టీ20 మ్యాచ్ అంటేనే అదొక మజా. బ్యాట్స్‌మెన్లు జోరు చూపించే ఈ టోర్నీలో బౌలర్లు తేలిపోతారు. ఫోర్లు, సిక్సర్ల వర్షం అభిమానులకు కావాల్సినంత ఉత్సాహాన్ని ఇస్తుంది. సరిగ్గా ఇదే రీతిలో తాజాగా జరిగిన మ్యాచ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.. ఆ బ్యాట్స్‌మెన్ ఓపెనర్‌గా వచ్చాడు.. ఇన్నింగ్స్ పూర్తయ్యేవరకు ఉన్నాడు.. మొదటి బంతి నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికిఆరేశాడు. సెంచరీతో అదరగొట్టాడు. ఇంతకీ అతడెవరో తెలుసా.. ఐర్లాండ్ బ్యాట్స్‌మెన్ పాల్ స్టిర్లింగ్. తాజాగా అతడు సృష్టించిన విధ్వంసానికి జింబాబ్వే చిత్తుగా ఓడిపోయింది.
జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో టాస్ ఓడిపోయి ఐర్లాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ కెవిన్ ఓ బ్రెయిన్(9) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరినా.. వన్ డౌన్‌లో వచ్చిన కెప్టెన్ బల్బెరియన్(31)తో కలిసి స్టిర్లింగ్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ తరుణంలోనే ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతేకాకుండా స్టిర్లింగ్ తన అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 47 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో స్టిర్లింగ్ తన ఫిఫ్టీని పూర్తి చేయగా.. ఆ తర్వాత తన బ్యాటింగ్ వేగాన్ని పెంచాడు. ఆ తర్వాత ఎదుర్కున్న 28 బంతుల్లో 65 పరుగులు చేశాడు. తద్వారా తన సెంచరీకి చేరువయ్యాడు.
మొత్తంగా పాల్ స్టిర్లింగ్ 75 బంతులు ఎదుర్కుని 115 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు ఉన్నాయి. దీనితో నిర్ణీత 20 ఓవర్లకు ఐర్లాండ్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఇక భారీ లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన జింబాబ్వే తేలిపోయింది. ఐర్లాండ్ బౌలర్ల దెబ్బకు వరుసగా వికెట్లు కోల్పోయింది. 84 పరుగులకే సగం టీం పెవిలియన్ చేరింది. ఆ జట్టుకు కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్(33) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్ మూడు వికెట్లు తీయగా.. జోష్ లిటిల్, షేన్ గెట్కెట్, బెన్ వైట్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
Read Also: ఒక్క వికెట్ కోసం తండ్లాట..! బ్యాట్స్‌మెన్‌ను చుట్టుముట్టిన ఫీల్డర్లు.. చివరికి గెలిచిందెవరు..?
హీరో కృష్ణుడు అరెస్ట్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు
డయాబెటిస్‌కు చెక్ పెట్టే అద్భుత ఫలం.. ఈ పండులోని స్పెషాలిటీ ఏంటో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
మద్యం మత్తులో యువతి హల్‌చల్.. కిక్కు ఎక్కువై రోడ్డుపై ఏం చేసిందో మీరే చూడండి..