World Cup 2023: ప్రపంచకప్‌లో ఆడే పాకిస్తాన్‌ జట్టు ఇదే.. స్టార్‌ పేసర్‌ ఔట్‌..ఊహించని ప్లేయర్ల ఎంట్రీ

|

Sep 22, 2023 | 5:29 PM

భారతదేశంలోని పిచ్‌లు స్పిన్నర్లకు ఉపయోగపడతాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ ఫహీమ్ అష్రాఫ్ స్థానంలో లెగ్ స్పిన్నర్ మీర్‌ను ఎంపిక చేశారు. అయితే నసీమ్‌ షా లేపోయినా పాకిస్థాన్ బౌలింగ్ మాత్రం చాలా బలంగా కనిపిస్తోంది. జట్టులో షాహీన్ షా ఆఫ్రిది, హరీస్ రౌఫ్, మహ్మద్ వసీం జూనియర్, హసన్ అలీ వంటి స్టార్‌ బౌలర్లు ఉన్నారు. ఇక స్పిన్నర్ల గురించి చెప్పాలంటే.. జట్టులో ప్రధాన స్పిన్నర్ షాదాబ్ ఖాన్. అతడితో పాటు జట్టులో మహ్మద్ నవాజ్, మీర్ ఉన్నారు.

World Cup 2023: ప్రపంచకప్‌లో ఆడే పాకిస్తాన్‌ జట్టు ఇదే.. స్టార్‌ పేసర్‌ ఔట్‌..ఊహించని ప్లేయర్ల ఎంట్రీ
Pakistan Cricket Team
Follow us on

అక్టోబర్ 5 నుంచి భారత్ ప్రారంభమయ్యే ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు శుక్రవారం జట్టును ప్రకటించింది. ఆసియా కప్‌లో ఆడిన ఇద్దరు ఆటగాళ్లను ఈ జట్టు నుంచి తప్పించారు. గాయం కారణంగా స్టార్‌ పేసర్‌ నసీమ్ షా మెగా క్రికెట్ టోర్నీకి దూరమయ్యాడు. అతని స్థానంలో హసన్ అలీ జట్టులోకి వచ్చాడు. ఫాస్ట్ బౌలర్ ఫహీమ్ అష్రాఫ్ స్థానంలో లెగ్ స్పిన్నర్ ఉసామా మీర్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఆసియా కప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో హరీస్ రవూఫ్ గాయపడినప్పటికీ అతను ఫిట్‌గా ఉన్నాడని తెలుస్తోంది. అందుకే వరల్డ్‌ కప్‌ జట్టులో చోటు నిలుపుకున్నాడు. అయితే అదే మ్యాచ్‌లో గాయపడిన నసీమ్ షా ఫిట్‌గా లేడని తెలుస్తోంది. సుమారు 6-8 నెలలుగా జట్టుకు దూరంగా ఉండవచ్చని సమాచారం. కాగా నసీమ్ షా లేకపోవడం పాక్‌ జట్టుకు ఎదురు దెబ్బేనని చెప్పుకోవచ్చు. మరి హసన్ అలీ అతని స్థానాన్ని భర్తీ చేస్తాడా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. కాగా భారతదేశంలోని పిచ్‌లు స్పిన్నర్లకు ఉపయోగపడతాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ ఫహీమ్ అష్రాఫ్ స్థానంలో లెగ్ స్పిన్నర్ మీర్‌ను ఎంపిక చేశారు. అయితే నసీమ్‌ షా లేపోయినా పాకిస్థాన్ బౌలింగ్ మాత్రం చాలా బలంగా కనిపిస్తోంది. జట్టులో షాహీన్ షా ఆఫ్రిది, హరీస్ రౌఫ్, మహ్మద్ వసీం జూనియర్, హసన్ అలీ వంటి స్టార్‌ బౌలర్లు ఉన్నారు. ఇక స్పిన్నర్ల గురించి చెప్పాలంటే.. జట్టులో ప్రధాన స్పిన్నర్ షాదాబ్ ఖాన్. అతడితో పాటు జట్టులో మహ్మద్ నవాజ్, మీర్ ఉన్నారు. ఈ ముగ్గురూ ఆల్‌రౌండర్లు కావడం పాక్‌ జట్టుకు అతి పెద్ద సానుకూలాంశం.

అయితే పాక్‌ బ్యాటింగ్‌ మాత్రం కొంచెం బలహీనంగా కనిపిస్తోంది. జట్టులో కెప్టెన్ బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ జట్టు ప్రధాన బ్యాటర్లుగా ఉన్నారు. వీరిద్దరూ క్రీజులో ఉన్నంత సేపు పాక్ బ్యాటింగ్ పటిష్టంగా ఉంటుంది. అయితే వీరిద్దరూ త్వరగా ఔటైతే ఆ జట్టు చిక్కుల్లో పడుతుంది. ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్ పాకిస్థాన్ ఓపెనింగ్‌కు దిగనుండగా.. మిడిల్ ఆర్డర్‌లో ఇఫ్తికర్ అహమ్, రిజ్వాన్, సల్మాన్ అలీ అఘా ఉన్నారు. మిడిల్ ఆర్డర్ పాకిస్థాన్ ప్రధాన బలహీనత. వరల్డ్‌ కప్‌ టీమ్‌లోనూ ఇది కనిపిస్తుంది .కాగా పాకిస్తాన్ చివరిగా1992లో వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది. అప్పటి నుండి ఈ జట్టు మళ్లీ ప్రపంచ ఛాంపియన్‌గా నిలవలేదు. ఈసారి ఎలాగైనా వరల్డ్‌ కప్‌ టైటిల్‌ను సొంతం చేసుకోవాలనే దృఢ నిశ్చయంతో ఉంది.

ఇవి కూడా చదవండి

పాకిస్థాన్ వరల్డ్ కప్ జట్టు:

 

బాబర్ అజామ్ (కెప్టెన్‌), ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, అఘా సల్మాన్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఉసామా మీర్, షాహీన్ షా ఆఫ్రిది, హరీస్ రవూఫ్, మహ్మద్ వాసిమ్, హసన్ అలీ.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..