
న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే పాకిస్థాన్ జట్టుకు చుక్కలు చూపించాడు. ఆరు రోజుల క్రితం కరాచీలో దంచికొట్టిన అదే మైదానంలో సోమవారం పాక్ బౌలర్లను మరోసారి చిత్తుగా కొట్టేశాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో కాన్వే సెంచరీ సాధించాడు. 191 బంతుల్లో 122 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కాన్వే తన ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. తొలి టెస్టు మ్యాచ్‌లోనూ పాక్ బౌలర్లు కాన్వాయ్ చిత్తుగా బాదేశాడు. అయితే, కొద్దిలో తన సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఈసారి మాత్రం ఎటువంటి తడబాటు లేకుండా, పాక్ బౌలర్లపై సత్తా చాటి సెంచరీతో కదం తొక్కాడు.
వార్తలు రాసే సమయానికి డేవాన్ కాన్వే సెంచరీతోపాటు టామ్ లాథమ్ 71 పరుగులతో న్యూజిలాండ్ టీం 3 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. ప్రస్తుతం నికోలస్ 9, మిచెల్ 2 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. కేన్ విలియమ్సన్ 36 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
అరంగేట్రం మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ సాధించిన కాన్వాయ్.. ఇప్పటివరకు 12 టెస్టుల్లో 1131 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని సగటు 59.53గా నిలిచింది. కాన్వే తన 2 సంవత్సరాల టెస్ట్ కెరీర్‌లో 4 సెంచరీలు, 5 అర్ధ సెంచరీలు సాధించాడు.
న్యూజిలాండ్ షేర్ చేసిన ట్వీట్..
Test century #4 for Devon Conway! A mix of power and finesse. 156 balls, 211 minutes (13×4, 1×6). He & Williamson (25*) have pushed the score past 200. Follow play LIVE in NZ with @skysportnz & @SENZ_Radio. Scoring | https://t.co/vssoB8yv7C #PAKvNZ ? = PCB pic.twitter.com/TjceFEC5no
— BLACKCAPS (@BLACKCAPS) January 2, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..