
క్వాలిఫయర్ 1లో ఘోర పరాజయం అనంతరం పంజాబ్ కింగ్స్ (PBKS) మరోసారి ఫైనల్ చేరే అవకాశం కోసం పోరాడనుంది. 11 ఏళ్లుగా ఫైనల్‌కి దూరంగా ఉన్న పంజాబ్, ఇప్పుడు ముంబై ఇండియన్స్ (MI)ను క్వాలిఫయర్ 2లో అహ్మదాబాద్ వేదికగా ఎదుర్కొనబోతోంది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 101 పరుగులకు ఆలౌట్ అయిన పంజాబ్ మళ్లీ బలంగా తిరిగిరావాలంటే, మూడుగురు ఆటగాళ్లు కీలకంగా మారనున్నారు. వీరే మ్యాచ్ ఫలితాన్ని మలిచే శక్తిని కలిగి ఉన్న వారు. వీరు గనక ఫామ్ కంటిన్యూ చేస్తూ చెలరేగితే ముంబై ఇండియన్స్ ని తిప్పులు పెట్టడం ఖాయం.
ఇటీవల ముంబైతో జరిగిన మ్యాచ్‌లో జోష్ ఇంగ్లిస్ 42 బంతుల్లో 73 పరుగులు చేసి మ్యాచ్‌ను PBKSకు అందించాడు. 9 ఫోర్లు, 3 సిక్సర్లతో చేసిన ఇన్నింగ్స్‌కి బుమ్రా లాంటి దిగ్గజ బౌలర్‌గానీ సమాధానం చెప్పలేకపోయాడు. ఇంగ్లిస్ మొత్తం 9 ఇన్నింగ్స్‌ల్లో 201 పరుగులు చేశాడు, 158 స్ట్రైక్ రేట్‌తో. స్పిన్‌కైనా, పేస్‌కైనా సమర్థంగా ఎదురుకాగల బ్యాట్స్‌మన్. నెంబర్ 3లో బ్యాటింగ్ చేయడం వల్ల, మిడిల్ ఓవర్లలో ముంబైకి అతడే పెద్ద సమస్య అవ్వగలడు.
ఈ సీజన్‌లో అర్షదీప్ అద్భుతంగా రాణిస్తున్నాడు. 14 మ్యాచ్‌లలో 18 వికెట్లు తీసి, 8.72 ఎకానమీ, 16.7 స్ట్రైక్ రేట్‌తో అద్భుత గణాంకాలు నమోదు చేశాడు. ముంబైపై గత మ్యాచ్‌లో 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసాడు, చివరి ఓవర్‌లో కేవలం 3 పరుగులే ఇచ్చాడు. రోహిత్ శర్మ, బెయిర్‌స్టో వంటి టాప్ బ్యాట్స్‌మెన్ స్వింగ్‌కు వీలుపడే స్థితిలో ఉండగా, అర్షదీప్ ప్రారంభంలోనే వారిని ఔట్ చేయగల సామర్థ్యం కలవాడు. అలాగే సూర్యకుమార్‌ను రెండు సార్లు ఔట్ చేసిన ట్రాక్ రికార్డూ అతనిది.
ఎడమచేతి ఆర్తోడాక్స్ స్పిన్‌కి ముంబై ఇండియన్స్ బలహీనంగా ఉందనేది రహస్యమే కాదు. ఈ టూర్నమెంట్‌లో ఆ బౌలింగ్ టైప్‌కు ఎదురుగా వారి సగటు 21.50 మాత్రమే, రన్‌రేట్ 8.60. రోహిత్, బెయిర్‌స్టో, సూర్యకుమార్ – ముగ్గురూ ఈ బౌలింగ్‌కి వల్నరబుల్. హార్దిక్, తిలక్ వర్మ కూడా మంచి రికార్డులు లేవు. హర్ప్రీత్ బ్రార్ ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీసి, 13.7 స్ట్రైక్ రేట్ సాధించాడు. పవర్‌ప్లేలో బ్రార్ ఓ ఓవర్ వేయాల్సి వచ్చినా, మ్యాచ్‌ను తిప్పే అవకాశం అతనికే ఎక్కువగా ఉంది.
ఈ ముగ్గురు ఆటగాళ్లు తమ టాప్‌గేర్‌లో ఉంటే, పంజాబ్ కింగ్స్ ఫైనల్ బెర్త్‌ను గెలుచుకునే అవకాశాన్ని గణనీయంగా పెంచుతుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..