PAK vs NZ Match: టీ20 వరల్డ్ కప్ 2021లో భాగంగా టీమిండియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ సంచలన విజయం నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఏకంగా పది వికెట్ల తేడాతో భారత్‌పై చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. అయితే మొదటి మ్యాచ్‌లో విజయాన్ని సొంతం చేసుకొని ఉత్సాహంతో ఉన్న పాకిస్తాన్‌కు రెండో మ్యాచ్‌లో వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు కనిపిస్తోంది.
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతోన్న రెండో మ్యాచ్‌లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్‌లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులు సాధించింది. అయితే లక్ష్య చేధనలో భరిలోకి దిగిన పాకిస్తాన్ తడబుతోంది. టీమిండియాపై చెలరేగిన రిజ్వాన్ 33 పరుగుల వద్ద, అజమ్ 9 పరుగుల వద్దే వెనుతిరిగారు. దీంతో పాకిస్తాన్ స్కోరు బోర్డు నెమ్మదించింది.
ఇక అనంతరం క్రీజులోకి వచ్చిన జమన్, హఫీజ్ కూడా వెంట వెంటనే పెవిలయన్ బాటపట్టారు. ఇక పాకిస్తాన్ ప్రస్తుతం 14.5 ఓవర్లకుగాను 5 వికెట్లు కోల్పోయి 87 పరుగుల వద్ద కొనసాగుతోంది. మరి న్యూజిలాండ్ ఇచ్చిన లక్ష్య చేధనను పాకిస్తాన్ అందుకుంటుందో లేదో వేచి చూడాలి.
Also Read: Hair Care: ప్రెగ్నెన్సీ తర్వాత జుట్టు రాలిపోతుందా..? అయితే ఈ హోం రెమెడీస్ మీ కోసమే..