Ind Vs Pak: మ్యాచ్‎కు ముందు అంతా మనకే అనుకూలం.. కానీ ఆరోజు మనది కాదు..

|

Oct 25, 2021 | 6:31 AM

టీ 20 వరల్డ్ కప్‎లో హాట్ ఫెవరేట్‎గా బరిలోకి దిగింది భారత్. పాకిస్తాన్‎తో మ్యాచ్‎లో ఇండియాదే పైచేయి అని భావించారు. కొందరైతే భారత్ గెలుస్తుందని టాపాసులు కూడా పేల్చారు. అంటే వాళ్ల కాన్ఫిడేన్స్‎కు కూడా కారణం ఉందనుకోండి...

Ind Vs Pak: మ్యాచ్‎కు ముందు అంతా మనకే అనుకూలం.. కానీ ఆరోజు మనది కాదు..
India
Follow us on

టీ 20 వరల్డ్ కప్‎లో హాట్ ఫెవరేట్‎గా బరిలోకి దిగింది భారత్. పాకిస్తాన్‎తో మ్యాచ్‎లో ఇండియాదే పైచేయి అని భావించారు. కొందరైతే భారత్ గెలుస్తుందని టాపాసులు కూడా పేల్చారు. అంటే వాళ్ల కాన్ఫిడేన్స్‎కు కూడా కారణం ఉందనుకోండి. ఎందుకంటే అక్కడే మనోళ్లు ఐపీఎల్ ఆడడం, వార్మప్ మ్యాచ్‎ల్లో రెండు పెద్ద జట్లను ఓడించడం, గతంలో పాక్‎పై ఇండియాకు ఘనమైన రికార్డు ఉండడం ఇవన్నీ టీం ఇండియాకు అనుకూలంగానే ఉన్నాయి. అటు పాకిస్తాన్ కొత్త ఆటగాళ్లతో ఉంది. స్వదేశంలో జరిగాల్సిన సిరిస్ రద్దుతో సంక్షోభ పరిస్థితుల్లో వరల్డ్ కప్‎కు వచ్చింది. దీంతో అంతా భారత్ వైపే ఉన్నారు.. ఇండియా ఓడిపోతుందని ఎవరికీ ఆలోచన కూడా రాలేదు.. మ్యాచ్ ప్రారంభానికి ముందు అనేక టీవీ ఛానళ్లు ఈ మ్యాచ్‎పై డిబెట్లు పెట్టాయి. అభిమానులు అందురు భారత్ గెలుస్తుందని ఘంటాపథంగా చెప్పారు. ఇంతలో మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఇండియా భారీ స్కోరు చేస్తుందని అంతా భావించారు. రోహిత్, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు.

అయితే మొదటి ఓవర్‎లోనే ఇండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. షాహిన్‌ అఫ్రిది వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్ నాలుగో బంతికి రోహిత్‌ శర్మ ఎల్బీగా వెనుదిరిగాడు. రోహిత్ ఒక్కడే కాద అవుటయింది. ఇంకా రాహుల్ ఉన్నాడు, కోహ్లీ, సూర్యకుమార్, పంత్, హార్దిక్ ఉన్నారు అనుకున్నారంతా.. కానీ రెండో ఓవర్‎లో మొదటి బంతికే రాహుల్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత పాక్ ఇండియాకు అవకాశమే ఇవ్వలేదు. క్రమం తప్పకుండా వికెట్లు తీసింది. అయినా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం చేశాడు. కోహ్లీకి రిషబ్ పంత్ కొంత సహకారం అందించాడు. దీంతో భారత్ 151 పరుగులు చేయగలిగింది.

పిచ్ బౌలింగ్‎కు అనుకూలంగా ఉంది. పాక్ 151 చేధించండ కష్టమని భావించారు. అప్పటికీ ఇండియా గెలుస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. పాక్ బ్యాంటింగ్‎కు దిగింది. రిజ్వన్, అజమ్ ఓపెనర్లుగా దిగారు. మొదటి ఓవర్ భువనేశ్వర్ కుమార్ వేశాడు. మొదటి ఓవర్ రెండో బంతిని రిజ్వన్ ఫోర్ కొట్టాడు. మూడో బంతిని సిక్స్‎గా మలిచాడు. పాక్ ఫాస్ట్ ఓవర్‎లోనే 10 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత భారత్ పాక్‎ను ఏ దశలోనూ అడ్డుకోలేకపోయింది. దీంతో పాక్ 17.5 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని చేధించి విజయం సాధించింది. పాక్ విజయంతో ఆ దేశ అభిమానులు సంబురాలు చేసుకున్నారు. మనదైన రోజు నాడు ఎవరూ ఏం చేయలేరని అనేది ఈ మ్యాచ్‎తో మరోసారి నిరూపితమైంది. అయితే భారత ఆటగాళ్ల నిర్లక్ష్యపు బ్యాటింగ్‎పై విమర్శలు వస్తున్నాయి. కీలకమైన మ్యాచ్‌లో రోహిత్ శర్మ డకౌట్ కావడం పట్ల సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. పాక్‌తో కీలకమైన మ్యాచ్‌లో ఇలా సిల్లీ గేమ్ ఆడుతావని అనుకోలేదని ఓ నెటిజన్ కామెంట్స్ చేస్తున్నారు.

Read Also..IND vs PAK Match: ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌పై స్పందించిన ఎమ్మెల్యే రాజాసింగ్‌.. భారత ఓటమిపై ఏమన్నారంటే..