
ఆట కంటే ఇతరేతర విషయాల్లోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు పాక్ క్రికెటర్లు. ముఖ్యంగా వారి ప్రవర్తన అక్కడి అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. తాజాగా అలాంటిదే మరొక సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మార్చి 18 (సోమవారం) కరాచీ వేదికగా పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL 2024) ఫైనల్ మ్యాచ్ జరిగింది. టైటిల్ కోసం ముల్తాన్ సుల్తాన్స్, ఇస్లామాబాద్ యునైటెడ్ జట్లు పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ బౌలర్ ఇమాద్ వసీమ్ 5 వికెట్లు పడగొట్టి ముల్తాన్ సుల్తాన్ జట్టు బ్యాటర్లకు చెమటలు పట్టించాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ. ఆ తర్వాతే వసీమ్ ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే అతను మ్యాచ్ మధ్యలో స్మోకింగ్ చేశాడు. అది కూడా తోటి క్రికెటర్లు ఉండే డ్రెస్సింగ్ రూమ్ లో. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. క్రికెటర్లు స్మోకింగ్ చేయడం కొత్తేమీ కాదు కానీ పీఎస్‌ఎల్ ఫైనల్ మ్యాచ్ ఆడుతుండగా డ్రెస్సింగ్ రూమ్‌లో స్మోకింగ్ చేయడం అందరినీ షాక్ కు గురిచేసింది. డ్రెస్సింగ్ రూమ్‌లో ఇమాద్ వసీమ్ నోటి నుంచి పొగ ఊదుతున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
అయితే ఇమాద్ సిగరెట్లతో డ్రెస్సింగ్ రూమ్‌కి ఎలా చేరుకున్నాడనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. డ్రెస్సింగ్ రూమ్‌లో ధూమపానం అనుమతిస్తున్నారా? అని మరొక అభిమాని అడిగాడు. ఆట కంటే ఏదీ ఎక్కువ కాదని ఈ విషయంలో PSL, PCB కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తన ప్రవర్తనతో నెగెటివిటీ మూట గట్టుకున్న ఇమాద్ మైదానంలో మాత్రం రెచ్చిపోయాడు. తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఫైనల్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. మొదట 5 వికెట్లు తీసిన ఇమాద్.. ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ రాణించి 17 బంతుల్లో 19 పరుగులు చేసి తమ జట్టును ఛాంపియన్ గా నిలిపాడు. మరి ఇమాద్ స్మోకింగ్ వ్యవహారంపై పీసీబీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
Imad wasim took a fifer and now Enjoying a cigarette!
These players think they are above the laws of the game!
PSL and PCB sleeping
Shame for Islamabad United!#PSL2024— Jalaad 🔥 حمزہ (@SaithHamzamir) March 18, 2024
Imad Wasim taking some energy 🚬
Is this allowed @thePSLt20 👀BTW, Smoking is injurious to health #PSLFinal #ImadWasim #PSL2024pic.twitter.com/IVKoYK9z2C
— Richard Kettleborough (@RichKettle07) March 18, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..