స్మాల్ టార్గెట్‌ను ఈజీగా కొట్టే పనిలో ఉంది చెన్నై సూప‌ర్ కింగ్స్.  ఓపెన‌ర్ రుతురాజ్ గైక్వాడ్ (5) త్వ‌ర‌గానే అవుటైనా.. మ‌రో ఓపెన‌ర్ డుప్లెస్సి, మొయిన్ అలీ పంజాబ్ బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొంటున్నారు. దీంతో 10 ఓవ‌ర్లు ముగిసే స‌మ‌యానికి చెన్నై వికెట్ న‌ష్టానికి 64 ప‌రుగులు చేసింది. అలీ 29, డుప్లెస్సి 24 ప‌రుగుల‌తో ఆడుతున్నారు.

  • 16 Apr 2021 10:04 PM (IST)

    మొయిన్ అలీ రెండు ఫోర్లు...

    బౌండరీలతో విరుచుకుపడుతున్నాడు మొయిన్ అలీ. మెరిడీత్‌ వేసిన  ఓవర్‌లో 8 పరుగులు ఇచ్చాడు.  మొయిన్‌ అలీ(8) రెండు ఫోర్లు బాదాడు. డుప్లెసిస్‌ 14 పరుగులతో ఉన్నాడు.

  • 16 Apr 2021 09:42 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన చెన్నై

    5 ఓవర్లకు 24 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అర్ష్‌దీప్‌ సింగ్‌ వేసిన ఈ ఓవర్లో చివరి బంతికి రుతురాజ్‌ గైక్వాడ్‌(5) దీపక్‌ హుడాకు చిక్కాడు. ఈ ఓవర్‌లో రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. డుప్లెసిస్‌(14), మొయిన్‌ అలీ క్రీజులో ఉన్నారు.

  • 16 Apr 2021 09:35 PM (IST)

    ఆట మొదలు పెట్టిన ధోనీ సేన..

    మొదటి ఓవర్‌కు చెన్నై సూపర్‌ కింగ్స్‌ కేవలం 2 పరుగులు మాత్రమే చేసింది. మహ్మద్‌ షమీ పంజాబ్‌ బౌలింగ్‌ను ప్రారంభించాడు. షమీ కట్టుదిట్టమైన బంతులేయడంతో చెన్నై బ్యాట్స్‌మెన్‌ రెండు పరుగులు మాత్రమే రాబట్టారు. రుతురాజ్‌ గైక్వాడ్(1), డుప్లెసిస్‌(1) క్రీజులో ఉన్నారు.

  • 16 Apr 2021 09:10 PM (IST)

    చెన్నై టార్గెట్ 107 పరుగులు

    20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయిన పంజాబ్ కింగ్స్‌ 106 పరుగులు మాత్రమే చేసింది.  సామ్‌కరన్‌ వేసిన చివరి ఓవర్లో మొదటి బంతికి షారూక్‌ఖాన్‌(47) జడేజాకు దొరికిపోయాడు . ఆ తర్వాత షమీ(9) ఐదు పరుగులు చేశాడు.

  • 16 Apr 2021 09:01 PM (IST)

    షారుక్ ఔట్

    షారుక్ తన అర్ధ సెంచరీని పూర్తి చేయలేకపోయాడు. చివరి ఓవర్లో అతను జట్టుకు బౌండరీని కొటే ప్రయత్నంలో హై షాట్ ఆడాడు. కాని జడేజా బంతిని డీప్ మిడ్ వికెట్ వద్ద క్యాచ్ చేశాడు.

  • 16 Apr 2021 08:51 PM (IST)

    షారూక్ ఫోర్

    16 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయిన పంజాబ్‌ 81 పరుగుల వద్ద ఉంది. శార్దూల్‌ ఠాకూర్‌ వేసిన ఈ ఓవర్‌లో షారూక్‌ ఖాన్‌(34) ఓ ఫోర్‌ బాది మరో మూడు పరుగులు సాధించాడు. మురుగన్ అశ్విన్‌ 5 పరుగులతో ఉన్నాడు

  • 16 Apr 2021 08:47 PM (IST)

    షారూఖ్ సిక్సర్

    పంజాబ్ కింగ్స్ ఈసారి వేలంలో షారూఖ్ ఖాన్‌ను కొనుగోలు చేసిందనే ఆశతో ఉంది. అయితే అతను ఇప్పటివరకు ఇందులో కొంత సక్కెస్ అయ్యాడు. వరుస వికెట్లు పడుతున్న సమయంలో నిలకడగా ఆడుతూ బౌండరీలు కూడా తీస్తున్నాడు. ఈసారి మొయిన్ అలీ వేసిన ఓవర్ కు మొదటి బంతిని సిక్సర్ కొట్టాడు. దీనితో పాటు, అతను కొన్ని సింగిల్స్ కూడా సేకరించాడు.

  • 16 Apr 2021 08:47 PM (IST)

    డుప్లెసిస్ ఔట్

  • 16 Apr 2021 08:33 PM (IST)

    14 ఓవర్‌కు...

    14 ఓవర్లకు పంజాబ్‌ ఆరు వికెట్లను కోల్పోయిన పంజాబ్ కింగ్స్ 64 పరుగులు చేసింది. జడేజా కట్టుదిట్టమైన బంతులు వేయడంతో పంజాబ్‌ బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ ఓవర్‌లో కేవలం మూడు పరుగులే వచ్చాయి. మురుగన్‌ అశ్విన్(3), షారూక్‌ ఖాన్‌(19) క్రీజులో ఉన్నారు.

  • 16 Apr 2021 08:25 PM (IST)

    ఆరో వికెట్ పడింది..

    మొయిన్‌ అలీ వేస్తున్న 13వ ఓవర్‌లో  తొలి బంతికి రిచర్డ్‌సన్‌ (15) క్లీన్ బౌల్డ్‌ అయ్యాడు. దీంతో పంజాబ్‌ తన ఆరో వికెట్‌ కోల్పోయింది.

  • 16 Apr 2021 08:19 PM (IST)

    శార్ధూల్ ఓవర్‌‌లో రెండు బౌండరీలు

    శార్ధూల్ వేసిన తొమ్మిదో ఓవర్‌కు తొలి బంతిని జే ఫోర్ కొట్టాడు. ఆఖరి బంతికి షారుక్‌ (12) కూడా ఓ బౌండరీ కొట్టాడు. మొత్తం 11 పరుగులు వచ్చాయి. 9 ఓవర్లకు పంజాబ్‌ 45/5 పరుగులతో కొనసాగుతోంది

  • 16 Apr 2021 08:09 PM (IST)

    దీపక్‌ చాహర్‌కు మరో వికెట్

    దీపక్‌ చాహర్‌ తన ఆఖరి ఓవర్‌లో మరో వికెట్‌ తీశాడు. ఈ ఓవర్‌లో హూడా (10) ఔటయ్యాక రిచర్డ్‌సన్ (0)‌ క్రీజులోకి వచ్చాడు. ఈ ఓవర్‌లో చాహర్‌ పరుగులేమీ ఇవ్వలేదు.

  • 16 Apr 2021 08:03 PM (IST)

    క్రిస్ గేల్ ఔట్

     క్రిస్ గేల్ భారీ షాట్ కోసం ప్రయత్నించి ఔటయ్యాడు. గేల్ కొట్టిన షాట్ ను రవీంద్ర జడేజా  పట్టుకున్నాడు. క్రిస్ గేల్ రూపంలో పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. అంతకుముందు జడేజా కెఎల్ రాహుల్ ను రనౌట్ చేశాడు.

  • 16 Apr 2021 07:58 PM (IST)

    పూరన్‌ డకౌట్

    దీపక్‌ చాహర్‌ వేస్తున్న అయిదో ఓవర్‌లో నాలుగో బంతికి పూరన్‌ (0) ఠాకూర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔట్‌ అయ్యాడు.

  • 16 Apr 2021 07:54 PM (IST)

    కేఎల్ రనౌట్

    రాకెట్ త్రోయర్ రవీంద్ర జడేజా చేతిలో కెఎల్ రాహుల్ రనౌట్ అయ్యాడు. స్ట్రైక్ ఎండ్‌లో క్రిస్ గేల్ హిట్ అయ్యాడు. పరుగు కోసం నాన్-స్ట్రైక్ ఎండ్‌లో కెఎల్‌ను పిలిచాడు. అయితే, డేంజర్ చివరిలో కెఎల్ రనౌట్ అయింది.

  • 16 Apr 2021 07:45 PM (IST)

    గేల్ దొరికిన లైఫ్

    దీపక్ చాహర్ చెన్నై నుంచి తొలి ఓవర్ బౌలింగ్ చేశాడు. దీపక్ చాహర్ తొలి ఓవర్లో 1 వికెట్ తీసుకున్నాడు. కానీ అదే ఓవర్లో పంజాబ్ ఎటాకింగ్ బ్యాట్స్ మాన్ క్రిస్ గేల్ కి లైఫ్ లైన్ వచ్చింది. మయాంక్ అగర్వాల్ అవుట్ అయిన తరువాత, గేల్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. గేల్ ఓవర్ చివరి బంతిపై పాయింట్ నుండి ఆడటానికి ప్రయత్నించాడు. గేలు షాట్ రితురాజ్ గైక్వాడ్ దిశలో వెళ్ళింది. అయితే, రితురాజ్ గేల్ యొక్క ఈజీ క్యాచ్ ను వదులుకున్నాడు. అది గేల్ ప్రాణాలను కాపాడింది.

  • 16 Apr 2021 07:39 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్

    కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ ఓపెనింగ్‌కి వచ్చారు. దీపక్‌ చాహర్‌ వేసిన ఈ ఓవర్‌లో నాలుగో బంతికే మయాంక్‌ (1) బౌల్డ్‌ అయ్యాడు. రాహుల్‌ (1) క్రీజులో ఉన్నాడు. గేల్‌ బ్యాటింగ్‌కి దిగాడు.

  • 16 Apr 2021 07:30 PM (IST)

    పంజాబ్ కింగ్స్ జట్టు

    కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్,కెప్టెన్), మయాంక్ అగర్వాల్, దీపక్ హుడా, క్రిస్ గేల్, నికోలస్ పురాన్, షారుఖ్ ఖాన్, జాయ్ రిచర్డ్సన్, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమీ, రిలే మెరెడిత్, అర్ష్‌దీప్ సింగ్.

  • 16 Apr 2021 07:28 PM (IST)

    చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు..

    ఎంఎస్ ధోని (వికెట్ కీపర్, కెప్టెన్), రితురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, మొయిన్ అలీ, సురేష్ రైనా, అంబతి రాయుడు, రవీంద్ర జడేజా, సామ్ కరణ్, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్.

  • 16 Apr 2021 07:13 PM (IST)

    టాస్ గెలిచిన ధోనీ...

    టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ సారథి బౌలింగ్ఎంచుకున్నాడు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పంజాబ్‌ను  బ్యాటింగ్ కు దింపాడు . ఈ మ్యాచ్ కొద్ది నిమిషాల్లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రారంభమవుతుంది.

  • 16 Apr 2021 07:00 PM (IST)

    రెండు జట్ల మధ్య గెలుపు లెక్క ఇదే...

    ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు మొత్తం 23 సార్లు కలుసుకున్నాయి. ఇందులో చెన్నై పంజాబ్‌పై ఆధిపత్యం చెలాయించింది. చెన్నై 14 మ్యాచ్‌ల్లో పంజాబ్‌ను ఓడించింది. పంజాబ్ 9 మ్యాచ్‌ల్లో కూడా చెన్నైని ఓడించింది.

  • 16 Apr 2021 06:40 PM (IST)

    ముంబైలో సూపర్ ఫైట్

    ఐపీఎల్ 14 వ సీజన్‌లో పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ ఈ రోజు జరుగుతుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.

Published On - Apr 16,2021 10:32 PM

Follow us