ICC Men’s ODI world cup Pakistan vs Sri Lanka Playing XI: వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్, శ్రీలంక జట్లు 8వ మ్యాచ్‌లో తలపడుతున్నాయి. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు కెప్టెన్ దసున్ షనక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇరు జట్లు ఇప్పటి వరకు 156 వన్డే మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. పాక్ జట్టు 92 మ్యాచ్‌లు గెలుపొందగా, శ్రీలంక జట్టు 59 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో మ్యాచ్ టై అయింది. 4 మ్యాచ్‌లు రద్దు అయ్యాయి.
శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక (కెప్టెన్), దునిత్ వెల్లాలఘే, మహిష్ తీక్షణ్, మతీష్ పతిరణ, దిల్షన్ మధుశంక.
పాకిస్థాన్ (ప్లేయింగ్ ఎలెవన్): అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్.
శ్రీలంక జట్టు: దసున్ షనక (కెప్టెన్), కుసల్ మెండిస్ (వైస్ కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా (వికెట్ కీపర్), దిముత్ కరుణరత్నే, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, సదీర సమరవిక్రమ (వికెట్ కీపర్), దుషన్ హేమంత, మహిష్ తీక్షణ , దునిత్ వెల్లాలగే, కసున్ రజిత, దిల్షన్ మధుశంక, మతీష పతిరన, లహిరు కుమార్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..