PAK vs BAN Playing 11: టాస్ గెలిచిన బంగ్లా.. సూపర్ 4 తొలి మ్యాచ్‌లో పాక్‌తో కీలక పోరు..

Pakistan vs Bangladesh Playing 11: ఈ మ్యాచ్ ద్వారా రెండో రౌండ్‌లో శుభారంభం చేయాలని ఇరు జట్లు లక్ష్యంగా పెట్టుకున్నాయి. బాబర్ అజామ్ జట్టు తమ సొంత అభిమానుల ముందు గెలవాలని మాస్టర్ ప్లాన్ వేసింది. ఎందుకంటే ఈ మ్యాచ్ మినహా సూపర్-4లోని మిగతా మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే జరుగుతాయి. తద్వారా సొంత మైదానాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా పాక్ జట్టు విజయం సాధిస్తుందన్న విశ్వాసంతో ఉంది.

PAK vs BAN Playing 11: టాస్ గెలిచిన బంగ్లా.. సూపర్ 4 తొలి మ్యాచ్‌లో పాక్‌తో కీలక పోరు..
Pak Vs Ban

Updated on: Sep 06, 2023 | 2:56 PM

Pakistan vs Bangladesh Playing 11: ఆసియా కప్ సూపర్-4 తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. లాహోర్‌లోని గడాఫీ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా రెండో రౌండ్‌లో శుభారంభం చేయాలని ఇరు జట్లు లక్ష్యంగా పెట్టుకున్నాయి.

బాబర్ అజామ్ జట్టు తమ సొంత అభిమానుల ముందు గెలవాలని మాస్టర్ ప్లాన్ వేసింది. ఎందుకంటే ఈ మ్యాచ్ మినహా సూపర్-4లోని మిగతా మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే జరుగుతాయి. తద్వారా సొంత మైదానాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా పాక్ జట్టు విజయం సాధిస్తుందన్న విశ్వాసంతో ఉంది.

ఇరు జట్లు:

పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(సి), మహ్మద్ రిజ్వాన్(w), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్.

ఇరుజట్లు ప్లేయింగ్ 11:

ఆసియా కప్ గణాంకాలు..

బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): మహ్మద్ నైమ్, మెహిది హసన్ మిరాజ్, లిట్టన్ దాస్, తౌహిద్ హృదయ్, షకీబ్ అల్ హసన్(సి), ముష్ఫికర్ రహీమ్(w), షమీమ్ హొస్సేన్, అఫీఫ్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, షోరీఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్.

హెడ్ టూ హెడ్ రికార్డులు..

వన్డే ఆసియాకప్‌లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో పాకిస్థాన్ టీం 12 మ్యచ్‌లు గెలిచింది. బంగ్లాదేశ్ టీం ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది. ఈ విజయం 2018 ఆసియా కప్‌లో వచ్చింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..