మరోసారి కుటిల బుద్ధిని చాటుకున్న పాక్‌ క్రికెట్‌ ఫ్యాన్స్.. భారత్, ఆఫ్గాన్‌ల మ్యాచ్‌ ఫిక్స్‌ అయ్యిందంటూ..

|

Sep 09, 2022 | 9:15 PM

Asia cup 2022: ఆసియాకప్‌లో భాగంగా గురువారం ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన అఖరి సూపర్‌-4 మ్యాచ్‌లో భారత జట్టు అదరగొట్టింది. దుబాయ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆఫ్గాన్‌పై 101 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది.

మరోసారి కుటిల బుద్ధిని చాటుకున్న పాక్‌ క్రికెట్‌ ఫ్యాన్స్.. భారత్, ఆఫ్గాన్‌ల మ్యాచ్‌ ఫిక్స్‌ అయ్యిందంటూ..
Ind Vs Afghanisthan
Follow us on

Asia cup 2022: ఆసియాకప్‌లో భాగంగా గురువారం ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన అఖరి సూపర్‌-4 మ్యాచ్‌లో భారత జట్టు అదరగొట్టింది. దుబాయ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆఫ్గాన్‌పై 101 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (Virat Kohli) సూపర్ సెంచరీతో మెరవడం ఈ మ్యాచ్‌లో మెయిన్‌ హైలెట్‌. కోహ్లీ చలవతో​ మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 212 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. అనంతరం భువనేశ్వర్‌ కుమార్‌ ఐదు వికెట్లతో విజృంభించిడంతో లక్ష్య ఛేదనలో ఆఫ్టాన్ 111 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.

కాగా అంతకుముందు సూపర్‌-4 మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు ఆఫ్గానిస్తాన్‌ చుక్కలు చూపించిన సంగతి తెలిసింది. అఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో అనూహ్యంగా ఒక్క వికెట్‌ తేడాతో ఆఫ్గాన్‌ ఓటమిపాలైంది. ఈనేపథ్యంలో పాక్‌పై అదరగొట్టిన ఆఫ్గాన్‌ భారత్‌పై మాత్రం అన్ని రంగాల్లో విఫలమైంది. ఈక్రమంలో పాక్‌ అభిమానులు మరోసారి తమ కుటిల బుద్ధిని చాటుకున్నారు. భారత్‌, ఆఫ్గాన్‌ మ్యాచ్‌ ఫిక్స్‌ అయిందంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కేవలం ఐపీఎల్‌ కోసమే ఆఫ్గాన్‌ ఆటగాళ్లు అమ్ముడు పోయారంటూ ట్వీట్లు పెడుతున్నారు. దీంతో ప్రస్తుతం ట్విటర్‌లో # Fixed అనే కీవర్డ్‌ బాగా ట్రెండింగ్ అవుతోంది. కాగా మరోవైపు ఈ పోస్టులను టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ తమదైన శైలిలో తిప్పిగొడుతున్నారు. మరోసారి కుటిల బుద్ధిని చూపించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..