Pakistan vs Australia Match Highlights, T20 World Cup 2021: పాకిస్థాన్ పై విజయం సాధించిన ఆస్ట్రేలియా.. పోరాడి గెలిచినా కంగారూలు..
Pakistan vs Australia Highlights in Telugu: టీ20 వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు ఓటమి అంటూ ఎరగని పాకిస్థాన్, కేవలం ఒక ఓటమిని మాత్రమే చవిచూసిన ఆస్ట్రేలియా ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే రెండో సెమీ-ఫైనల్‌లో..
Pakistan vs Australia Highlights in Telugu: టీ20 వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు ఓటమి అంటూ ఎరగని పాకిస్థాన్, కేవలం ఒక ఓటమిని మాత్రమే చవిచూసిన ఆస్ట్రేలియా ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే రెండో సెమీ-ఫైనల్‌లో పాకిస్థాన్ వర్సెస్ ఆస్ట్రేలియాలు ముఖాముఖిగా తలపడనున్నాయి. రెండోసారి టైటిల్‌ను కైవసం చేసుకునేందుకు పాకిస్థాన్ ఫైనల్‌లో చోటు దక్కించుకోగా, ఆస్ట్రేలియా తొలి టీ20 ప్రపంచకప్‌పై కన్నేసింది. ఓవైపు పాకిస్తాన్, మరో వైపు పూర్తిగా ఫాంలో ఉన్న ఆస్ట్రేలియా ఇలా రెండు జట్లు పటిష్టంగా ఉండడంతో హోరాహోరీ తప్పదని క్రికెట్ లవర్స్ భావిస్తున్నారు. దీంతో ఈ మ్యాచ్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
తొలి సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై అద్భుత విజయం నమోదు చేసుకుని న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరుకుంది. ఇక న్యూజిలాండ్‌తో ఫైనల్‌లో తలపడనుంది ఎవరో మరికొద్ది సేపట్లో తేలిపోనుంది. ఇదిలా ఉంటే 2010లో మాత్రమే ఫైనల్‌కు చేరిన ఆస్ట్రేలియా జట్టు ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు చేరే అవకాశం వచ్చింది. మరి ఆస్ట్రేలియా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటుందా.? లేదో చూడాలి.
LIVE NEWS & UPDATES
-
ఆస్ట్రేలియా విజయం
చివరి ఓవర్ మిగిలి ఉండగానే గెలిచిన ఆస్ట్రేలియా.. పాక్ పై ఆస్ట్రేలియా విజయం
-
పోరాడుతున్న ఆస్ట్రేలియా..
పది బాల్స్ కు 21 పరుగులు కావాల్సి ఉంది.. పోరాడుతున్న ఆస్ట్రేలియా..
-
-
విజయం కోసం కష్టపడుతున్న ఆస్ట్రేలియా ..
పాక్ బౌలర్ల ను ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా .. 14 బంతులకు 27 పరుగులు కావాల్సి ఉంది.
-
మ్యాక్స్ వెల్ అవుట్
పీకల్లోతు కష్టాల్లో కంగారూలు.. ఐదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా .. మాక్స్ వెల్ 7 పరుగులకు అవుట్ అయ్యాడు
-
కంగారు పెట్టిస్తున్న పాక్ బౌలర్లు
పాక్ బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ తడబడుతున్నారు.. ఇంకా 52 బాల్స్ కు 85 పరుగులు కొట్టాల్సి ఉంది
.
-
-
నాలుగో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
కష్టాల్లో ఆస్ట్రేలియా .. నాలుగో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్ 49 పరుగులకు అవుట్ అయ్యాడు.. ఆస్ట్రేలియా స్కోర్ 89 పరుగులకు నాలుగు వికెట్లు
-
మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా..
మూడో వికెట్ కోల్పోయిన కంగారూలు .. స్మిత్ 6 పరుగులకు అవుట్ అయ్యాడు.. స్కోర్ 77/3
-
ఆచితూచి ఆడుతున్న కంగారూలు
74 బంతుల్లో 107 పరుగులు చేయాల్సి ఉంది. పాక్ కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తున్నా.. ఆస్ట్రేలియా మాత్రం ఆచితూచి ఆడుతుంది.
-
రెండో వికెట్ కొల్పోయిన ఆస్ట్రేలియా
రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. మార్ష్ 28 అవుట్ అయ్యాడు .. స్కోర్ 52/2
-
పాక్ బౌలర్ల పై విరుచుకుపడుతున్న కంగారూలు.
పాక్ బౌలర్లకు చుక్కలు చూస్పిస్తున్న కంగారూలు.. 5 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్ – 51/5
-
ఆస్ట్రేలియా మార్క్ బ్యాటింగ్ మొదలైంది..
పాకిస్తాన్ ఇచ్చిన భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో బ్యాటింగ్ మొదలు పెట్టిన ఆసీస్ ఇప్పుడిప్పుడే స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తోంది. డేవివ్ వార్నర్ వరుసగా బౌండరీలతో జట్టు స్కోరును పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే కేవలం 12 బంతుల్లో 19 పరగులు సాధించాడు.
-
ఆదిలోనే ఆస్ట్రేలియాకు భారీ దెబ్బ..
పాకిస్తాన్ ఇచ్చిన భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. అరాన్ ఫించ్ షాహీమ్ అఫ్రిది బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.
-
ఆస్ట్రేలియా ముందు భారీ విజయ లక్ష్యం..
రెండో సెమీ ఫైనల్‌లో పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ రెచ్చిపోయారు. డూ ఆర్ డై మ్యాచ్‌లో చెలరేగి ఆడారు. ఈ క్రమంలోనే నిర్ణీత 20 ఓవర్‌లలో 4 వికెట్లు కోల్పోయి 176 పరుగులు సాధించారు. ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకోవాలంటే 177 పరుగుల లక్ష్యాన్ని చేధించాల్సి ఉంది.
-
పాక్‌కు షాక్..
జట్టు స్కోరును పెంచుతూ దూకుడుగా ఆడిన మహమ్మద్ రిజ్వాన్ పెవిలియన్ బాట పట్టాడు. కేవలం 52 బంతుల్లో 67 పరుగులు సాధించిన రిజ్వాన్ స్కార్క్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. మరి ఈ వికెట్ తర్వాత పాక్ స్కోరు నెమ్మదిస్తుందో చూడాలి.
-
భారీ స్కోర్ దిశగా పాక్..
పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ రెచ్చిపోయి ఆడుతున్నారు. కీలక మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై దూకుడుగా ఆడుతున్నారు. ఈ క్రమంలోనే 17 ఓవర్లలో కేవలం 1 వికెట్ కోల్పోయి 143 పరుగులు సాధించారు. ప్రస్తుతం క్రీజులో రిజ్వాన్ (67), ఫఖర్ జమాన్ (26) పరుగులతో కొనసాగుతున్నారు.
-
హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రిజ్వాన్..
కీలక మ్యాచ్‌లో పాకిస్తాన్ ప్లేయర్స్ రాణిస్తున్నారు. బాబర్ అవుట్ అయినా జట్టు స్కోరును పెంచే బాధ్యతను రిజ్వాన్ కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే 41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం పాక్ స్కోర్ 14.1 ఓవర్లకు గాను 107/1 వద్ద కొనసాగుతోంది.
-
బిగ్ వికెట్..
పాకిస్తాన్ తొలి వికెట్‌ను కోల్పోయింది. చెలరేగి ఆడుతోన్న బాబార్‌కు జంపా చెక్ పెట్టాడు. 34 బంతుల్లో 39 పరుగులతో దూసుకుపోతున్న బాబర్ అజమ్ జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ప్రస్తుతం పాక్ స్కోరు 1 వికెట్ నష్టానికి 71 పరుగుల వద్ద కొనసాగుతోంది.
-
2500 పరుగులు పూర్తి చేసుకున్న బాబర్..
గత కొన్నేళ్లుగా అద్భుతమైన ఫామ్‌తో రాణిస్తున్న బాబర్ అజమ్ అద్భుత ఆటతీరును కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మ్యాచ్‌లో బాబర్ అజమ్ టీ20 వరల్డ్ కప్‌లో 2500 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం 25 బంతుల్లో 34 పరుగులు సాధించాడు.
-
5 ఓవర్లు ముగిసే సమయానికి పాక్ స్కోర్ ఎంతంటే..
టీ 20 వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్‌లలో అద్భుతంగా రాణించిన ఓపెనర్లు ఆస్ట్రేలియాతో జరుగుతోన్న కీలక మ్యాచ్‌లో కూడా మంచి ఆటతీరును కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే 5 ఓవర్లు ముగిసే సమయానికి ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 38 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో రిజ్వాన్ ( 15 ), బాబర్ అజమ్ ( 21 ) పరుగులతో కొనసాగుతున్నారు.
-
పాకిస్తాన్ శుభారంభం..
పాకిస్తాన్ ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. టాస్ ఓడి బ్యాటింగ్ మొదలు పెట్టిన పాకిస్తాన్ రెండు ఓవర్లు ముగిసే సమయానికి ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 11 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రిజ్వాన్ (0), బాబర్ అజమ్ (10) కొనసాగుతున్నారు.
-
జట్లు
ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జాంపా, జోష్ హాజిల్‌వుడ్
పాకిస్థాన్: బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఇమాద్ వాసిమ్, షాదాబ్ ఖాన్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది
-
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా..
రెండో సెమీఫైనల్ బర్త్‌కు జరుగుతోన్న పోరులో ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ బౌలింగ్‌కు అనుకూలిస్తున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే దుబాయ్ పిచ్‌పై ఇప్పటి వరకు టాస్ గెలిచిన వారంతా ఫీల్డింగ్‌ను ఎంచుకోవడం విశేషం.
-
ఈ రెండు జట్లు ఎన్నిసార్లు తలపడ్డాయంటే..
పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య 2007 నుంచి 2019 వరకు మొత్తం 23 మ్యాచ్‌లు జరిగాయి. అయితే వీటిలో పాకిస్తాన్‌దే పైచేయిగా కనిపిస్తోంది. మొత్తం 23 మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ 13 మ్యాచ్‌లు గెలవగా, ఆస్ట్రేలియా కేవలం 9 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయాన్ని సాధించింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు.
Published On - Nov 11,2021 7:00 PM