PAK vs AUS: ఆస్ట్రేలియాకు భారీ షాక్.. పాక్‌తో వన్డే సిరీస్‌కు కీలక ప్లేయర్ దూరం..

|

Mar 22, 2022 | 11:33 AM

మార్చి 29 నుంచి పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. 3 వన్డేల సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు లాహోర్‌లో జరగనున్నాయి.

PAK vs AUS: ఆస్ట్రేలియాకు భారీ షాక్.. పాక్‌తో వన్డే సిరీస్‌కు కీలక ప్లేయర్ దూరం..
Pakistan Vs Australia Kane Richardson
Follow us on

పాకిస్థాన్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా(Pakistan Vs Australia) జట్టుకు బ్యాడ్ న్యూస్ అందింది. కేన్ రిచర్డ్‌సన్‌(Kane Richardson)ను సిరీస్ నుంచి తప్పుకోవడంతో ఆ సిరీస్‌లో ఆస్ట్రేలియా కష్టాలు పెరుగుతాయనడంలో సందేహం లేదు. వాస్తవానికి, రిచర్డ్‌సన్ నిష్క్రమణ తర్వాత ఆస్ట్రేలియా పేస్ అటాక్ అంతగా అనుభవం లేనిదిగా కనిపిస్తోంది. పాకిస్థాన్‌తో వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా(Australia Cricket Team) ప్రస్తుతం పేస్ బౌలింగ్‌లో వాడి కనిపించడంలేదు. మార్చి 29 నుంచి పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. 3 వన్డేల సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు లాహోర్‌లో జరగనున్నాయి.

కేన్ రిచర్డ్సన్ స్నాయువు గాయంతో బాధపడుతున్నాడు. ఈ కారణంగా అతను ఈ సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. సోమవారం మెల్‌బోర్న్‌లో శిక్షణ పొందుతుండగా రిచర్డ్‌సన్‌ గాయపడ్డాడు. అతని స్థానంలో లెఫ్టార్మ్ బౌలర్ బెన్ ద్వార్షుయిస్ వన్డే, టీ20 సిరీస్‌ల కోసం జట్టులోకి వచ్చాడు.

Also Read: Women’s World Cup 2022: అగ్రస్థానం చేరిన ఆస్ట్రేలియా.. వరుసగా ఆరో విజయం.. కీలక పోరులో దక్షిణాఫ్రికా ఓటమి

IND vs BAN, Women’s World Cup 2022: బ్యాటింగ్‌లో తడబడిన భారత్.. బంగ్లా టార్గెట్ 230.. మిథాలీ సేన ఓడితే సెమీస్ కష్టమే