AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : ఒకదానిని మించి ఇంకోటి వెస్టిండీస్ ఆటగాళ్ల సూపర్‌మ్యాన్ క్యాచ్‌లు…చూసేందుకు రెండు కళ్లు చాలవు

బంగ్లాదేశ్, వెస్టిండీస్ మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతోంది. సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో వెస్టిండీస్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ తరపున అద్భుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనిపించింది. ఈ మ్యాచ్‌లో రెండు అద్భుతమైన క్యాచ్‌లు క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించాయి.

Video : ఒకదానిని మించి ఇంకోటి వెస్టిండీస్ ఆటగాళ్ల సూపర్‌మ్యాన్ క్యాచ్‌లు...చూసేందుకు రెండు కళ్లు చాలవు
Amazing Catches
Rakesh
|

Updated on: Oct 28, 2025 | 8:37 AM

Share

Video : బంగ్లాదేశ్, వెస్టిండీస్ మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతోంది. సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో వెస్టిండీస్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ తరపున అద్భుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనిపించింది. ఈ మ్యాచ్‌లో రెండు అద్భుతమైన క్యాచ్‌లు క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. ఇవి ఆటను మరింత ఉత్కంఠభరితంగా మార్చాయి. వెస్టిండీస్ బౌలర్లు, ఫీల్డర్‌లు తమ వేగంతో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బందుల్లో పడవేసి మ్యాచ్‌ను గెలిచారు.

మ్యాచ్‌లో మొదటి అద్భుతమైన క్షణం వెస్టిండీస్ పేస్ బౌలర్ జెడెన్ సీల్స్ బంగ్లాదేశ్ ఓపెనర్ తంజీద్ హసన్‎ను పెవిలియన్ చేర్చినప్పుడు వచ్చింది. ఇన్నింగ్స్ రెండవ ఓవర్‌లో సీల్స్ ఆఫ్ స్టంప్ వెలుపల వేగవంతమైన షార్ట్ పిచ్ బంతిని వేశాడు, దానిని తంజీద్ స్వివెల్ పుల్ షాట్‌తో ఆడటానికి ప్రయత్నించాడు. కానీ తప్పుడు టైమింగ్ కారణంగా బంతి గాల్లోకి మిడ్-ఆన్ వైపు ఎగిరింది. అక్కడ ఉన్న రొమారియో షెఫర్డ్ వెంటనే అలర్ట్ అయి బంతిని వెంబడిస్తూ అతను వెనుకకు పరుగెత్తి గాల్లోకి ఒక డైవ్ వేసి బంతిని పట్టుకున్నాడు. ఈ క్యాచ్ ఎంత అద్భుతంగా ఉందంటే స్టేడియంలో ఉన్న అభిమానులు, కామెంటేటర్‌లు కూడా ఆశ్చర్యపోయారు. షెఫర్డ్ పట్టిన ఈ క్యాచ్ వెస్టిండీస్‌కు ప్రారంభ విజయాన్ని అందించింది.

రెండవ అద్భుతమైన క్యాచ్ వెస్టిండీస్ స్పిన్నర్ అకీల్ హొసేన్ తన సొంత బౌలింగ్‌లో తీసుకున్నాడు. బంగ్లాదేశ్ సీనియర్ బ్యాట్స్‌మెన్ లిటన్ దాస్ను ఔట్ చేయడానికి అకీల్ హొసేన్ అద్భుతంగా తన టాలెంటును చూపించాడు. వాస్తవానికి, హోసేన్ బ్యాక్-ఆఫ్-లెంగ్త్ బంతిని వేశాడు. లిటన్ వెనక్కి తగ్గి బంతిని క్రాస్ లైన్‌లో ఆడటానికి ప్రయత్నించాడు, కానీ బ్యాట్ అంచుకు తగిలి బంతి హోసేన్ కుడి వైపు గాల్లోకి ఎగిరింది. అకీల్ హొసేన్ వెంటనే తన కుడి వైపుకు దూకి, తన కుడి చేతిని పూర్తిగా చాచి ఒక చేత్తో బంతిని ఒడిసిపట్టుకున్నాడు. ఈ క్యాచ్ చాలా వేగంగా ఉంది, లిటన్ కూడా తన ఔట్ అయ్యేంత వేగంగా పట్టిన క్యాచ్‌ను నమ్మలేకపోయాడు. ఈ రెండు క్యాచ్‌ల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

మ్యాచ్ గురించి చెప్పాలంటే, వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా, బంగ్లాదేశ్ జట్టు 19.4 ఓవర్లు మాత్రమే ఆడి 149 పరుగులకు ఆల్ ఔట్ అయ్యింది. దీనితో వెస్టిండీస్ జట్టు ఈ మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో విజయం సాధించగలిగింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత