T20 World Cup 2021: అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బాబర్‌ అజమ్‌.. కోహ్లీని సైతం వెనక్కి నెట్టి మరీ..

|

Nov 11, 2021 | 8:37 PM

T20 World Cup 2021: టీ20 వరల్డ్‌ కప్‌ 2021లో పాకిస్తాన్‌ అద్భుత ఆటతీరును కనబరుస్తోంది. భారత్‌తో మొదలైన జైతయాత్ర కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్‌లలో పాక్‌ జయకేతనం ఎగరవేసింది. ఇదిలా ఉంటే..

T20 World Cup 2021: అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బాబర్‌ అజమ్‌.. కోహ్లీని సైతం వెనక్కి నెట్టి మరీ..
Babar Azam
Follow us on

T20 World Cup 2021: టీ20 వరల్డ్‌ కప్‌ 2021లో పాకిస్తాన్‌ అద్భుత ఆటతీరును కనబరుస్తోంది. భారత్‌తో మొదలైన జైతయాత్ర కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్‌లలో పాక్‌ జయకేతనం ఎగరవేసింది. ఇదిలా ఉంటే పాక్‌ బ్యాట్స్‌మెన్‌లో బాబర్‌ అజమ్‌ మంచి ఆటతీరును కనబరుస్తున్నాడు. గ్రౌండ్‌లో పరుగుల వరద కురిపిస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడంతో పాటు వ్యక్తిగత స్కోరును కూడా పెంచుకుంటూ పోతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో బాబార్‌ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఏకంగా విరాట్‌ కోహ్లీని అధిగమించి మరీ బాబర్‌ ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు.

టీ20 చరిత్రలో అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌లో 2500 పరుగులను పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా బాబర్‌ రికార్డు దక్కించుకున్నాడు. బాబర్‌ కేవలం 62 ఇన్నింగ్స్‌లో 2500 పరుగులు సాధించాడు. అంతకు ముందు ఈ రికార్డు కోహ్లీ పేరు మీద ఉంది. విరాట్‌ కోహ్లీ 68 ఇన్నింగ్స్‌లో 2500 పరుగులను సాధించాడు. ఇక ఆ తర్వాతి స్థానంలో అరాన్‌ ఫించ్‌ 78 ఇన్నింగ్స్‌లో 2500 పరుగుల మార్కును చేరుకున్నాడు. ఇక రెండో సెమీఫైనల్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మ్యాచ్‌లో బాబర్‌ 39 పరుగులు చేసి వెనుతిరిగాడు.

Also Read: Kartik Purnima: కార్తీక పౌర్ణమిరోజున పాక్షిక చంద్రగ్రహణం.. మనదేశంలో ఎక్కడ కనిపించనున్నదంటే..

Japanese Train: రైలును నిమిషం ఆలస్యంగా నడిపినందుకు డ్రైవర్‌కు ఫైన్.. న్యాయం జరిగేవరకూ పోరాడతా అంటున్న రైల్వే డ్రైవర్..

Telangana: షాకింగ్.. ఆ హోటల్‌లో వేడివేడిగా బూజుపట్టిన చికెన్.. పురుగుల పడిన రొయ్యలు